×
Ad

Telangana Cabinet: ఐదుగురు మంత్రులకు పదవీ గండం..! ఆ ఐదుగురు ఎవరు? వారి ప్లేస్‌లో చోటు దక్కేదెవరికి?

అమాత్యులపై ఆరోపణలు..వివాదాలతో..ఎవరి సీటుకు ఎసరు వస్తుందనేది హాట్ టాపిక్ అవుతోంది. ఇప్పటిదాకా ఖాళీగా ఉన్న రెండు బెర్తులపైనే ఆశలు పెట్టుకున్న ఎమ్మెల్యేలకు..ఇప్పుడు ఖాళీ కాబోయే బెర్తులూ కూడా ఊరిస్తున్నాయట.

Telangana Cabinet Representative Image (Image Credit To Original Source)

  • వరుస ఆరోపణలు..వివాదాలతో చిక్కులు
  • క్యాబినెట్ విస్తరణలో ఆ ఐదుగురికి ఎసరేనా?
  • కొత్తగా క్యాబినెట్‌లో చోటు దక్కించుకునేదెవరు?
  • ఉత్తర, దక్షిణ తెలంగాణ ఎమ్మెల్యేల్లో కొత్త ఆశలు

 

Telangana Cabinet: ఒక్కొక్కరి మీద ఒక్కో ఆరోపణ. తెలంగాణలో అమాత్యుల వారిని వివాదాలు వెంటాడుతున్నాయి. ఈ వీడని అలిగేషన్స్‌, కాంట్రవర్సీస్‌తో క్యాబినెట్ ప్రక్షాళనపై సరికొత్త చర్చ మొదలైంది. ఒకరు, ఇద్దరు కాదు ఏకంగా ఐదుగురు అమాత్యులకు ఉద్వాసన తప్పదన్న టాక్ నడుస్తోంది. వరుసగా వస్తున్న అలిగేషన్స్..మంత్రుల కుర్చీల కిందికి నీళ్లు తెస్తున్నాయట. క్యాబినెట్ విస్తరణ ఎప్పుడు జరిగినా..ఆ ఐదుగురికి మంత్రి పదవి ఊడటం ఖాయమనే చర్చ సెక్రటేరియట్ వర్గాల్లో జోరుగా విన్పిస్తోంది. వారెవరు ఆషామాషీ నేతలు కాకపోయినా..వారిపై వస్తున్న అలిగేషన్లు మరింత పెద్దవి కావడంతో సీటుకు ఎసరు పెట్టేలా కన్పిస్తున్నాయట. ఇంతకు ఆ ఐదుగురు ఆమాత్యులు ఎవరు..? వారి ప్లేస్‌లో క్యాబినెట్‌లో చోటు దక్కేదెవరికి?

తెలంగాణ క్యాబినెట్లో..ఇప్పుడు ఒకటే చర్చ. అమాత్యులపై ఆరోపణలు..వివాదాలతో..ఎవరి సీటుకు ఎసరు వస్తుందనేది హాట్ టాపిక్ అవుతోంది. ఇప్పటిదాకా ఖాళీగా ఉన్న రెండు బెర్తులపైనే ఆశలు పెట్టుకున్న ఎమ్మెల్యేలకు..ఇప్పుడు ఖాళీ కాబోయే బెర్తులూ కూడా ఊరిస్తున్నాయట. దక్షిణ తెలంగాణకు చెందిన సీనియర్ మంత్రి ఓ మహిళా అధికారితో నడిపిన..నడుపుతున్న వ్యవహారం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఎక్కడ చూసినా ఆ మంత్రెవరు..? ఆ అధికారెవరన్న చర్చే. ఆయన తెరచాటు వ్యవహారాలు..సర్కార్‌కు బ్యాడ్ నేమ్ తెచ్చిపెడుతున్నాయట. సదరు మంత్రి కారణంగా ఇద్దరు మహిళా అధికారుల బదిలీలు కూడా జరిగాయట.

పార్టీలో అందరికన్నా నేనే సీనియర్ అని చెప్పుకునే మంత్రి..

పార్టీలో అందరికన్నా తానే సీనియర్ అని చెప్పుకునే ఆ సదరు అమాత్యుల వారికి సంబంధించిన పూర్తి డేటా..ఇంటలిజెన్స్ రిపోర్టు ఢిల్లీకి కూడా చేరిపోయిందట. దీంతో గత అసెంబ్లీ సమావేశాల్లో ఒంటికాలిపై లేచిన ఆ అమాత్యుడు..ఈ సెషన్‌లో పూర్తిగా సైలెంట్ అయిపోయారట. ఈ నేపథ్యంలోనే ఆయన కుర్చీకి ఎసరు తప్పదనే ప్రచారం జరుగుతోంది.

ఇక దక్షిణ తెలంగాణకే చెందిన మరో సీనియర్ మంత్రిది ఇదే పరిస్థితి అంటున్నారు. ఎన్నికల ముందే హస్తం గూటికి చేరి..ఇప్పుడు అమాత్యులుగా ఉన్న ఆ మంత్రిగారికి కూడా ఉద్వాసన తప్పదంటున్నారు. ఆర్టీఐ ద్వారా తన శాఖలోని అధికారుల దందాలను ఆ మంత్రే బయట పెట్టడమే కారణమనే టాక్ నడుస్తోంది. వీరిద్దరూ తెలంగాణ ఉద్యమానికి తామే బ్రాండ్‌ అంబాసిడర్లం అని కూడా చెప్పుకునే నేతలే కావడం మరో విశేషం.

