Telangana Assembly: స్కీమ్స్ Vs స్కామ్స్.. అసెంబ్లీలో రేవంత్ సర్కార్‌ను ఇరుకున పెట్టేలా బీఆర్ఎస్ వ్యూహం
ప్రభుత్వం స్కీముల గురించి చెబితే తాము స్కాములపై చర్చకు పట్టుబట్టాలని భావిస్తున్నారట గులాబీ పార్టీ లీడర్లు. రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో దాదాపు 20 స్కాములు జరిగాయని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.
- Naveen
- Published On : March 21, 2026 / 09:20 PM IST
- రేవంత్ సర్కార్‌ను కార్నర్ చేస్తున్న కేటీఆర్, హరీశ్
- కాంగ్రెస్ పాలనలో అన్నీ స్కాములే అంటూ అటాక్
- స్కీమ్‌ల అమలును హైలెట్ చేసుకునే పనిలో కాంగ్రెస్..
- దాదాపు 20 స్కామ్‌లు జరిగాయంటూ బీఆర్ఎస్ అలిగేషన్స్
- ఆరు గ్యారెంటీలకు చట్టబద్దత కోసం పట్టుబట్టే ప్లాన్‌లో గులాబీ పార్టీ
Telangana Assembly: అధికార పక్షం తగ్గట్లేదు. ప్రధాన ప్రతిపక్షం కూడా జుకే గా నహి అంటోంది. బడ్జెన్ సెషన్ వేళ తెలంగాణ పాలిటిక్స్ నెక్స్ట్ లెవల్ హీట్‌ను క్రియేట్ చేస్తున్నాయి. రేవంత్ పాలనలో అంతా స్కామ్‌లమయమని బీఆర్ఎస్ అటాక్ చేస్తుంటే..తాము అమలు చేస్తున్న స్కీమ్‌లను హైలెట్ చేసుకునే పనిలో పడింది కాంగ్రెస్. హిల్ట్ పాలసీ, టీడీఆర్ బాండ్లు, యంగ్ ఇండియా స్కూళ్లలో స్కామ్ అంటూ గులాబీ అస్త్రాలు రెడీ చేసుకుంటోంది. ఫ్రీ బస్, రైతు భరోసా, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్‌తో పాటు పలు అంశాలను ప్రచారం చేసుకునే పనిలో పడింది కాంగ్రెస్ పార్టీ. ఇక మిగిలిన బడ్జెట్ సెషన్ అంతా స్కీమ్స్ వర్సెస్ స్కామ్స్‌గానే సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేళ తెలంగాణ పాలిటిక్స్ హాట్ హాట్‌గా మారాయి. గవర్నర్ ప్రసంగంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య తీవ్ర వాద్వాగం జరిగింది. గవర్నర్ ప్రసంగంలో చెప్పిన అంశాలపై రేవంత్ సర్కార్ గొప్పగా చెప్పుకుంటే..గులాబీ పార్టీ మాత్రం అన్నీ అబద్ధాలేనని కొట్టి పారేసింది. ఇక సోమవారం నుంచి శాసనసభలో అసలైన వార్ నడవనుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై బీఆర్ఎస్ పెదవి విరుస్తోంది. తెలంగాణ ప్రజల బతుకుల్లో వెలుగు నింపే బడ్జెట్ అని కాంగ్రెస్ సర్కార్ చెబుతోంది. బడ్జెట్ అంతా అంకెల గారడి తప్ప అందులో ఇంకేమీ లేదని కారు పార్టీ చెబుతోంది. సోమవారం నుంచి అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా పద్దుల వారీగా డిస్కషన్ జరగనుంది. అయితే గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనను ఎండగడుతూనే రెండున్నరేళ్ల తమ పాలనలో అభివృద్ధి సంక్షేమంపై గొప్పగా చెప్పుకోవాలని అధికార హస్తం పార్టీ భావిస్తోంది.
స్కీమ్‌ల అమలును హైలెట్ చేసుకునే పనిలో కాంగ్రెస్..
రెండున్నరేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి, ఆరు గ్యారంటీలు, హామీల అమలుపై వివరించాలని ప్రభుత్వం భావిస్తోంది. మరీ ముఖ్యంగా తమ ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీములతో పాటు కొత్తగా తీసుకొచ్చిన సంక్షేమ పథకాల గురించి గొప్పగా చెప్పుకోవాలని ఫిక్స్ అయ్యారట సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలు, 400కు పైగా హామీలతో పాటు కొత్తగా అమలు చేయబోతున్న స్కీమ్స్‌పై అసెంబ్లీ వేదికగా ప్రజలకు క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నారట.
