Kavitha New Party: టీఆర్ఎస్ పేరుతో పార్టీ, కేసీఆర్ టార్గెట్‌గా తీవ్ర విమర్శలు.. అసలు కవిత వ్యూహమేంటి?
ఇక ఇది ఆరంభం మాత్రమే..ముందుంది ముసళ్ల పండుగ అంటూ కవిత చేసిన కామెంట్స్ ఇప్పుడు పొలిటికల్ హాట్ టాపిక్ అయ్యాయి. పార్టీ ప్రకటన రోజే డైరెక్టుగా తన తండ్రి..గులాబీ అధినేత కేసీఆర్‌ను ఆమె టార్గెట్ చేయడం చర్చకు దారితీస్తోంది.
- Naveen
- Updated on- April 25, 2026 / 08:14 PM IST
- కేసీఆర్‌నే టార్గెట్ చేయడం వెనుక స్కెచ్ ఏంటి.?
- బీఆర్ఎస్ వర్సెస్ టీఆర్ఎస్‌గా ఫైట్ మారనుందా.?
- బీఆర్ఎస్ స్లోగన్‌తో పవర్ పాలిటిక్స్‌కు కవిత ప్లాన్.!
Kavitha New Party: అక్క అన్నంత పని చేసింది. కొత్త పార్టీ పెట్టింది. పేరు, జెండా, అజెండా ప్రకటించేసింది. ఇక బాపు టార్గెట్‌గానే బాణాలు ఎక్కుపెట్టి చర్చకు తెరదీసింది. టీఆర్ఎస్ టైటిల్‌తోనే బీఆర్ఎస్‌ను ఢీకొట్టే స్కెచ్ వేసిన కవిత..ఇక డైరెక్ట్ గులాబీ బాస్‌పై గురి ఎక్కు పెట్టింది. కారు పార్టీపైనే కవిత రాజకీయ శత్రువా? కేసీఆర్‌ను టార్గెట్ చేయడం వెనుక కవిత వ్యూహమేంటి? టీఆర్ఎస్‌కు.. బీఆర్ఎస్ కౌంటర్ ప్లాన్ రెడీ చేస్తోందా?
పది నెలల సస్పెన్స్‌కు తెరపడింది. ఎట్టకేలకు జాగృతి అధ్యక్షురాలు కవిత పార్టీ ప్రకటించేసింది. అందరి అంచనాలను తలకిందులు చేసి..ముందుగా తాను ఇచ్చిన లీక్ ప్రకారమే పార్టీ పేరును అనౌన్స్ చేశారు. పాత పేరు..కొత్త ఎజెండా అంటూ గతంలో హింట్ ఇచ్చిన కవిత..పార్టీ పేరును టీఆర్ఎస్‌గా నామకరణం చేసింది. తెలంగాణ రాష్ట్ర సేన అంటూ..ఎజెండాను ప్రజల ముందు పెట్టింది కవిత. అయితే ఇన్నాళ్లు హరీశ్‌రావు, సంతోష్‌రావు, కేటీఆర్ టార్గెట్‌గా విమర్శలు చేస్తూ వచ్చిన కవిత..ఇక డైరెక్ట్‌గా గులాబీ బాస్ కేసీఆర్‌పైనే తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ మనిషి కాదు మర మనిషి అన్న కవిత..ఆయన రాజకీయ పరిణతి కోల్పోయారంటూ కామెంట్స్ చేయడం తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి.
గుంటనక్కలు, తోడేళ్ల చేతుల్లో కేసీఆర్ బందీ..
ఆనాటి కేసీఆర్ వేరు..ఈనాటి కేసీఆర్ వేరన్న కవిత..గుంటనక్కలు, తోడేళ్ల చేతుల్లో ఆయన బందీ అయ్యారని కూడా చెప్పుకొచ్చారు. పేదల ఇండ్లు కూలుస్తుంటే ఆదుకోవాల్సిన గులాబీ బాస్ ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. పైగా కేసీఆర్ హయాంలో ఒక్క ఉద్యమకారుడికి కూడా పదవి దక్కలేదన్నారు కవిత. మారిన కేసీఆర్ పంజాబ్ వెళ్లారు..మన కేసీఆర్ అయి ఉంటే తెలంగాణ ప్రజల కష్టాలు చూసి బయటికి వచ్చేవారన్నారు.
ఇక ఇది ఆరంభం మాత్రమే..ముందుంది ముసళ్ల పండుగ అంటూ కవిత చేసిన కామెంట్స్ ఇప్పుడు పొలిటికల్ హాట్ టాపిక్ అయ్యాయి. పార్టీ ప్రకటన రోజే డైరెక్టుగా తన తండ్రి..గులాబీ అధినేత కేసీఆర్‌ను ఆమె టార్గెట్ చేయడం చర్చకు దారితీస్తోంది. మరోవైపు టీఆర్ఎస్ పేరుతోనే..బీఆర్‌ఎస్‌ను ఢీకొట్టే స్కెచ్ వేసిన కవిత..మిగతా రాజకీయ పార్టీలను పెద్దగా కార్నర్ చేయకపోవడం ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఏదో విమర్శించాలి కాబట్టి..గుంపులో గోవిందం అన్నట్లుగా..అటు కాంగ్రెస్, ఇటు బీజేపీని కూడా తలా ఓ మాట అనేసిన కవిత..కారు పార్టీపై గట్టిగానే గురి పెట్టినట్లు చర్చ జరుగుతోంది.
కేసీఆర్‌ను పర్సనల్ అటాక్ చేయడంపై భిన్నాభిప్రాయాలు..
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా..తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఓ సారి ఎంపీగా.. రెండుసార్లు ఎమ్మెల్సీగా పనిచేసిన కవిత..ఇప్పుడదే బీఆర్ఎస్‌పైనే విమర్శల దాడి చేయడం గమ్మత్తుగా మారింది. అన్నింటికి మించి కన్న తండ్రి, తనకు ఈ స్థాయి కల్పించిన నేత కేసీఆర్‌ను పర్సనల్ అటాక్ చేయడంపై ఇటు బీఆర్ఎస్ పార్టీలో..ఇటు జాగృతిలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయట. అయితే ఇన్నాళ్లు కవిత విషయంలో సీరియస్ కామెంట్స్ చేసేందుకు ఇష్టపడని బీఆర్ఎస్ ముఖ్యనేతలు కూడా ఇక నుంచి స్ట్రాంగ్ రిప్లైకి రెడీ అవుతున్నారట. మాటకు మాట..విమర్శకు ప్రతి విమర్శతో సమాధానం చెప్తేనే కవిత వ్యాఖ్యలతో జరిగే డ్యామేజ్‌ను కంట్రోల్ చేసుకోవచ్చని ప్లాన్ చేస్తున్నారట.
పార్టీ ఆవిర్భావ సభలో కవిత చేసిన కామెంట్స్‌పై ఇప్పటికే బీఆర్ఎస్ లీడర్లు స్ట్రాంగ్ రిప్లై ఇస్తున్నారు. ఆమె పార్టీ పేరును ఉద్దేశించి..ఒరిజినల్ ఒరిజినలే..డూప్లికేట్..డూప్లికేటే అంటూ..బీఆర్ఎస్ ఎక్స్‌లో కౌంటర్ ఇచ్చి పడేసింది. దీంతో ఇటు కారు పార్టీ కూడా కవితకు గట్టిగానే కార్నర్ చేయాలని డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది.
Also Read: కులాల లెక్కలు.. కాంగ్రెస్ కొత్త చిక్కులు తెచ్చి పెట్టుకుందా? ఇరకాటంలో పడిందా?
