×
Ad

Heavy Rains : తెలంగాణలో రాగల మూడు రోజులు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరికలు

మూడు రోజులపాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

  • Published On : September 14, 2023 / 12:57 AM IST

Telangana Heavy Rains (1)

Telangana Heavy Rains : తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ వాతావరణ శాఖ మరోసారి భారీ వర్ష సూచన చేసింది. రాష్ట్రంలో రాగల మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మూడు రోజులపాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది.

బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు కొమురంభీ ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

Rain Forecast : దేశంలో రానున్న నాలుగు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరికలు

శుక్రవారం నుంచి శనివారం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమ్తతంగా ఉండాలని సూచించింది.