×
Ad

Kavitha: కవితకు క్లీన్‌చిట్.. పొలిటికల్‌గా అన్‌స్టాపబులేనా..? బీఆర్ఎస్, బీజేపీ టార్గెట్‌గానే ఫైట్ కొనసాగనుందా?

ఇప్పటికైనా బీఆర్ఎస్ నేతలు వాస్తవాలు అర్ధం చేసుకోవాలన్నారు. రెండు నెలల్లో తాను కొత్త పార్టీ పెట్టబోతున్నానని, అలాంటి సమయంలో ఈ తీర్పు రావడం దేవుడి ఆశీర్వాదం అన్నారు.

  • Published On : February 27, 2026 / 08:25 PM IST

Kavitha Representative Image (Image Credit To Original Source)

 

  • పార్టీ పెట్టాక ఆమె దూకుడు మరింత పెరగనుందా?
  • బీఆర్ఎస్, బీజేపీ టార్గెట్‌గానే కవిత ఫైట్ కొనసాగనుందా?
  • కేటీఆర్ ట్వీట్‌కు కవిత కౌంటర్‌తో సరికొత్త చర్చ
  • సత్యమే గెలిచింది..తగ్గేదేలే అంటున్న కవిత..

Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులందరికీ క్లీన్‌ చిట్‌ వచ్చింది. మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్, మాజీ ఎమ్మెల్సీ కవిత సహా మొత్తం 23 మంది నిందితులకు ఊరట లభించింది. ఆ కేసులో కవిత పేరు తెరమీదకు వచ్చినప్పటి నుంచి..అరెస్ట్ వరకు..ఆ తర్వాత జైలు నుంచి విడుదల వరకు ఎన్నో డెవలప్ మెంట్స్ జరిగాయి. జైలు నుంచి విడుదల అయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ యాక్టివిటీకి ఆమెను దూరంగా ఉంచారు గులాబీ బాస్. కొద్దిరోజుల పాటు సైలెంట్‌గానే ఉన్న ఆమె..ఆ తర్వాత కేటీఆర్, హరీశ్‌రావు, సంతోష్‌తో పాటు ఇండైరెక్టుగా గులాబీ బాస్ కేసీఆర్‌ను ఇరుకున పెట్టేలా కామెంట్స్‌ చేసి గులాబీ దళంలో అగ్గిరాజేశారు.

సొంత కుంపటి పెట్టుకునేందుకు గ్రౌండ్ ప్రేపర్..

ఆ తర్వాత బీఆర్ఎస్‌కు దూరమైన కవిత..సొంత కుంపటి పెట్టుకునేందుకు గ్రౌండ్ ప్రేపర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆమె జిల్లాల పర్యటన చేస్తూ..ఫైనల్‌గా పార్టీ పెడతానని కూడా ప్రకటించారు. ఇక లేటెస్ట్‌గా కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంతో సంతోషం వ్యక్తం చేసిన కవిత..సత్యమే గెలుస్తుందన్న నమ్మకం పెరిగిందన్నారు. ఎప్పటికైనా కడిగిన ముత్యంలా బయటకు వస్తానని తెలుసు. ఈ రెండున్నరేళ్లు చాలా మంది అవమానకరంగా విమర్శలు.. సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసి వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు.

కవితకు క్లీన్ చిట్ రావడంపై సంతోషం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ట్వీట్, దానికి కవిత చేసిన రీట్వీట్‌ కలకలం రేపుతోంది. ఈ ట్వీట్‌లో కవితకు కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడాన్ని స్వాగతిస్తూనే..తమ ప్రభుత్వం పడిపోయేందుకు ఈ తప్పుడు కేసు కూడా కారణమయ్యిందంటూ కేటీఆర్ చెప్పడాన్ని కవిత తప్పుబట్టారు. తాను జైలుకు వెళ్లేంత వరకూ కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ ఎందుకు ప్రెస్‌మీట్‌ పెట్టలేదని కవిత ప్రశ్నించారు.

బీఆర్ఎస్ ఓటమిని నా మెడలో వేయాలని కేటీఆర్ చూస్తున్నారు..

బతుకమ్మకు తాను బ్రాండ్ అంబాసిడర్‌గా మారితే వాటి స్ధానంలో లిక్కర్ బాటిల్స్ పెట్టిన సమయంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా ఎక్కడుందన్నారు. బీఆర్ఎస్ ఓటమిని తన మెడలో వేయాలని కేటీఆర్ చూస్తున్నారన్నారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నేతలు వాస్తవాలు అర్ధం చేసుకోవాలన్నారు. రెండు నెలల్లో తాను కొత్త పార్టీ పెట్టబోతున్నానని, అలాంటి సమయంలో ఈ తీర్పు రావడం దేవుడి ఆశీర్వాదం అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అంటూ మరోసారి అటాక్ చేశారు కవిత.

కవిత ఇప్పటికే బీఆర్ఎస్ టార్గెట్ గా విమర్శల దాడి చేస్తున్నారు. ఇప్పటికీ మాజీ మంత్రి హరీశ్‌రావు, సంతోష్ టార్గెట్‌గా అలిగేషన్స్ చేస్తూనే ఉన్నారు. జిల్లాల పర్యటనలో కూడా కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులనే టార్గెట్ చేసి చర్చకు దారితీస్తున్నారు. ఇప్పుడు కేటీఆర్ ట్వీట్‌కు రిప్లై ఇచ్చి మరోసారి కారు పార్టీకి సవాల్‌గా మారారు. ఇప్పటికే జిల్లాల పర్యటన చేస్తున్న కవిత..మున్సిపల్ ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీతో కలిసి పోటీ చేసి ఓ మున్సిపాలిటీని స్వాధీనం చేసుకున్నారు. త్వరలో రాజకీయ పార్టీ ప్రకటిస్తానని..ఆ తర్వాత కొందరికి చాలా షాక్‌లు ఉంటాయంటూ కామెంట్స్ చేసి చర్చకు దారితీస్తున్నారు. అయితే పార్టీ ఏర్పాటుపై అయినా..లేక ఏ పార్టీలోకి వెళ్లాలన్నా..భవిష్యత్‌లో పొత్తుల కోసమైనా ఆమెకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణలు అడ్డంకిగా ఉండేవి. ఇప్పుడు అలిగేషన్స్‌కు కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంతో పొలిటికల్‌గా కవిత ఇక అన్ స్టాపబుల్ అన్న చర్చ జరుగుతోంది.

ఇప్పటికే బీఆర్ఎస్‌తో విభేదించిన కవిత..కారు, కమలం పార్టీలు ఒక్కటే అంటూ అలిగేషన్స్ చేస్తున్నారు. ఫ్యూచర్‌లోనూ బీఆర్ఎస్, బీజేపీ టార్గెట్‌గా ఆమె పొలిటికల్ ఫైట్ కొనసాగే అవకాశం ఉంది. కవిత కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునే అవకాశాలపై ఈ తీర్పు కొత్త ఊపిరులు ఊదినట్టైంది. ఒకవేళ పొత్తుకు అవకాశముంటే క్లీన్ చిట్ రూట్ క్లియర్ చేసినట్లే. కవిత కొత్త పార్టీ పెట్టినప్పటికీ బీజేపీ-బీఆర్ఎస్‌పైనే దాడి చేసే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో కవిత దూకుడు ఎలా ఉంటుందో? ఆమె రాజకీయ అడుగులు ఎటు వైపు పడతాయో చూడాలి.

Also Read: ఎన్నికలకు ముందు విజయ్ కు షాక్.. విడాకుల కోసం కోర్టుకెళ్లిన భార్య