Telangana Congress: అటు రాజన్న, ఇటు రాములమ్మ ఉగ్రరూపం..! అపోజిషన్‌కి మించి సొంత పార్టీ సర్కార్‌పైనే అటాక్.. ఎందుకు..
ఈ ఇద్దరు నేతల తీరుపై అధిష్టానం ఎలా రియాక్ట్ కాబోతుందన్నదే చర్చనీయాంశంగా మారింది. రాజగోపాల్‌రెడ్డి, విజయశాంతిని పిలిచి మాట్లాడి సెట్‌రైట్ చేస్తారా..? లేక కాంగ్రెస్‌లో ఇంటర్నల్ డెమోక్రసీ ఎక్కువ కాబట్టి లైట్ తీసుకుంటారా అనేది చూడాలి.
- Naveen
- Published On : April 1, 2026 / 10:38 PM IST
- మండలిలో రాములమ్మ, అసెంబ్లీలో రాజన్న..
- సొంత పార్టీ ప్రభుత్వంపై బాణాలు ఎక్కపెట్టిన నేతలు
- ఉద్యమకారులకు ఇచ్చిన హామీలపై నిలదీసిన విజయశాంతి
- నిధులన్నీ సీఎం, మంత్రులకేనా అంటూ రాజన్న అటాక్
- ఆ ఇద్దరు సీఎం రేవంత్‌కు కొరకాని కొయ్యగా మారారా?
Telangana Congress: ఇటు రాజన్న. అటు రాములమ్మ. అసెంబ్లీలో ఈయన.. మండలిలో ఆమె. అధికార పార్టీ సభ్యులుగా ఉండి..అపోజిషన్ పార్టీకి మించి స్ట్రాంగ్ వాయిస్ వినిపించి చర్చకు దారితీశారు. రాకరాక సభకు వచ్చి రాములమ్మ ప్రభుత్వ తీరును ఏకరువు పెట్టారు. ఇక ఇప్పటిదాక సభ బయట సంచలన స్టేట్‌మెంట్స్ ఇస్తూ వచ్చిన రాజన్న..ఇప్పుడు ఏకంగా అసెంబ్లీ వేదికగా సొంత పార్టీ సర్కార్‌పై అటాక్ చేశారు. ఆ ఇద్దరు ప్రజాప్రతినిధులు అధికార కాంగ్రెస్ పార్టీకి హెడెక్‌గా మారారా? వాళ్లిద్దరని సీఎం రేవంత్ ఎలా సెట్‌రైట్ చేయబోతున్నారు? అధిష్టానం ఎలా రియాక్ట్ కాబోతోంది?
ఒకరు ఎమ్మెల్యే, మరొకరు ఎమ్మెల్సీ. శాసనసభలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి..శాసన మండలిలో విజయశాంతి చేసిన వ్యాఖ్యలు..రేవంత్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టాయన్న చర్చ జరుగుతోంది. సొంత పార్టీ ప్రజాప్రతినిధులు ప్రభుత్వ తీరును ఎండగట్టడంతో..అపోజిషన్‌కు అస్త్రం దొరికినట్లు అయింది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు మించి హస్తం పార్టీకి చెందిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ గళమెత్తిన తీరు హాట్ టాపిక్‌గా మారింది. దీంతో అటు రాములమ్మ, ఇటు రాజన్న ముఖ్యమంత్రికి తలనొప్పిగా మారారన్న చర్చ జరుగుతోంది.
ఇన్నాళ్లు సమావేశాలు, సభలు, ట్విట్టర్ వేదికగా కామెంట్లు చేస్తూ వచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఓన్లీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి హీట్ క్రియేట్ చేసిన రాములమ్మ..ఇప్పుడు ఏకంగా శాసనసభ, శాసనమండలిలో సొంత పార్టీనే తప్పుపడుతూ కామెంట్లు చేయడం కలకలం రేపుతోంది. అసెంబ్లీ బడ్జెట్ సెషన్‌లో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ విజయశాంతి కామెంట్స్ చేసిన తీరు హాట్ టాపిక్ అవుతోంది.
ఉద్యమకారులు లేకపోతే సీఎం, మంత్రులు ఉండే వారా?
పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న విజయశాంతి..చాలారోజుల తర్వాత శాసనమండలి సమావేశాలకు హాజరయ్యారు. సభలో ఆమె మాట్లాడిన మాటలు సొంత పార్టీ కాంగ్రెస్‌ను డైలమాలో పడేశాయన్న టాక్ నడుస్తోంది. తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీల్లో ఒక్కదాన్ని కూడా నెరవేర్చలేదంటూ మండలిలోనే ప్రభుత్వాన్ని ప్రశ్నించారామె. అధికారంలోకి వచ్చి రెండేండ్లు దాటిపోయిందని..అయినప్పటికీ ఉద్యమకారులకు పార్టీ ఇచ్చిన హామీలు అమలు కాలేదని నిలదీశారు. తెలంగాణ కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన ఉద్యమకారులు లేకపోతే, ముఖ్యమంత్రులు, మంత్రులు కానీ ఉండేవారా? అని క్వశ్చన్ చేశారు.
