Revenge Politics: అటు జీవన్‌ రెడ్డి.. ఇటు కవిత.. రివేంజ్ గేమ్‌లో పైచేయి ఎవరిది?

పొలిటికల్ ఈక్వేషన్స్‌ మారిన నేపథ్యంలో ఈ ఇద్దరు నేతలు రాజకీయ ప్రత్యర్థులు అవడమే కాదు..రెండు ప్రధాన పార్టీల గెలుపోటములను డిసైడ్‌ చేసేందుకు దేనికైనా రెడీ అంటున్నారు.

  • Published On : March 26, 2026 / 09:39 PM IST
  • ఇందూరు సెంట్రిక్‌గా ఇంట్రెస్టింగ్‌ పొలిటికల్‌ సీన్‌
  • కాంగ్రెస్‌ను వీడి పోరుబాట ప్రకటించిన జీవన్‌రెడ్డి
  • హస్తం పార్టీకి వ్యతిరేకంగా పనిచేయబోతున్న జీవన్
  • బీఆర్ఎస్‌ను గుడ్‌బై చెప్పి పార్టీ పెట్టుకుంటున్న కవిత
  • గులాబీ పార్టీ టార్గెట్‌గానే కవిత రాజకీయ వ్యూహాలు..!

Revenge Politics: అటు జీవన్‌రెడ్డి. ఇటు కవిత. ఇద్దరు పొలిటికల్ బిగ్ స్టార్స్‌. జీవన్‌రెడ్డి అయితే సీనియర్ మోస్ట్ లీడర్. కాంగ్రెస్‌తో నాలుగు దశాబ్ధాల అనుబంధాన్ని తెంచుకున్న ఆయన త్వరలో ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరి..హస్తం పార్టీకి వ్యతిరేకంగా పని చేయబోతున్నారు. ఇప్పటికే పోరుబాట ప్రకటించారు. ఇక కవిత బీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పి జిల్లాల బాట చేపట్టారు. త్వరలో రాజకీయ పార్టీ ప్రకటన చేసేందుకు రెడీ అవుతున్నారు. ఆమె గులాబీ పార్టీ టార్గెట్‌గానే తన తదుపరి అడుగులు ఉంటాయన్నట్లుగా ఇండైరెక్ట్‌ ఇండికేషన్ ఇస్తున్నారు.

కరీంనగర్, ఆదిలాబాద్‌లో కవిత ప్రభావం ఉండే అవకాశం..

అయితే ఈ ఇద్దరు నేతలు నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్‌ పరిధిలో కీలక నేతలు. కవిత నిజామాబాద్‌ నుంచి ఓసారి ఎంపీగా గెలిచారు. మరోసారి ఎంపీగా కంటెస్ట్‌ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత రెండుసార్లు స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ అయ్యారు. ఆమెకు ఇందూరు పార్లమెంట్‌ సెగ్మెంట్‌ పరిధిలో మంచి పరిచయాలు ఉన్నాయి. అక్కడున్న అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో అంతో ఇంతో పట్టుంది. నిజామాబాద్‌ పార్లమెంట్‌ సెగ్మెంట్‌తో పాటు, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లోని సింగరేణి ఏరియాల్లో అనుచరగణం ఉంది. గతంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలిగా కూడా కవిత పనిచేశారు. దీంతో ఇందూరుతో పాటు కరీంనగర్, ఆదిలాబాద్‌లో కవిత ప్రభావం ఉండే అవకాశం ఉంది.

ఇక జీవన్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం జగిత్యాల నుంచే కొనసాగుతూ వస్తోంది. 9 సార్లు జగిత్యాల నుంచి పోటీ చేసి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్టీఆర్, వైఎస్ఆర్ క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేశారు జీవన్‌రెడ్డి. ఓసారి నిజామాబాద్‌ ఎంపీ క్యాండిడేట్‌గా, రెండుసార్లు కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆయన బలమైన నాయకుడు. పలు నియోజకవర్గాల్లో జీవన్‌రెడ్డికి రాజకీయ శిష్యులు, అనుచరులు, విస్తృతమైన పరిచయాలు ఉన్నాయి. ఇలా ఇద్దరు బలమైన నేతలు ఇప్పుడు డిఫరెంట్‌ రూట్‌లో ఉన్నారు.

