PM Modi: తెలంగాణలోనూ ఏపీ ఫార్ములా..! పవర్‌లోకి రావడమే టార్గెట్‌గా మోదీ అడుగులు..

2023కు ముందే చాలా హోప్స్ పెట్టుకున్నారు. నైజాం గడ్డ మీద గెలిచి..గోల్కొండ కోటలో బీజేపీ జెండా ఎగరవేయాలని పెద్ద ప్లానే వేశారు. ఎన్నికలకు ముందు అనుకోని మార్పులతో అనుకున్న టార్గెట్‌ను రీచ్‌ కాలేకపోయారు కమలనాథులు.

  • Published on- May 11, 2026 / 10:41 PM IST

PM Modi: అస్సాంలో హ్యాట్రిక్‌ కొట్టారు. బెంగాల్‌లో ఛాలెంజ్‌ చేసి మరీ డ్రీమ్‌ను నెరవేర్చుకున్నారు. సౌత్‌లో కర్ణాటకపై స్టిల్‌ హోప్స్ కంటిన్యూ అవుతున్నాయి. తమిళనాడు బ్యాటిల్‌ అయిపోయింది. ఇక తెలంగాణపైనే బీజేపీ ఫోకస్ పెట్టింది. ప్రధాని మోదీ ఇండైరెక్టుగా ఇదే మాట చెప్పేశారు. తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి రాబోతోందన్న మోదీ ..హైదరాబాద్‌ టూర్‌లో చంద్రబాబు, పవన్‌ను కలిసి బిగ్ ఇండికేషన్ ఇచ్చారు. ఏపీ ఫార్ములానే తెలంగాణలో ఫాలో కాబోతున్నారా? కూటమిగా అయితేనే తెలంగాణలో పవర్‌లోకి వస్తామనుకుంటున్నారా? ఇక్కడ కూడా బీజేపీ-టీడీపీ-జనసేన కలిసిగట్టుగా పోటీ చేయనున్నాయా?

2023కు ముందే చాలా హోప్స్ పెట్టుకున్నారు. నైజాం గడ్డ మీద గెలిచి..గోల్కొండ కోటలో బీజేపీ జెండా ఎగరవేయాలని పెద్ద ప్లానే వేశారు. ఎన్నికలకు ముందు అనుకోని మార్పులతో అనుకున్న టార్గెట్‌ను రీచ్‌ కాలేకపోయారు కమలనాథులు. అయినా గతానికి కంటే బెటర్‌గా 8 సీట్లు గెలిచారు. దాదాపు 20 సీట్లలో సెకండ్‌ ప్లేస్‌లో నిలిచింది బీజేపీ. లోక్‌సభ ఎన్నికల్లోనూ 8 సీట్లు గెలుచుకుంది. దీంతో పట్టుబట్టి..నిలబడి తలపడితే..నెక్స్ట్ ఎలక్షన్స్‌లో తెలంగాణలోనూ పాగా వేయడం అంత కష్టమేమీ కాదని భావిస్తున్నారట కమలం పార్టీ పెద్దలు. అందులో భాగంగానే ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత..మోదీ ఫస్ట్ పొలిటికల్ టూర్‌ తెలంగాణలోనే జరిగింది.

ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ముందస్తు వ్యూహాలు..

బెంగాల్‌ తర్వాత తెలంగాణపై ఆ స్థాయిలో ఫోకస్ చేయాలనేది బీజేపీ వ్యూహంగా చెబుతున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది. మరీ ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో మోదీ ప్రత్యేకంగా భేటీ అవ్వడం ఇంట్రెస్టింగ్‌గా మారింది. తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన నేపథ్యంలో..హైదరాబాద్ పర్యటనలో ప్రధాని మోదీ..ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో ప్రత్యేకంగా భేటీ అవడం పొలిటికల్ ఇంట్రెస్టింగ్‌గా మారింది. తెలంగాణలో భవిష్యత్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ముందస్తు వ్యూహాలపైనే చర్చ జరిగిందన్న టాక్ బలంగా వినిపిస్తోంది. హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ కీలక భేటీ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సంచలనాలకు దారితీయొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

నెక్స్ట్ గ్రేటర్‌లో మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. హైదరాబాద్, మల్కాజ్‌గిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను బీజేపీ చాలా సీరియస్‌గా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. డీలిమిటేషన్ జరిగితే గ్రేటర్‌లోనే అసెంబ్లీ సీట్లు 56కు పెరిగే అవకాశం ఉండటంతో..మున్సిపల్‌ ఎలక్షన్స్‌లో సత్తా చాటేందుకు ప్రిపరేషన్స్ స్టార్ట్ చేశారట కమలనాథులు. ఇందులో భాగంగా ఏపీలో విజయవంతమైన బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఫార్ములాను తెలంగాణలో కూడా అమలు చేసే దిశగా ప్రధాని అడుగులు వేస్తున్నారని గుసగుసలు మొదలయ్యాయి.

