Cm Revanth Reddy: పెన్షన్లపై సీఎం రేవంత్ స్పెషల్ ఫోకస్.. పెంచేందుకు మాస్టర్ ప్లాన్..!

తెలంగాణలో ప్రస్తుతం 43 లక్షల మందికి చేయూత పెన్షన్లు అందిస్తుంది రేవంత్ సర్కార్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక..స్పెషల్ కేర్ తీసుకుని..

Cm Revanth Reddy: పెన్షన్లపై సీఎం రేవంత్ స్పెషల్ ఫోకస్.. పెంచేందుకు మాస్టర్ ప్లాన్..!

Updated On : December 26, 2025 / 9:22 PM IST

Cm Revanth Reddy: బోగస్ పెన్షన్లు. ఇది ఎప్పటి నుంచో ఉన్న చర్చ. కానీ ఎవరూ కొలిక్కి తేలేని సమస్యగా మిగిలిపోయింది. అయితే రేవంత్ సర్కార్ సామాజిక భద్రతా పెన్షన్లలో అక్రమాలను అరికట్టేందుకు ఫోరెన్సిక్ ఆడిట్‌ను చేపట్టింది. పైలట్ ప్రాజెక్టులో ఇప్పటికే 10 శాతం అనర్హులు పెన్షన్లు పొందుతున్నట్లు గుర్తించారట. ఈ ఆడిట్‌ను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి..అర్హులైన పేదలకే లబ్ధి చేకూర్చాలనేది ప్రభుత్వం టార్గెట్‌గా చెబుతున్నారు.

నాలుగు జిల్లాలను ఎంపిక చేసి పైలట్ ప్రాజెక్టును చేపట్టింది సర్కార్. ఇందులో భాగంగా దాదాపు 20 వేల మంది పెన్షనర్ల వివరాలను పరిశీలించగా..షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయట. ఈ శాంపిల్స్‌లోనే దాదాపు 2 వేల మంది అంటే 10 శాతం అనర్హులుగా తేలారట. వీరిలో చనిపోయిన వారి పేరుతో పెన్షన్లు తీసుకుంటున్న వారు, 50 ఏళ్లు కూడా నిండకుండానే వృద్ధాప్య పెన్షన్లు పొందుతున్న యువకులూ ఉన్నారట. అంతేకాకుండా, ఎలాంటి శారీరక వైకల్యం లేకపోయినా నకిలీ సర్టిఫికెట్లతో దివ్యాంగ పెన్షన్లు పొందుతున్నట్లు బయటపడింది అంటున్నారు. దీంతో నెలకు కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం మిస్ యూజ్ అవుతోందని ప్రభుత్వం భావిస్తోందట.

ఫోరెన్సిక్ ఆడిట్‌ తర్వాతే పెన్షన్ల పెంపు..

పైలట్ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన తనిఖీల్లోనే ఇన్ని బోగస్ పెన్షన్లు బయటపడితే.. రాష్ట్రవ్యాప్తంగా ఫోరెన్సిక్ ఆడిట్‌ చేస్తే ఇంకా ఎన్ని అక్రమాలు వెలుగులోకి వస్తాయోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది. ఫోరెన్సిక్ ఆడిట్ పూర్తయిన తర్వాత అనర్హులుగా తేలిన వారందరినీ లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించడమే కాకుండా, ఇప్పటివరకు వారు అక్రమంగా పొందిన సొమ్మును రికవరీ చేయాలనే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉందట. అనర్హులను ఏరివేయడం ద్వారా మిగిలే నిధులను, కొత్తగా పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన నిరుపేదలకు కేటాయించాలని, పెన్షన్లనూ పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

43 లక్షల మందికి చేయూత పెన్షన్లు..