రెండు ప్రధాన పార్టీల గెలుపోటములను డిసైడ్‌ చేస్తారా?

మొన్నటివరకు కాంగ్రెస్‌ కోసం పనిచేసిన జీవన్‌రెడ్డి ఇప్పుడు ఆ పార్టీని ఓడించి తీరాలని కసి మీదున్నారు. ఏకంగా సీఎం రేవంత్‌రెడ్డి టార్గెట్‌గా బాణాలు వదిలిన జీవన్‌రెడ్డి జనం బాట పేరుతో..కాంగ్రెస్‌పై విమర్శల దాడిని పెంచే అవకాశం ఉంది. ఇక మొన్నటివరకు బీఆర్ఎస్‌లో ఉండి..ఇప్పుడు సొంత రాజకీయ పార్టీ పెట్టుకునేందుకు రెడీ అవుతున్న కవిత..కారు పార్టీని ఓడించి తన బలమేంటో చూపించాలని మొండి పట్టుదలతో ఉన్నారు. నిజామాబాద్‌ పార్లమెంట్‌ సెగ్మెంట్‌లో కవితకు ఎమ్మెల్యేలు, ద్వితీయ శ్రేణి నేతలతో పరిచయాలు ఉన్నాయి. పొలిటికల్ ఈక్వేషన్స్‌ మారిన నేపథ్యంలో ఈ ఇద్దరు నేతలు రాజకీయ ప్రత్యర్థులు అవడమే కాదు..రెండు ప్రధాన పార్టీల గెలుపోటములను డిసైడ్‌ చేసేందుకు దేనికైనా రెడీ అంటున్నారు.

అయితే కవిత బలమేంటో మున్సిపల్ ఎన్నికల్లోనే తేలిపోయిందని బీఆర్ఎస్ భావిస్తుంది. పలు నియోజకవర్గాల్లో తమ ఓటు బ్యాంకును చీల్చడం తప్ప..కవిత పోటీ చేస్తే కూడా గెలిచే అవకాశాలు లేవనేది గులాబీ పార్టీ అంచనా. ఇటు జీవన్‌రెడ్డి విషయంలో కాంగ్రెస్ సీరియస్‌గా రియాక్ట్ కాలేదు. ఆయన ఘాటైనా విమర్శలు చేసినా..జీవన్‌రెడ్డి సీనియారిటీ, సిన్సియారిటీని దృష్టిలో పెట్టుకుని..హస్తం పార్టీ లీడర్లు పెద్దగా స్పందించడం లేదు. కానీ ఆయన ఫీల్డ్‌లో దిగి హస్తం పార్టీ నేతలపై వ్యాఖ్యలు చేస్తే మాత్రం..ఎన్నికల నాటికి జీవన్‌రెడ్డిపై కూడా కాంగ్రెస్‌ నేతలు రివర్స్ అటాక్‌ చేసే అవకాశాలు లేకపోలేదు.

ఏదైనా అటు జీవన్‌రెడ్డి, ఇటు కవిత నిజామాబాద్‌ ఎంపీ సీటులో బలమైన నేతలుగా ఉన్నారు. పైగా ఇద్దరి టార్గెట్‌ రెండు ప్రధాన రాజకీయ శక్తులు. జీవన్‌రెడ్డి అధికార కాంగ్రెస్‌ను ఓడించి తనకు జరిగిన అవమానాన్ని ఓవర్ కమ్‌ చేయాలని కసి మీదున్నారు. ఇక కారు పార్టీని ఓడించి బలమైన నాయకురాలిగా ప్రూవ్ చేసుకోవాలని కవిత తాపత్రయ పడుతున్నారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రంగా స్టేట్‌ పాలిటిక్స్‌ హీటెక్కే అవకాశం కనిపిస్తోంది. రివేంజ్‌ పాలిటిక్స్‌లో భాగంగా అటు జీవన్‌రెడ్డి కాంగ్రెస్‌ను ఓడించి పైచేయి సాధిస్తారా? లేక బీఆర్ఎస్‌ను మళ్లీ అధికారంలోకి రాకుండా చేసి కవిత తన బలమేంటో చూపిస్తారా? అనేది చూడాలి.

Also Read: డీలిమిటేషన్‌పై పార్టీల్లో ఆశలు.. తెలంగాణలో అధికారం ఎవరిదో నిర్ణయించేది ఆ 2 జిల్లాలేనా?