Cm Revanth Reddy: నేషనల్ పాలిటిక్స్‌లోకి రేవంత్..!? సత్తా చాటగలరా? ప్లాన్స్ వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉందా?
అపర చాణక్యుడిగా పేరున్న కేసీఆర్‌ను ఓడించి సీఎం కావడంతో రేవంత్ రెడ్డికి ఒక్కసారిగా జాతీయ స్థాయిలో ఎక్స్ పోజర్ పెరిగింది. తన మాట తీరు..స్పాంటేనియస్ అటాకింగ్‌తో డైనమిక్ లీడర్‌గా పేరు తెచ్చుకున్న రేవంత్..కాంగ్రెస్ నేషనల్ స్టార్ క్యాంపెయినర్స్ లిస్ట్‌లో మొదటి వరుసలో చేరిపోయారు.
- Naveen
- Updated on- May 6, 2026 / 12:27 AM IST
- సీఎం రేవంత్‌కు జాతీయ స్థాయిలో ఎక్స్‌పోజర్
- పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా పలు రాష్ట్రాల్లో ప్రచారం
- లేటెస్ట్‌గా కేరళంలో కాంగ్రెస్ విజయంతో మరింత హైప్
- ఏఐసీసీలో కీలక స్థాయికి ఎదిగే అవకాశం ఉందా.?
Cm Revanth Reddy: పట్టుబట్టి తెలంగాణ సీఎం అయ్యారు. టైమ్..టైమింగ్ కలిసి వచ్చి..నేషనల్ పాలిటిక్స్‌లోనూ కీ రోల్ ప్లే చేస్తున్నారు సీఎం రేవంత్. అయితే తెలంగాణలో వన్స్ అగెయిన్ తానే సీఎం అవుతానంటున్న ఆయన..ఇప్పుడు సెకండ్ టార్గెట్‌ను ఫిక్స్ చేసుకుని దూసుకెళ్తున్నారట. లోకల్ కాదు..ఇక నుంచి నేషనల్ అంటున్నారట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు నేషనల్ పాలిటిక్స్‌లో ఎస్టాబ్లిష్ అయ్యేలా ప్లాన్ ఆఫ్ యాక్షన్ స్టార్ట్ చేశారట. కేరళం ఎన్నికలు సీఎం రేవంత్‌కు మంచి మైలేజ్ తీసుకొచ్చాయా? జాతీయ రాజకీయాల్లో రేవంత్ సత్తా చాటగలరా? ఆయన ప్లాన్స్ వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉందా?
అపర చాణక్యుడిగా పేరున్న కేసీఆర్‌ను ఓడించి సీఎం కావడంతో రేవంత్ రెడ్డికి ఒక్కసారిగా జాతీయ స్థాయిలో ఎక్స్ పోజర్ పెరిగింది. తన మాట తీరు..స్పాంటేనియస్ అటాకింగ్‌తో డైనమిక్ లీడర్‌గా పేరు తెచ్చుకున్న రేవంత్..కాంగ్రెస్ నేషనల్ స్టార్ క్యాంపెయినర్స్ లిస్ట్‌లో మొదటి వరుసలో చేరిపోయారు. ఎన్నిక ఏదైనా..కాంగ్రెస్ పార్టీకి దాని అలయన్స్ పార్టీలకు మద్దతుగా క్యాంపెయిన్ చేస్తూ వస్తున్నారు రేవంత్. లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ప్రచారం చేశారు. లేటెస్ట్‌గా కేరళలో రేవంత్ చేసిన క్యాంపెయిన్..కమ్యూనిస్ట్ పార్టీలు..ప్రధాని మోదీ టార్గెట్‌గా ఆయన చేసిన విమర్శలు పెద్ద చర్చకు దారితీశాయి. తన ప్రసంగాలతో మలయాళీల మనసు దోచుకునే ప్రయత్నం చేశారు రేవంత్.
తెలంగాణ సీఎంగా ఉంటూనే మరో టార్గెట్‌పై ఫోకస్..
ఏదో ఒకరోజు కచ్చితంగా తెలంగాణకు సీఎం అవుతానంటూ బహిరంగంగా సవాల్ చేసి..టార్గెట్ రీచ్ అయిన రేవంత్..ఇప్పుడు తెలంగాణ సీఎంగా ఉంటూనే మరో టార్గెట్‌పై ఫోకస్ పెట్టారట. ఇప్పటికే తెలంగాణకు మరోసారి సీఎంగా ఉంటానని బహిరంగంగా చెబుతూనే..నేషనల్ పాలిటిక్స్‌లో ఎమర్జ్ అయ్యే స్కెచ్ వేస్తున్నారట. అందుకు తగ్గట్లుగా టైమ్..టైమింగ్ కలిసి వస్తోందని..జాతీయ రాజకీయాల్లో లోటు కూడా ఉందని భావిస్తున్నారట. మమతా బెనర్జీ, స్టాలిన్, పినరయి విజయన్, అశోక్ గెహ్లాట్, వసుందరా రాజే, మాయవతి, ములాయమ్ సింగ్ యాదవ్, లాలూప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్, శివరాజ్‌సింగ్ చౌహాన్..ఇలా చాలామంది హేమాహేమీలు ఇప్పుడు సీఎం పదవిలో లేరు. పైగా కాంగ్రెస్, దాని అనుబంధ పార్టీల్లో ఆ స్థాయి గుర్తింపు ఉన్న నేతలు కూడా కరువయ్యారు. ఇదే సరైన అవకాశమని లెక్కలు వేసుకుంటున్న రేవంత్..నేషనల్ పాలిటిక్స్‌లోకి ఎంటర్ అయ్యే స్కెచ్ వేస్తున్నారట.
కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేశారు..
కేరళ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి జోరుగా ప్రచారం చేశారు. సుడిగాలి పర్యటనలతో ఎన్నికల ప్రచారంలో కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ ఉక్కిరిబిక్కిరి చేశారు. ఇండియా కూటమిలో కమ్యూనిస్టులు భాగస్వామిగా ఉన్నా..విమర్శల విషయంలో అందరికంటే ఓ అడుగు ముందుకేసి అటాక్ చేశారు రేవంత్. ఇద్దరి మధ్య లేఖల యుద్ధం కూడా నడిచింది. సీఎం రేవంత్ చేసిన విమర్శలకు..తెలంగాణలో ఉన్న కమ్యూనిస్టులు కూడా నొచ్చుకున్నారు. అయినా..సీఎం రేవంత్ ఏ మాత్రం తగ్గకుండా ఆఖరి వరకు పినరయ్ విజయన్ సర్కార్‌ను వెంటాడారు. దీంతో ఇప్పుడు కేరళలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సీఎం రేవంత్ రెడ్డి పేరును..తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆకాశానికెత్తుతున్నారు.
గతంలో నేషనల్ పాలిటిక్స్ లో తెలుగు రాష్ట్రాల నుంచి కొందరు నేతలు చక్రం తిప్పారు. కాంగ్రెస్ పార్టీలో దేశ ప్రధానిగా పీవీ నర్సింహారావుకు ఛాన్స్ దక్కింది. ఆ తర్వాత జాతీయ రాజకీయాలను శాసించిన వారిలో ఎన్టీఆర్, చంద్రబాబు ఉన్నారు. ప్రస్తుతం ఎన్డీయే సర్కార్‌ను నిలబెట్టడంలో చంద్రబాబు కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి సీఎం రేవంత్ రెడ్డి అడుగు పెట్టాలని చూస్తున్నారట. నేషనల్ పాలిటిక్స్‌లో ఉన్న లోటును ఆక్యుపై చేయాలని భావిస్తున్నారట. సేమ్‌టైమ్ ఏఐసీసీకి కూడా ఈ తరం లీడర్ల అవసరం ఉంది. ప్రస్తుతం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా సౌత్‌కు చెందిన మల్లిఖార్జున ఖర్గే ఉన్నారు. ఆయనకు వయోభారంతో..ఆరోగ్యం పెద్దగా సహకరించడం లేదు.
ఇక కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య వివాదంతో ఇంటిపోరుకే సరిపోతున్నారు. ఇదే అదునుగా సీఎం రేవంత్ రెడ్డి చాలా వేగంగా పావులు కదుపుతున్నారట. అందుకే జాతీయ స్థాయి అంశాలపై తనదైన స్టైల్‌లో రియాక్ట్ అవుతూ నేషనల్ ఎక్స్‌పోజర్ వచ్చేలా వ్యూహాలకు పదును పెడుతున్నారట రేవంత్. డీలిమిటేషన్ అంశంలో..రేవంత్ తెచ్చిన ప్రతిపాదన ఎంత పెద్ద చర్చకు..రచ్చకు దారితీసిందో చెప్పక్కర్లేదు. కానీ రేవంత్ సెంట్రిక్‌గానే డీమిలిటేషన్ ఫైట్ నడిచిందనడంలో మాత్రం డౌటే లేదు.
నేషనల్ పాలిటిక్స్ వైపు రేవంత్ అడుగులు వేస్తున్న నేపథ్యంలో..జాతీయ రాజకీయాల్లో గులాబీ కేసీఆర్ ఫ్లాప్ షోను గుర్తు చేస్తున్నారు పొలిటికల్ ఎనలిస్టుల. రెండుసార్లు తెలంగాణలో అధికారంలోకి వచ్చి..మూడోసారి కూడా పవర్‌లోకి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ..ఏకంగా పార్టీ పేరు మార్చి కేసీఆర్ నేషనల్ పాలిటిక్స్ అంటూ హడావుడి చేస్తే చివరకు బొక్కబోర్లా పడాల్సి వచ్చిందని గుర్తు చేస్తున్నారు. కేసీఆర్‌ను మించిన ప్లానింగ్ రేవంత్ నేషనల్ పాలిటిక్స్‌లో రాణిస్తారా? జాతీయ కాంగ్రెస్‌లో ఆయనకు ఆ స్థాయి అవకాశాలు దక్కుతాయా లేదా అనేది చూడాలి.
