TGPSC Notification : నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన టీజీపీఎస్సీ.. పోస్టులు ఇవే.. ఎగ్జామ్ ఎప్పుడంటే?

TGPSC Notification : తెలంగాణలోని నిరుద్యోగులకు టీజీపీఎస్సీ శుభవార్త చెప్పింది. డైట్ కాలేజీల్లో 86 సీనియర్ లెక్చరర్, లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

TGPSC Notification

  • తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్
  • 86 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన టీజీపీఎస్సీ
  • జూలై 29 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం

TGPSC Notification : తెలంగాణలోని సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పలు శాఖల్లోని పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టింది. ఈక్రమంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) వరుస నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. తాజాగా.. మరో నోటిఫికేషన్ విడుదలైంది. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ పరిధిలోని జిల్లా విద్యా శిక్షణ సంస్థల్లో (డైట్ కాలేజీలు) ఖాళీగా ఉన్న 86 లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో 23 సీనియర్ లెక్చరర్ పోస్టులు, 63 లెక్చరర్ పోస్టులు ఉన్నాయి.

Also Read : Registration services suspended : ప్రజలకు బిగ్ అలర్ట్.. ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు బ్రేక్.. ఈ తేదీల్లో సేవలు బంద్.. కారణం ఇదే..

నోటిఫికేషన్‌లో ప్రకటించిన వివరాల ప్రకారం.. ఆయా పోస్టులకు ఈనెల 24వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ప్రారంభం కానుండగా.. జులై 29వ తేదీ సాయంత్రం 5గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు టీజీపీఎస్సీ గడువు ఇచ్చింది. పరీక్షకు వారం రోజుల ముందు హాల్ టికెట్లను వెబ్ సైట్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చునని కమిషన్ తెలిపింది. నవంబర్ నెలలో రాత పరీక్షలు (ఆబ్జెక్టివ్ టైప్) నిర్వహించే అవకాశం ఉందని ప్రకటించింది.

పోస్టుల వివరాలు ఇవే..
మొత్తం 19 కేటగిరీల్లో ఈ 86 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో లెక్చరర్ పోస్టులు 23, ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సర్వీస్ ట్రైనింగ్ లెక్చరర్ల పోస్టులు 16 ఉన్నాయి. తెలుగులో 8, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ స్టడీస్ సబ్జెక్టుల్లో మూడు చొప్పున పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా ఎడ్యుకేషన్ విభాగంలో రెండు ఖాళీలు ఉన్నాయి. ఇక ఉర్దూ మీడియం కేటగిరిలో ఎడ్యుకేషన్ నాలుగు, మ్యాథ్స్ రెండు, సైన్స్ రెండు, సోషల్ రెండు, ఉర్దూ లాంగ్వేజ్ ఒక పోస్టును భర్తీ చేయనున్నారు. వీటితోపాటు సైకాలజీ, ఆర్ట్ ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్ సబ్జెక్టుల్లో మూడేసి పోస్టులు.. ప్లానింగ్ అండ్ స్టాటిస్టిక్స్, ఎడ్యుకేషన్ టెక్నాలజీ విభాగాల్లో రెండేసి ఖాళీలతో పాటు ఫిలాసఫీ సబ్జెక్టులో ఒక పోస్టును ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోతున్నారు.

ఎగ్జామ్ విధానం ఇలా..
ఈ పోస్టులకు సంబంధించి నవంబర్ నెలలో రాత పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ఎగ్జామ్ మొత్తం 450 మార్కులకు ఉంటుంది. పేపర్ -1 (జనరల్ స్టడీస్) 150 మార్కులకు, పేపర్-2 (సబ్జెక్ట్ నాలెడ్జ్) 300 మార్కులకు ఉంటుంది. మరిన్ని వివరాల కోసం www.tgpsc.gov.in ను చూడాలని టీజీపీఎస్సీ సూచించింది. దరఖాస్తు చేసుకునే వారు టీజీపీఎస్సీ వెబ్ సైట్ ద్వారా వన్ టైం రిజిస్ట్రేషన్ ఐడీతో లాగిన్ అయ్యి అప్లయ్ చేయాలని, అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు రూ. వెయ్యి, ఎగ్జామ్ ఫీజు రూ.120 చెల్లించాలని టీజీపీఎస్పీ నోటిఫికేషన్ లో పేర్కొంది.