×
Ad

Milk Test : మీరు తీసుకునే పాలు స్వచ్ఛమైనవా.. కల్తీవా..? ఇంట్లోనే సింపుల్ చిట్కాలతో ఇలా గుర్తించండి..

Milk Test : కల్తీ పాలను గుర్తించడం ఎలా అనే విషయాలపై ప్రజలు ఎక్కువ మంది దృష్టిసారించారు. ఈ క్రమంలో ఇంట్లోనే పలు సింపుల్ చిట్కాలతో కల్తీ పాలను ఎలా గుర్తించాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Milk Test

  • కల్తీ పాలతో అనారోగ్యాల పాలవుతున్న ప్రజలు
  • యూరియా, కెమికల్స్‌, ఇతర పదార్థాల వినియోగం
  • కల్తీ పాలను ఇంట్లోనే సింపుల్ చిట్కాలతో గుర్తించొచ్చు

Milk Test : ప్రతీ ఒక్కరూ నిత్యం వినియోగించే వాటిలో పాలు ఒకటి. చిన్న పిల్లల నుంచి పెద్దవారు, వృద్ధులు పాలను నిత్యం తీసుకుంటుంటారు. తద్వారా ఆరోగ్యవంతంగా ఉంటామని భావిస్తుంటారు. అయితే, కొందరు వ్యాపారులు అడ్డదారిలో డబ్బులు సంపాదించాలనే లక్ష్యంతో పాలను కల్తీ చేస్తూ ప్రజల ప్రాణాల్ని పణంగా పెడుతున్నారు. యూరియా, హైడ్రాక్సైడ్, డిటర్జెంట్లు, పిండి పదార్థాలు, సోడా వంటివి కలుపుతూ కల్తీకి పాల్పడుతున్నారు.. తద్వారా వారి జేబులు నింపుకుంటూ.. ప్రజల ఆరోగ్యాలను పాడు చేస్తున్నారు.

Also Read : Gold Rate Today : బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు.. ఏపీ, తెలంగాణలో తులం గోల్డ్ రేటు ఎంతంటే..

ఇటీవల రాజమండ్రిలో కల్తీ పాలు తాగి నలుగురు మరణించారు. పలువురు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ నేపథ్యంలో కల్తీ పాలను గుర్తించడం ఎలా అనే విషయాలపై ప్రజలు ఎక్కువ మంది దృష్టిసారించారు. ఈ క్రమంలో ఇంట్లోనే పలు సింపుల్ చిట్కాలతో కల్తీ పాలను ఎలా గుర్తించాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

కల్తీ పాలను ఇలా గుర్తించండి..
♦ చేతి వేలిని పాలలో ముంచితే చిక్కగా అనిపిస్తుంది. దీంతో నాణ్యమైన పాలు అనుకుంటారు. కానీ, కొందరు ఆ పాలలో పిండి పదార్థం కలుపుతున్నారు. పాలల్లో స్టార్చ్ (పిండి పదార్థం) కలపడం అనేది ఒక సాధారణ కల్తీ పద్దతి. పాలలో నీటిని కలిపినప్పుడు, దాని చిక్కదనం తగ్గిపోకుండా, పాలు చిక్కగా ఉన్నట్లు చూపించడాని, అలాగే ఘన పదార్థాల శాతాన్ని పెంచడానికి స్టార్చ్, గంజి లేదా పిండిదార్థాలను కలుపుతారు. పాలలో ఇలాంటి కల్తీని గుర్తించాలంటే.. ఒక గ్లాసులో కొద్దిగా పాలను తీసుకోవాలి. అందులో ఒకటి లేదా రెండు అయోడిన్ ద్రావణం చుక్కలు వేయాలి. ఆ వెంటనే పాలు నీలి రంగులోకి మారితే.. అందులో పిండి లేదా స్టార్చ్ కలిపారని గుర్తించాలి. అలా కాకుండా పాలు సాధారణ తెలుపు రంగులోనే ఉంటే.. కల్తీ జరగలేదని నిర్దారణకు రావాల్సి ఉంటుంది.
♦ కొందరు పాలలో యూరియాను కలుపుతూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. కొద్దిగా పాలు, మరిన్ని నీళ్లలో యూరియా కలిపితే మొత్తం పాలుగానే కనిపిస్తాయి. గేదెలు, ఆవుల నుంచి అప్పుడే తీసిన పాలులా నురగతో ఉంటాయి. అయితే, పాలలో యూరియా కలిపిన విషయాన్ని గుర్తించాలంటే .. కొన్ని పాలను తీసుకొని లిట్మస్ పేపర్ అందులో ముంచాలి. అప్పుడు అది నీలంగా మారితే యూరియా కలిపారని అర్ధం.
♦ కొందరు పాలలో సర్ఫ్, సబ్బు, నూనెలను కలిపి కల్తీ చేస్తూ సొమ్ముచేసుకుంటున్నారు. ఇలాంటి వాటిని గుర్తించాలంటే.. పాలను బాగా రిగించినప్పుడు.. అవి పసుపు రంగులోకి మారితే అందులో సర్ఫ్, సబ్బు లేదా నూనె పదార్థాలు కలిపారని భావించాలి. అంతేకాక.. పాలను ఓ సీసాలో పోసి బాగా కుదిపితే.. అధికంగా నురగ వస్తే తప్పకుండా కల్తీ జరిగినట్లు నిర్ధారించుకోవాలి.
♦ పాలలో కొందరు గంజి పౌండర్ కలుపుతూ కల్తీ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇలాంటి పాలను గుర్తించాలంటే.. ఐదు మిల్లీ లీటర్ల పాలలో రెండు స్పూన్ల ఉప్పు కలపాలి. ఈ మిశ్రమం నీలి రంగులోకి మారితే పాలలో గంజి పౌడర్ కలిపినట్లు గుర్తించాలి.
♦ నున్నటి గచ్చు, టైల్స్‌ మీద రెండు చుక్కల పాలు వేస్తే వెంటనే చెదిరిపోతే నీళ్లు కలిసినట్లు. అదే స్వచ్ఛమైన పాలు నెమ్మదిగా జారుతాయి. అక్కడ తెల్లటి మచ్చ కూడా ఏర్పడుతుంది. ఇలాంటి చిట్కాలతో ఇంటిలోనే మనం వాడే పాలలో ఏమైనా కల్తీ జరిగిందా అనే విషయాలను తెలుసుకోవచ్చు.