Pawan Kalyan: సై అంటే సై.. కాంగ్రెస్ లీడర్లు పవన్ కల్యాణ్ ని ఎందుకు టార్గెట్ చేశారు? కారణం అదేనా..
జనసేనాని కామెంట్స్‌కు కాంగ్రెస్ నేతల నుంచి కూడా అదే స్థాయిలో కౌంటర్ అటాక్ జరుగుతోంది. అటు పవన్, ఇటు కాంగ్రెస్ నేతలు తగ్గే పరిస్థితి కనిపించకపోవడంతో..తెలంగాణ రాజకీయం మరింత రసవత్తరంగా మారే పరిస్థితి కనిపిస్తోంది.
- Naveen
- Updated on- June 3, 2026 / 01:07 AM IST
- పవన్ చుట్టూ రంకెళ్లు వేస్తున్న తెలంగాణ రాజకీయం
- భారీ బహిరంగ సభతో రీఎంట్రీకి ప్లాన్ చేసిన పవన్
- పవన్ సభకు బ్రేకులు..కాంగ్రెస్ నేతల ఎదురుదాడి
- తెలంగాణకు రానిచ్చే ముచ్చటే లేదన్న హస్తం లీడర్లు
- తెలంగాణలో తిరుగుతా..పోటీ చేసి తీరుతానంటున్న పవన్
Pawan Kalyan: సమ్మర్ హీట్ వేవ్ కంటే..తెలంగాణ సెంటిమెంట్ పాలిటిక్స్ కాక రేపుతున్నాయి. పవన్ ద్వారా తెలంగాణలో కూటమి ఎంట్రీకి బీజేపీ వేసిన స్కెచ్‌కు ఆదిలోనే బ్రేక్ వేసే ప్రయత్నం చేసింది కాంగ్రెస్. హైదరాబాద్‌లో..పైగా తెలంగాణ ఆవిర్భావం రోజు పవన్ సభ పెడతానని ప్రకటించడంతో..రచ్చ స్టార్ట్ అయింది. పీసీసీ చీఫ్ నుంచి మంత్రులకు వరకు అందరూ పవన్ సభను వ్యతిరేకించారు. పోలీసులు, కోర్టు కూడా అనుమతి నిరాకరించడంతో..చివరకు ప్రెస్‌మీట్ పెట్టి..స్ట్రాంగ్ వాయిస్ వినిపించారు పవన్. తెలంగాణలో తిరిగి తీరతానని సవాల్ చేశారు జనసేనాని. పవన్ చుట్టూ చక్కర్లు కొడుతున్న ఈ రాజకీయ రచ్చ ఎటువైపు? పవన్ పేరు ఎత్తితే కాంగ్రెస్ లీడర్లు ఎందుకు ఒంటి కాలిపై లేస్తున్నారు?
తెలంగాణ పాలిటిక్స్‌లో..జనసేన చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సెంట్రిక్‌గా పెద్ద రచ్చే నడుస్తోంది. ప్రొ.నాగేశ్వర్ వ్యాఖ్యలతో మొదలైన ఇష్యూ, తెలంగాణ కాంగ్రెస్ నేతల అటాక్‌తో రాజకీయ దమారం పీక్ లెవల్‌కు చేరింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు..హైదరాబాద్‌లో నవ నిర్మాణ సభ పెట్టాలని పవన్ భావించడం గొడవకు ప్రధాన కారణమైంది. దీంతో మరోసారి తెలంగాణ సెంటిమెంట్ రాజుకుంది. గతంలో పవన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ..తెలంగాణ తిరగనివ్వబోమంటూ కాంగ్రెస్ నేతలు స్టేట్‌మెంట్లు ఇచ్చేశారు. పవన్ నటనను, డ్రెస్సింగ్ సెన్స్‌ను, బీజేపీతో ఆయనకున్న సాన్నిహిత్యాన్ని విమర్శిస్తూ మంత్రి పొన్నం చేసిన కామెంట్స్ ఫుల్ వైరల్ అయ్యాయి. పవన్ వెనుక ఎవరో ఉండి నడిపిస్తున్నారని పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్..జనసేనాని ప్రెస్‌మీట్‌కు కూడా అనుమతించేది లేదని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి.
