Grama Swarajyam: సర్పంచ్‌లు గ్రామాల అభివృద్ధి సాధకులు. గ్రామ పాలనకు సర్పంచ్ ప్రధాన నాయకుడు. పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు అని మహాత్మా గాంధీ చెప్పారు. పల్లెలు అభివృద్ధి సాధిస్తేనే దేశాభివృద్ధి సాధ్యమవుతుంది.
అటువంటి గ్రామాల అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించే బాధ్యత సర్పంచ్‌లది. వారిని ఒకే చోటికి తీసుకొచ్చింది 10టీవీ. 10 ఉమ్మడి జిల్లాల 100 మంది సర్పంచ్‌లు.. 1,000కి పైగా సమస్యలపై, గ్రామాభివృద్ధిలో సవాళ్లు-పరిష్కార మార్గాలపై ఇందులో చర్చించారు.
Also Read: ఛలో గావ్.. కాంగ్రెస్ ఊరిబాట.. దేశవ్యాప్త నిరసనలకు పిలుపు..
నూతన సర్పంచ్‌లకు దివిటీలుగా.. పల్లె ప్రగతికి దిక్సూచిగా.. అతిరథ మహారథులైన నేతలు, ప్రజాప్రతినిధుల అనుభవాలతో.. 10TV గ్రామ స్వరాజ్యం.. సర్పంచ్‌ల సమ్మేళనం-2025ను నిర్వహించింది. ఈ కార్యక్రమం ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రసారం కానుంది.
తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, బీజేపీ ఎంపీ రఘునందన్ రావు, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, బల్మూరి వెంకట్ సహా పలువురు నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొని సూచనలు చేశారు. ఆదివారం ఉదయం 10 గంటలకు 10టీవీలో ఈ ప్రోగ్రాం చూడొచ్చు..