పొత్తు స్ట్రాటజీతో గెలుపు ఈజీ..

తెలంగాణలో బలపడాలని చూస్తున్న బీజేపీకి, టీడీపీ క్యాడర్, జనసేన యువత మద్దతు కలిస్తే రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోతాయని మోదీ బలంగా నమ్ముతున్నారని రాష్ట్ర బీజేపీ నేతలు చెబుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో భేటీలో ప్రధానంగా తెలంగాణ పాలిటిక్స్‌పైనే చర్చ జరిగినట్లు టాక్‌. ఏపీలో పొత్తు స్ట్రాటజీని తెలంగాణలోనూ ఫాలో అయిపోతే.. గెలుపు ఈజీ అవుతుందని లెక్కలు వేసుకుంటున్నారట.

సెటిలర్లను ఆకర్షించాలనే వ్యూహం..

తెలంగాణలో ఎదగాలని బీజేపీ కొంత కాలంగా ఎన్నో వ్యూహాలు రచిస్తోంది. మరోవైపు రాష్ట్ర విభజన తర్వాత బలహీనపడిన టీడీపీ కూడా మళ్లీ తన పాత క్యాడర్‌ను యాక్టివ్ చేయాలన్న ప్రయత్నాల్లో ఉంది. ఇక పవన్ కల్యాణ్‌కు యువతలో ఉన్న ఫాలోయింగ్, జనసేనకు ఉన్న సోషల్ మీడియా ప్రభావం కూడా కూటమికి కలిసొచ్చే అంశాలుగా చెబుతున్నారు. ప్రత్యేకంగా గ్రేటర్ హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఆంధ్రా సెటిలర్ల ప్రభావం ఎక్కువ. గతంలో బీఆర్ఎస్‌ వైపు నిలిచిన సెటిలర్లు..జూబ్లీహిల్స్, కంటోన్మెంట్‌ ఉపఎన్నికలకు వచ్చేసరికి కాంగ్రెస్ దిక్కు టర్న్ అయిపోయారు. మినీ భారత్‌గా ఉన్న హైదరాబాద్‌లోని సెటిలర్లను తమవైపు ఆకర్షించుకోవాలనే వ్యూహంతోనే..ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనలో చంద్రబాబు, పవన్‌ను కలిశారన్న చర్చ జరుగుతోంది.

టీడీపీకి గ్రేటర్ హైదరాబాద్‌లోనే కాదు, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఇప్పటికీ అంతో ఇంతో ఓటు బ్యాంక్, క్యాడర్ ఉందని చెప్తుంటారు. ఈ నేపథ్యంలో టీడీపీ మళ్లీ తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్ అయితే ఆ ఓటు బ్యాంక్‌ను బీజేపీకి డైవర్ట్ అయిపోతుందని అంచనా వేస్తున్నారట. ఇక తెలంగాణ యువతలో పవన్ కల్యాణ్‌ ఉన్న ఇమేజ్‌ కలిసి వస్తుందని భావిస్తున్నారట. ఇప్పటికే తెలంగాణలో జనసేన నిర్మాణంపై పార్టీ కసరత్తు చేస్తోంది. ఈ అంశాలన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఏపీ విక్టరీ ఫార్ములాను నైజాం గడ్డ మీద అమలు చేసే ఆలోచనలో ప్రధాని మోదీ ఉన్నారని అంటున్నారు. ఇదే గనుక జరిగితే రాబోయే రోజుల్లో తెలంగాణ పాలిటిక్స్‌లో అసలు సిసలు పోరు షురూ పక్కా.

Also Read: స్మార్ట్ లాక్ డౌన్.. ఆల్రెడీ పాకిస్తాన్ లో స్టార్ట్ అయిపోయింది.. ఇక ఇండియాలోనూ?