Rega Kantha Rao : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు కేసు‌లో ట్విస్ట్..

Rega Kantha Rao : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో లైంగిక వేధింపుల కేసు నమోదైంది.

Rega Kantha Rao

Rega Kantha Rao : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో లైంగిక వేధింపుల కేసు నమోదైంది. పెళ్లి చేస్తానని నమ్మించి తనను లైంగికంగా వేధించడంతో పాటు మోసం చేశాడంటూ ఓ యువతి ఫిర్యాదు చేయగా, పోలీసులు ఈనెల 26న కేసు నమోదు చేశారు.

Also Read : AP Crime : ఏపీలో దారుణ ఘటన.. బిక్షాటన చేస్తున్న బాలికను హత్యచేసి.. మృతదేహాన్ని సూట్‌కేసులో కుక్కి..

బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. ఉద్యోగ ఇంటర్వ్యూ పేరుతో తనను ఫ్లాట్‌కు పిలిచి లైంగిక దాడికి పాల్పడ్డాడని, అనంతరం పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో శారీరక సంబంధం కొనసాగించాడని పేర్కొంది. అలాగే తనకు తెలియకుండా ప్రైవేట్ వీడియోలు చిత్రీకరించాడని ఆరోపించింది. అంతేకాకుండా రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడుల పేరుతో తన వద్ద నుంచి డబ్బులు తీసుకున్నాడని, తన మొబైల్ ఫోన్‌ను యాక్సెస్ చేసి తన స్నేహితురాలికి కూడా ఇదే తరహాలో సందేశాలు పంపి పరిచయం పెంచుకున్నాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. యువతి ఫిర్యాదు ఆధారంగా పంజాగుట్ట పోలీసులు రేగా కాంతారావుపై బీఎన్‌ఎస్ సెక్షన్ 69తో పాటు సెక్షన్ 351(2) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రేగా కాంతారావుపై కేసు నమోదైనట్లు వార్తలు వచ్చిన కొద్దిసేపటికే బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. తాను ఫిర్యాదు చేయకుండా ఎలా కేసు నమోదు అయిందో అంటూ బాధిత మహిళ పేర్కొన్నట్లు సమాచారం. అయితే, ఈ అంశాలపై పూర్తిస్థాయిలో స్పష్టత రావాల్సి ఉంది. నిజంగానే మహిళ ఫిర్యాదు చేసిందా? అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.