యాదగిరిగుట్ట దేవస్థానం చరిత్రలో కేసీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారు : హీరో సుమన్

యాదగిరిగుట్ట దేవస్థానం చరిత్రలో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారని ప్రముఖ హీరో సుమన్ అన్నారు. గురువారం యాదాద్రి గుట్టపై స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Hero Suman

Hero Suman: యాదగిరిగుట్ట దేవస్థానం చరిత్రలో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారని ప్రముఖ హీరో సుమన్ అన్నారు. గురువారం యాదాద్రి గుట్టపై స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన సమయంలో యాదాద్రి ఆలయ నిర్మాణ పనులు జరుగుతున్నప్పుడు స్వామి వారిని దర్శించుకున్నానని అన్నారు. ప్రస్తుతం ఆయల నిర్మాణం పూర్తయిన తర్వాత దేవుడిని దర్శించుకోవడం ఇదే మొదటి సారి అని సుమన్ తెలిపారు.

Also Read: KTR: అయినను పోయి రావాలె..! సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై కేటీఆర్ ఘాటు విమర్శలు..

ఆలయ నిర్మాణ శైలిని చూస్తుంటే ఎంతో అద్భుతంగా కనువిందు చేస్తుందని అన్నారు. స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరారు. ఆలయ పరిశుభ్రతను సుమన్ మెచ్చుకున్నారు. పారిశుద్ధ్యంపై భక్తులుసైతం సహకరించాలని సూచించారు