Heavy Rains: ఈ జిల్లాల్లో 4 రోజుల పాటు వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ
హైదరాబాద్‌లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
- T Venkateshwarlu
- Published On : April 2, 2025 / 10:37 AM IST
Rain
ఎండల కారణంగా ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు చల్లని కబురు. తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. చత్తీస్‌గఢ్, మహారాష్ట్రల మీదుగా ఉపరితల ఆవర్తనం, దానికి ఆనుకుని ద్రోణి కొనసాగుతోంది.
మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు మీదుగానూ మరో ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో వానలు పడతాయని ఐఎండీ చెప్పింది. ఇవాళ, రేపు వడగండ్ల వాన పడవచ్చని పేర్కొంది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడొచ్చని వివరిస్తూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
Also Read: ఇండియాలో టాప్ సెల్లింగ్ కార్లు ఇవే.. ఎగబడి కొంటున్న జనం
ఇవాళ, రేపు ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, మెదక్, కామారెడ్డి, నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల్లో వర్షాలు పడొచ్చని తెలిపింది.
వచ్చే శుక్ర, శనివారాల్లో రెండు రోజులు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్‌లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలో నాలుగు రోజులు ఉష్ణోగ్రతలు 2 – 4 డిగ్రీల మధ్య తగ్గే అవకాశం ఉందని వివరించింది. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో నిన్న 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు.
