Rythu Bharosa Funds: రైతులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.. ఈ నెల 20న ఖాతాల్లోకి డబ్బులు
ఈ విడతలో మొత్తం 5వేల 653 కోట్ల నిధులను ప్రభుత్వం రైతుల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేయనుంది. ఎకరానికి 6వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి.
- Naveen
- Updated on- April 18, 2026 / 08:11 PM IST
- రైతు భరోసా రెండో విడత నిధుల విడుదలకు సిద్ధం
- ఈ నెల 20న నిధులు విడుదల
- రెండో విడతలో 45,11,947 మంది రైతులకు లబ్ది
- రైతుల ఖాతాల్లో జమ కానున్న రూ.5,653 కోట్లు
Rythu Bharosa Funds: రైతులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రెండో విడత రైతు భరోసా నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 20న సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. ఈ వేదిక నుంచే కంప్యూటర్ బటన్ నొక్కి రైతుల ఖాతాల్లోకి నేరుగా నిధులను జమ చేయనున్నారు.
రెండో విడతలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 45 లక్షల 11 వేల 947 మంది రైతులకు లబ్ది కలగనుంది. ఈ విడతలో మొత్తం 5వేల 653 కోట్ల నిధులను ప్రభుత్వం రైతుల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేయనుంది. ఎకరానికి 6వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. రాష్ట్రంలోని 1.50 కోట్ల ఎకరాలకు పెట్టుబడి సాయం అందిస్తోంది సర్కార్. తొలి విడతగా ఇప్పటికే 3వేల 590 కోట్లు అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు.
Also Read: తెలంగాణలో త్వరలో భూముల ధరలు పెంపు..! మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
