Telangana BJP: బండి Vs ఈటల.. లక్ష్మణ్ Vs అరవింద్.. బీజేపీలో అసలేం జరుగుతోంది? నేతల మధ్య ఎందుకీ ఫైట్?
ఇవి బయటకు వచ్చినవి మాత్రమే. కానీ కమలం పార్టీ నేతల మధ్య బయటకు రాని అంశాలు చాలానే ఉన్నాయట.
- Naveen
- Published On : April 9, 2026 / 09:33 PM IST
- గతంలో కిషన్‌రెడ్డి Vs రాజాసింగ్ ఎపిసోడ్..
- అటు వైపు కొందరు..ఇటు మరికొందరు.!
- గ్రూప్‌లు, వర్గాలతో ముదురుతున్న ఇంటర్నల్ ఫైట్
- క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న పార్టీలో క్లాషెస్
Telangana BJP: ఈయనంటే ఆయనకు పడదు. ఆయన తీరు మరొకాయనకు నచ్చదు. 8 మంది ఎమ్మెల్యేలు. 8 మంది లోక్‌సభ ఎంపీలు, మరో ఇద్దరు రాజ్యసభ ఎంపీలు. పది గ్రూప్‌లు, పన్నెండు వర్గాలు అన్నట్లుగా తయారైందట తెలంగాణ బీజేపీ పరిస్థితి. ఇన్నాళ్లు ఇంటర్నల్ ఫైట్‌తోనే సరిపెట్టిన కమలం లీడర్లు ఇప్పుడు లేఖాస్త్రాలతో..ఓపెన్ డయాస్ మీదకు వచ్చేస్తున్నారు. అంతర్గత పోరు కాస్త నెక్స్ట్ లెవల్‌కు చేరడంతో లీడర్లు బరస్ట్ అయిపోతున్నారట. ఇంతకు కమలం గూటిలో క్లాషెస్ ఎందుకు? నేతల మధ్య ఎందుకీ ఫైట్?
తెలంగాణ బీజేపీ కూడా అన్ని రాజకీయ పార్టీల్లాగే తయారైందా? వర్గపోరు విషయంలో కాంగ్రెస్‌ను దాటేసిందా? క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే కమలం పార్టీలో క్లాషెస్ రచ్చకెక్కుతున్నాయా? అంటే అవుననే చర్చ జరుగుతోంది. పార్టీలో అంతర్గత పోరు ఎక్కువై..నేతల మధ్య డైలాగ్ వార్‌కు దారి తీస్తోందట. గతంలో ఒక్కరిద్దరు నేతల మధ్యే ఆధిపత్య పోరు, పార్టీపై పట్టు కోసం కయ్యాలు ఉండగా..ఇప్పుడు కీలక కాషాయ నేతలందరికీ ఆ వాసన అంటుకుందన్న గుసగుసలు స్టార్ట్ అయ్యాయి. అంతర్గతంగా మాట్లాడుకోవాల్సిన అంశాలపై నేతలు రచ్చకెక్కుతుండటంతో కమలం గూటిలో జరుగుతున్న అంతర్గత వార్..పొలిటికల్‌గా కాక రేపుతోంది.
క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న పార్టీలో క్లాషెస్..
తెలంగాణ బీజేపీ పరిస్థితి చూసి ఓ సీనియర్ బీజేపీ నేత నెత్తి నోరు బాదుకుంటున్నారట. రాష్ట్ర బీజేపీలో ప్రస్తుత పరిస్థితులు పెదరాయుడు సినిమాలోని డైలాగ్‌ను గుర్తు చేస్తున్నాయట. ఎప్పుడూ చూడలేం అనుకున్న ఇష్యూస్ అన్ని చూస్తున్నారట. ఇంతకంటే ఇంకేం జరగదు..అంతా సమసిపోతుందనుకున్న ప్రతీసారి..యువర్ ప్రిడిక్షన్ ఈజ్ రాంగ్ అని ప్రూవ్ చేస్తున్నారట కొందరు నేతలు. పోటాపోటీగా హైకమాండ్‌కు ఫిర్యాదులు..బహిరంగ విమర్శలు..మీడియా ముందు స్టేట్‌మెంట్‌లు. ఇదంతా కాంగ్రెస్‌లో కామన్. ఇప్పుడీ సంస్కృతి తెలంగాణ బీజేపీలో కూడా మొదలైనట్టు అనిపిస్తుందట. బహిరంగంగా కొట్టుకోవడం మినహా మిగతా అన్ని పంచాయితీలు హస్తం పార్టీని గుర్తు చేస్తున్నాయట.
బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య కోల్డ్ వార్..
రాష్ట్ర బీజేపీలో ఇప్పటికే బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉందనేది ఓపెన్ సీక్రెట్. హుజూరాబాద్ సెంట్రిక్‌గా పరోక్ష విమర్శలు వారి మధ్య సర్వసాధారణం అయిపోయాయి. ఇటీవల ప్రెస్‌మీట్ పెట్టిన మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఇన్ డైరెక్ట్‌గా బండి సంజయ్, కిషన్ రెడ్డి టార్గెట్‌గా ఈటెలు విసిరారన్న చర్చ ఉంది. పార్టీలో సమస్యలు ఉంటే తమ నాయకుడికి లేఖ రాస్తే తప్పేంటంటూ కుండబద్దలు కొట్టేశారు ఈటల.
లక్ష్మణ్, ధర్మపురి అరవింద్ మధ్య చిట్ చాట్ వార్..
పార్టీకి రాజీనామా చేసిన రాజాసింగ్ కూడా ఇప్పటికీ స్టేట్ బీజేపీ లీడర్లపై విమర్శలు ఆపడం లేదు. మరోసారి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని, రాష్ట్ర బీజేపీని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. లేటెస్ట్‌గా రాజ్యసభ సభ్యులు సీనియర్ లీడర్ లక్ష్మణ్, ఎంపీ ధర్మపురి అరవింద్ మధ్య చిట్ చాట్ వార్ మొదలైంది. బీజేపీలో లేఖలు రాసే సంస్కృతి లేదని లక్ష్మణ్ చెప్తే..ఆ వ్యాఖ్యలపై ఆఫ్ ది రికార్డులో కౌంటర్ ఇచ్చేశారు అరవింద్. స్వయంగా తనపైనే లక్ష్మణ్ లేఖ రాశారంటూ అరవింద్ మీడియా చిట్ చాట్ లో కామెంట్స్ చేశారు.
రాష్ట్ర బీజేపీలో బయటకు వచ్చినవి ఈటల రాజేందర్ Vs బండి సంజయ్, లేటెస్ట్‌గా లక్ష్మణ్ Vs అరవింద్..గతంలో రాజాసింగ్ వర్సెస్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..ఈ ఎపిసోడ్‌లు హాట్ టాపిక్‌గా నడుస్తున్నాయి. ఇవి బయటకు వచ్చినవి మాత్రమే. కానీ కమలం పార్టీ నేతల మధ్య బయటకు రాని అంశాలు చాలానే ఉన్నాయట. ఇక ఇటీవల అధికార ప్రతినిధులు, రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రకటించిన సందర్భంలోనూ పలువురు పార్టీ నిర్ణయాన్ని నిరసిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో ఒకరిద్దరు నేతలను పార్టీ ఆఫీస్‌కు పిలిపించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు గట్టిగానే వార్నింగ్ ఇచ్చారట. దీంతో ఆ నేతలు తమ సోషల్ మీడియా పోస్టులను తొలగించారని అంటున్నారు.
అయితే ఇలాంటి గొడవలు తెలంగాణ బీజేపీలో కొత్తే అయినా..రచ్చకే దారితీస్తున్నా..పార్టీ బలపడుతున్నప్పుడు ఇవన్నీ కామన్ అంటూ కవర్ డ్రైవ్ స్టార్ట్ చేశారట పలువురు బీజేపీ నేతలు. అంతర్గత సమస్యలు తొందరలోనే పరిష్కారం అవుతాయని చెప్పుకొస్తున్నారట. ఏదైనా స్టేట్ బీజేపీలో నేతల రూటే సెపరేటు అన్న చర్చ అయితే జరుగుతోంది.
Also Read: ఈసారి సింపుల్‌గా గులాబీ ప్లీనరీ..! కారణం అదేనా? కేసీఆర్ ప్లాన్ ఏంటి?