తెలంగాణలో ప్రస్తుతం 43 లక్షల మందికి చేయూత పెన్షన్లు అందిస్తుంది రేవంత్ సర్కార్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక..స్పెషల్ కేర్ తీసుకుని.. ఎయిడ్స్, దివ్యాంగులు, డయాలసిస్ పేషెంట్లకు కలుపుకుని కొత్తగా దాదాపు 20వేలకు పైగా పెన్షన్లు ఇస్తోంది. ఇలా వృద్ధులు, వితంతువులు, నేతన్నలు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, ఎయిడ్స్ బాధితులకు నెలకు 2,016 చొప్పున పెన్షన్ అందిస్తుండగా..దివ్యాంగులకు నెలకు 4,016 చెల్లిస్తున్నారు. ఇక డయాలసిస్ రోగులు సహా ఇతర దీర్ఘకాలిక రోగులకు నెలకు 5 వేల నుంచి 10 వేల వరకు పెన్షన్లు అందిస్తున్నారు. అయితే కాంగ్రెస్ మ్యానిఫెస్టో ప్రకారం సాధారణ పెన్షన్లను 4 వేలకు, దివ్యాంగుల పెన్షన్ ను 6 వేలకు పెంచుతామని హామీ ఇచ్చింది కాంగ్రెస్. పెన్షన్లను పెంచే ముందు.. బోగస్ పెన్షన్ దారులకు షాక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యిందట రేవంత్ సర్కార్.

ఫోరెన్సిక్ ఆడిట్ అమలు చేస్తూ..ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీని వాడనుంది సర్కార్. ప్రస్తుతం పంచాయతీ సెక్రటటీ లేదంటే..పోస్ట్ ఆఫీసుల ద్వారా పెన్షన్లను ఇస్తున్నారు. ఇక పట్టణ ప్రాంతాల్లో అయితే నేరుగా.. లబ్ధిదారుని ఖాతాలో జమ అవుతుంది. ఇలా డైరెక్ట్ గా అకౌంట్లో పెన్షన్ నగదు జమ కావాలంటే..ప్రతి ఏడాది లైవ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే..ఇక్కడ కింది అధికారుల కక్కుర్తితో.. చాలామంది నకిలీ లైవ్ సర్టిఫికేట్స్ అందించి..ఇప్పటికి పెన్షన్లు తీసుకుంటున్నట్లు సర్కార్ దృష్టికి వచ్చిందట. చనిపోయిన వారి పేరుపైనా ఇప్పటికీ కొందరు పెన్షన్లు తీసుకుంటున్నారట. దీంతో ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజ్ తో..నిజమైన బెనిఫిషరీ ఎవరో తేలిపోనుంది.

అంతేకాదు.. లబ్ధిదారుల్లో వృద్ధులు, నడువ లేని వారు ఉంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని..ప్రతి ఇంటికి వెళ్లి ఫేషియల్ రికగ్నైజేషన్ రికార్డ్ చేయనున్నారట. ఫిబ్రవరిలోపు ఫోరెన్సిక్ ఆడిట్ పూర్తి చేయాలని భావిస్తున్నారట సీఎం రేవంత్. లెక్క తేలిన తర్వాత..ఇటీవల కొత్త రేషన్ కార్డులు జారీ చేసిన నేపథ్యంలో కొత్తగా అర్హత పొందిన వారి నుంచి పెన్షన్ దరఖాస్తులు స్వీకరించనుందట సర్కార్. వచ్చే బడ్జెట్ లో కొత్త పెన్షన్లకు ప్రత్యేక కేటాయింపులు చేయనున్నారట.

ప్రస్తుతం ఉన్న బోగస్ పెన్షన్ దారుల లెక్క తేలిన తర్వాత.. అర్హులకు కొత్తగా పెన్షన్ మంజూరు చేయడంతో పాటు ఇప్పటికే పెన్షన్ అమౌంట్ ను పెంచాలనేది ప్రభుత్వ ఆలోచనగా చెబుతున్నారు. ఆ తర్వాతే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లాన్నది రేవంత్ వ్యూహంగా కనిపిస్తోంది. మరి పెన్షన్ల ఏరివేతతో వచ్చే సవాళ్లను కాంగ్రెస్ సర్కార్ ఎలా ఫేస్ చేయబోతోందో చూడాలి.

Also Read: కేసీఆర్ అసెంబ్లీకి వస్తే మీ గుండె ఆగిపోతుంది, నేను ఆంధ్రాలో చదివితే తప్పేంటి?- సీఎం రేవంత్ కు కేటీఆర్ కౌంటర్