ఆత్మగౌరవానికి భంగం అంటూ సెంటిమెంట్‌ను రాజేసే ప్రయత్నం..
అయితే ఈ డెవలప్‌మెంట్స్ అన్నీ ఒక్కరోజులో జరగలేదు. ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా..ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో భేటీ కావడం, తెలంగాణ పాలిటిక్స్‌లో తెలియని అలజడి మొదలైంది. కాంగ్రెస్ నేతలు ముందుగానే అలర్ట్ అయ్యారు. పవన్ సభ ద్వారా తెలంగాణలో కూటమి ఎంట్రీకి ప్లాన్ చేస్తే..మొదటల్లోనే ఆ ప్రయత్నానికి చెక్ పెట్టేలా కాంగ్రెస్ దూకుడు ప్రదర్శించింది. బీజేపీ సొంతంగా బలపడే కంటే పవన్ వంటి స్టార్ పవర్ సాయంతో పుంజుకుంటుందేమోనని అలర్ట్ అయిన కాంగ్రెస్..ఔట్ రైట్ స్టాండ్ తీసుకుని పవన్‌ను టార్గెట్ చేసింది. తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కవిత కూడా పవన్‌ను కార్నర్ చేసే ప్రయత్నం చేశారు. తెలంగాణ వచ్చినప్పుడు భోజనం చేయలేదని పవన్ గతంలో చేసిన కామెంట్స్..కోనసీమ కొబ్బరి చెట్ల వ్యాఖ్యలు కాంగ్రెస్‌కు ప్రధాన ఆయుధాలుగా మారాయి. పవన్ ఇక్కడ అడుగుపెడితే తెలంగాణ ఆత్మగౌరవానికి భంగం వాటిల్లుతుందని, సెంటిమెంట్‌ను రాజేసే ప్రయత్నం చేశారు తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు.
ఇంకెంత కాలం ఈ ప్రాంతీయ విద్వేషాలు?
ఫైనల్‌గా సభకు అనుమతివ్వాలంటూ జనసేన వేసిన పిటిషన్‌ను కోర్టు కూడా స్వీకరించకపోవడంతో ప్రెస్‌మీట్ అంటూ మీడియా ముందుకు వచ్చిన జనసేనాని ఫుల్ ఫైర్ అయ్యారు. తెలంగాణకు వ్యతిరేకం కాదు..రాష్ట్రాన్ని విభజించిన తీరుకు వ్యతిరేకమంటూ చెప్పుకొచ్చారు. తెలంగాణలో జనసేన ఉంటుంది. పోటీ చేస్తుంది. తెలంగాణ మీ అయ్య జాగీరా అంటూ కాంగ్రెస్ నేతలకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. దాడులు, బెదిరింపులకు భయపడే ముచ్చటే లేదన్నారు. ఇందిరా గాంధీ, ప్రియాంక, రాహుల్ ఎక్కడైనా పోటీ చేయొచ్చు కానీ..తాను తెలంగాణకు రావొద్దా అంటూ ప్రశ్నించారు. పదే పదే ఆంధ్రా అంటూ ప్రస్తావించడం తనకు నచ్చడం లేదన్నారు పవన్.
జనసేనాని కామెంట్స్‌కు కాంగ్రెస్ నేతల నుంచి కూడా అదే స్థాయిలో కౌంటర్ అటాక్ జరుగుతోంది. అటు పవన్, ఇటు కాంగ్రెస్ నేతలు తగ్గే పరిస్థితి కనిపించకపోవడంతో..తెలంగాణ రాజకీయం మరింత రసవత్తరంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో పవన్ సెంట్రిక్‌గా తెలంగాణలో పొలిటికల్ హీట్ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రాంతీయ వాదానికి, పవన్ చెప్తున్న జాతీయవాద ఆలోచనలకు మధ్య జరుగుతున్న ఈ పోరు, తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో చూడాలి.
Also Read: ఖజానా ఖాళీ? పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో తెలంగాణ సర్కార్? సవాళ్లు దాటేదెలా..