ప్రభుత్వ జూనియర్ కాలేజీ స్డూడెంట్స్‌కు మధ్యాహ్న భోజన పథకం, ఇంటర్మీడియట్ చదువుతున్న దివ్యాంగ విద్యార్థులకు మెట్రో ఫిట్టేడ్ వెహికల్స్, వసతి గృహాలు-గురుకుల విద్యాసంస్థల వంటశాలల ఆధునీకరణకు రూ. 100 కోట్లు, పాలిటెక్నిక్ కాలేజీల్లో 15 కొత్త కోర్సులు ప్రారంభం వంటివి ప్రముఖంగా చెబుతున్నారు. ఇక మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయానికి రూ.1000 కోట్లు, చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీకి రూ.400 కోట్ల రూపాయలు కేటాయింపు, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్‌లో శిక్షణ పొందుతున్న ట్రైనీలకు ప్రతి నెలా 2వేల రూపాయల స్కాలర్ షిప్ లాంటి స్కీమ్ లపై గొప్పగా చెప్పబోతోందట రేవంత్ సర్కార్.
ఇక ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కోవాలని డిసైడ్ అయిందట. బడ్దెట్‌పై చర్చ సందర్భంగా రేవంత్ సర్కార్‌ను ఇరకాటంలో పెట్టేందుకు వ్యూహం రచిస్తోందని అంటున్నారు. ప్రభుత్వం స్కీముల గురించి చెబితే తాము స్కాములపై చర్చకు పట్టుబట్టాలని భావిస్తున్నారట గులాబీ పార్టీ లీడర్లు. రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో దాదాపు 20 స్కాములు జరిగాయని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. బడ్జెట్ చర్చ సందర్భంగా ఒక్కో స్కామ్‌ను బయట పెట్టాలని డిసైడ్ అయ్యారట కారు పార్టీ లీడర్లు.
దాదాపు 20 స్కామ్‌లు జరిగాయంటూ బీఆర్ఎస్ అలిగేషన్స్..
బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు రేవంత్ ప్రభుత్వంలో జరుగుతున్న..జరిగిన స్కాములపై ప్రత్యేకంగా ప్రిపేర్ అవుతున్నారట. దాదాపు 20 స్కాములకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరించి పెట్టుకున్నారట. బడ్జెట్ చర్చ సందర్భంగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. హిల్ట్ పాలసీ స్కామ్, సింగరేణి బొగ్గు గనుల కేటాయింపులు, సోలార్ పవర్ ప్లాంట్ టెండర్లు, హెచ్‌సీయూ భూముల వ్యవహారం, టీడీఆర్ నిబంధనల్లో అవకతవకలు, అమృత్ స్కీమ్ టెండర్లు, యంగ్ ఇండియా ఇంటిగ్రెటెడ్ స్కూల్స్ టెండర్లలో గోల్‌మాల్ వంటి చాలా అంశాలను లేవనెత్తాలని బీఆర్ఎస్ భావిస్తోంది.
ఇప్పటికే అసెంబ్లీలో అనుసరించాల్సి వ్యూహంపై సమావేశమైన డిస్కస్ చేసిన బీఆర్ఎస్ఎల్పీ మరో పవర్ ఫుల్ అస్త్రాన్ని బయటికి తీయబోతోందట. ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కోసం ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టే యోచనలో BRS ఉందట. ఇలా ఎవరి ఎత్తులు వారికి ఉన్నాయి. ప్రభుత్వం స్కీమ్స్ గురించి చెబితే, కాంగ్రెస్ ప్రభుత్వ స్కామ్స్ గురించి లేవనెత్తి రేవంత్ సర్కార్‌ను ఇరుకున పెట్టేలా బీఆర్ఎస్ ప్లాన్ రెడీ చేసిందని తెలుస్తోంది. కాంగ్రెస్ గొప్పగా చెప్పుకుంటున్న స్కీమ్స్‌లోనే స్కామ్స్ జరుగుతున్నాయంటూ బీఆర్ఎస్ అటాక్ చేస్తుండటంతో ప్రజలు ఎవరి మాటలు నమ్ముతారో చూడాలి.
Also Read: కొత్త విప్‌ల నియామకం.. అసలు హస్తం పార్టీ వ్యూహం ఏంటి? వారికి ప్రమోషన్ దక్కబోతోందా?