ఎన్నికల సమయంలో ప్రజలతో పాటు ఉద్యమకారులకు ఇచ్చిన ప్రతి హామీనీ ప్రభుత్వం తప్పనిసరిగా నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు విజయశాంతి. హామీల అమలు కోసం ఇప్పటికే రేవంత్ సర్కార్‌పై ఒత్తిడి పెరుగుతోంది. అటు ప్రజాక్షేత్రంలో..ఇటు అసెంబ్లీలో..మరోవైపు సోషల్ మీడియా వేదిక సర్కార్‌పై బీఆర్ఎస్ ప్రెజర్ పెంచుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్సీ విజయశాంతి ప్రభుత్వంపై బాణాలు ఎక్కుపెట్టడం కాంగ్రెస్‌లో చర్చకు దారితీసింది.
అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిన రాజన్న..
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీలో గట్టిగానే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాంట్రాక్టర్లకు బిల్లుల అంశాన్ని ఎక్స్‌పోజ్ చేసిన రాజగోపాల్‌రెడ్డి..సీఎం, మంత్రుల నియోజకవర్గాల్లో పనులు చేసే కాంట్రాక్టర్లకే బిల్లులు చెల్లిస్తున్నారని..మిగతా చోట్ల బిల్లులు ఇవ్వడం లేదంటూ మండిపడ్డారు. ఎమ్మెల్యేలు లేకుంటే మంత్రులు, ముఖ్యమంత్రులు ఎక్కడి నుంచి వచ్చారని నిలదీశారు. మునుగోడు ఎమ్మెల్యే వ్యాఖ్యలకు అధికార పక్షం నుంచి రియాక్షన్ లేకపోయినా..ఆయన మాత్రం సొంత పార్టీ ప్రభుత్వ తీరును ప్రశ్నించి..ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారన్న టాక్ వినిపిస్తోంది. ఎలాగు తమ నియోజకవర్గాలకు నిధులు ఇవ్వరు..అసెంబ్లీలో అయినా మాట్లాడే సమయం ఇవ్వాలంటూ మాజీమంత్రి హరీశ్‌రావు స్పీకర్‌ను కోరిన కామెంట్స్ వైరల్ అవుతుంటే..ఇదే టైమ్‌లో రాజగోపాల్‌రెడ్డి సీఎం, మంత్రుల నియోజకవర్గాలకే నిధులు ఇస్తున్నారని ఫైర్ అవడం హాట్ టాపిక్‌గా మారింది.
రాజగోపాల్‌రెడ్డి అసంతృప్తి వెనుక మంత్రి పదవి రాలేదన్న ఆగ్రహం ఉందన్నది ఓపెన్ సీక్రెట్. ఆయన సీఎం టార్గెట్‌గానే ఓపెన్ స్టేట్‌మెంట్ ఇస్తూ వస్తున్నారు. రాములమ్మ విషయానికి వస్తే..ఆమె అధిష్టానం కోటాలో..మీనాక్షి నటరాజన్‌తో ఉన్న పరిచయంతో ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్నారని చెప్పుకుంటారు కాంగ్రెస్ నేతలు. పైగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు కూడా. సీఎం రేవంత్ రెడ్డి తన పార్టీ కార్యక్రమాలకు దూరం పెడుతున్నారనే అసంతృప్తిలో విజయశాంతి ఉన్నట్లు ఇన్ సైడ్ టాక్. ఈ క్రమంలోనే ఆమె ప్రతిపక్ష బీఆర్ఎస్‌కు కంటే బలంగా..ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీపై నిలదీశారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇటు రాజన్న, అటు రాములమ్మ..ప్రభుత్వాన్ని, పార్టీని కార్నర్ చేసేలా మాట్లాడారన్నది హస్తం పార్టీ నేతల ఒపీనియన్. అయితే ఈ ఇద్దరు నేతల తీరుపై అధిష్టానం ఎలా రియాక్ట్ కాబోతుందన్నదే చర్చనీయాంశంగా మారింది. రాజగోపాల్‌రెడ్డి, విజయశాంతిని పిలిచి మాట్లాడి సెట్‌రైట్ చేస్తారా..? లేక కాంగ్రెస్‌లో ఇంటర్నల్ డెమోక్రసీ ఎక్కువ కాబట్టి లైట్ తీసుకుంటారా అనేది చూడాలి.
Also Read: టార్గెట్ పాడి కౌశిక్ రెడ్డి..! వేటు ఖాయమా? కాంగ్రెస్ ప్లాన్ ఏంటి?