మహిళా అధికారులు, నేతలతో జోక్‌లు, వింత పలుకులు..!

ఇక మరో ఉత్తర తెలంగాణ మంత్రిది ఇంకో కథ. హైదరాబాద్‌లో అంతా తానై చక్రం తిప్పుతున్న సదరు మంత్రి చేష్టలు..సర్కార్‌కు హెడెక్‌గా మారాయట. మహిళా అధికారులు, నేతలతో జోక్‌లు..వింత పలుకులతో ఆయన తీరు చర్చనీయాంశంగా మారిందంటున్నారు. సదరు మంత్రి తీరుపై ఇప్పటికే కొందరు అధికారులు..సీఎంవో దృష్టికి తీసుకెళ్లారట. ఇది చాలదన్నట్లు..ఇటీవల ఒకరిద్దరు మహిళా జర్నలిస్ట్‌లతో కూడా ఆయన సన్నిహితంగా ఉంటూ..వాట్సప్ కాల్స్..ఇన్‌స్టాలో మెస్సేజ్‌లు పెడుతూ టీనేజర్‌గా మారిపోయారన్న గుసగుసలు విన్పిస్తున్నాయి. ఈ వ్యవహారంతో సదరు అమాత్యులవారికి ఉద్వాసన తప్పదన్న గుసగుసలు సెక్రటేరియట్లో రచ్చ రంబోలా చేస్తున్నాయి.

సీనియన్ మంత్రిపై చిలిపి చేష్టలు, కరప్షన్ అలిగేషన్స్‌..

ఇంకో సీనియర్ మంత్రిపై కూడా…చిలిపి చేష్టలు, కరప్షన్ అలిగేషన్స్‌తో గందరగోళం నెలకొందట. సమైఖ్య రాష్ట్రంలోనే..సీనియర్ మోస్ట్ నేతగా ఉన్న ఆయనకు ఓ టైప్ ఆఫ్ డ్యాషింగ్ లీడర్‌గా పేరుంది. ఈ సదరు మంత్రితో సూటిగా మాట్లాడాలంటే..అధికారులే కాదు..తోటి లీడర్స్ కూడా జంకుతుంటారు. తన అనుకున్న వారిపై ట్రాన్స్‌ఫర్స్ గాలి సోకకుండా.. ప్రొటెక్టర్‌గా ఉంటుంటడం వెనుక ఏవో మతలబులున్నాయనే టాక్ నడుస్తోంది. అవినీతి ఆరోపణలు పెరిగిపోవడంతో ఆయనపై కూడా రిపోర్టులు రెడీ అయ్యాయని తెలుస్తోంది.

ఆ మహిళా మంత్రికి పదవీ గండం..!

ఉత్తర తెంగాణకు చెందిన మరో సీనియర్ మహిళా మంత్రి పదవి కూడా..క్యాబినెట్ విస్తరణలో గల్లంతు అవడం పక్కా అంటున్నారు. సర్కార్ ఏర్పడిన కొత్తలో ఈ సీనియర్ మంత్రి నోటి మాటతో రేవంత్ సర్కార్‌కు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడగా..తన ఇంటి మనిషి అవినీతి వ్యవహారాన్ని వెనుకేసుకుని రావడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. అది ఇప్పటికీ విపక్షాలకు అస్త్రంగా ఉంటూనే వస్తోంది. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని ఆ మహిళా మంత్రిని క్యాబినెట్ నుంచి తప్పిస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో సదరు మహిళా మంత్రికి విస్తరణ మాట వింటే చాలు కంటి మీద కునుకు రావడం లేదట.

ఐదుగురు మంత్రులకు ఉద్వాసన పలికితే..అప్పుడు కేబినెట్ లో ఖాళీ బెర్తుల సంఖ్య ఆరుకు చేరనుంది. అటు అజారుద్దీన్ స్థానం కూడా ఊగిసలాటలోనే ఉండటంతో కేబినెట్ లో బెర్తుల కోసం దాదాపు డజన్ మంది కాపు కాసుకుని కూర్చున్నారట. ఇప్పటికే ఈ లిస్ట్‌లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ విజయశాంతి, ఎమ్మెల్యేలు మల్‌రెడ్డి రంగారెడ్డి, కవ్వంపల్లి సత్యనారాయణ, ఆది శ్రీనివాస్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు తొలిసారి ఎన్నికై అసెంబ్లీ లోపలా, బయట.. ఫైర్ బ్రాండ్ లీడర్లుగా ఎస్టాబ్లిష్ అవుతున్న మరికొందరు యువ ఎమ్మెల్యేలకు కూడా అదృష్టం కలిసి రావచ్చని టాక్ నడుస్తోంది.

Also Read: పక్క రాష్ట్రంతో గొడవలు వద్దు.. చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఒకే మాట