Enumeration Form : ఆన్‌లైన్ ఎన్యూమరేషన్ ఫారమ్ విధానాలేంటి? ఓటర్లు ఈ ఫారమ్ ఎలా నింపాలి?

SIR, Enumeration Form : ఆన్‌లైన్ ఎన్యూమరేషన్ ఫారమ్ పంపిణీకి సంబంధించి విధానాలు గురించి తెలుసా? ఓటర్లు ఈ ఫారమ్ ఉపయోగించి ఎలా నింపాలో ఇప్పుడు చూద్దాం..

Enumeration Form

Enumeration Form : ఆన్‌లైన్ ఎన్యుమరేషన్ ఫారం (గణన పత్రం) అనేది ఓటర్ల జాబితాలో పేరు రిజిస్టర్ చేసుకోవడం లేదా ఉన్న వివరాలను అప్‌డేట్ చేసుకునేందుకు భారత ఎన్నికల సంఘం (ECI) అందిస్తున్న డిజిటల్ సదుపాయం. తద్వారా ఓటర్లకు కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఇంటి నుంచే తమ వివరాలను ఈజీగా మార్చుకోవచ్చు.

లాగిన్ అయ్యాక వారు “Fill Enumeration Form” అనే క్యాప్షన్ కింద అందుబాటులో ఉన్న ఆప్షన్ ఎంచుకోవాలి. ఈ సదుపాయం ఓటర్ల జాబితాలో పేరు, ఆధార్ కార్డులోని పేరుతో సరిపోలిన ఓటర్లందరికి అందుబాటులో ఉంటుంది.

ముఖ్యంగా మొబైల్ నంబర్ లేదా EPIC నంబర్ ద్వారా ఈజీగా లాగిన్ అయ్యే విధంగా ఈ సిస్టమ్ డెవలప్ చేశారు. OTP ఆధారిత వెరిఫికేషన్ ద్వారా సేఫ్టీతో పాటు రియల్ ఓటర్ ఐడెంటిటీని కూడా గుర్తించవచ్చు. అవసరమైన వివరాలు నింపిన తర్వాత e-sign ద్వారా ఫారం పూర్తి చేయవచ్చు. ఈ విధానం వల్ల ఓటర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చాలా వేగంగా, ఈజీగా పారదర్శకంగా మారుతుంది.

గణన పత్రం పంపిణీ విధానాలేంటి? :
బూత్ స్థాయి అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారమ్స్ రెండు కాపీలను అందిస్తారు. ఫారమ్ నింపడంలో కూడా సాయం చేస్తారు.

Read Also : SIR Explained : ‘సర్’ అంటే ఏంటి? ఎందుకు అవసరం? ఎలా జరుగుతుంది? ఓటర్ల జాబితా ఫుల్ ప్రాసెస్ ఇదే..!

ఓట్ర్పల ఎన్యూమరేషన్ ఫారమ్స్‌లో సంబంధిత వివరాలను నింపాలి. ఆ తర్వాత ఆ ఫారంను బూత్ స్థాయి అధికారులు తర్వాత వచ్చి సేకరిస్తారు.

బూత్ స్థాయి అధికారి ఆయా ఫారమ్స్ సేకరించి ఎన్యూమరేషన్ ఫారమ్ కాపీ ఒకటి తమ వద్దే ఉంచుకుంటారు. రెండో కాపీపై ఫారమ్ అందినట్టు రశీదు కూడా ఇస్తారు. ఈ రెండో కాపీని ఓటర్ తమ వద్దే ఉంచుకోవాలి.

ఓటరు ఎన్యూమరేషన్ ఫారమ్ ఆన్ లైన్ లో కూడా నింపి సమర్పించవచ్చు. ఇందుకోసం భారత ఎన్నికల సంఘం (ECI) వెబ్ సైట్ https://voters.eci.gov.in లో కూడా పూర్తి చేయొచ్చు. ఓటర్లు SIR 2002లోని తమ వివరాలను సెర్చ్ చేసేందుకు వీలుగా ఆన్ లైన్ సెర్చ్ ఆప్షన్ కూడా ఉంది.

బూత్ స్థాయి అధికారులు కొత్త ఓటర్ల నమోదు కోసం అవసరమైతే డిక్లరేషన్ ఫారమ్, ఫారమ్ 6 కూడా అందిస్తారు. బూత్ స్థాయి అధికారి ప్రతి ఓటర్ ఇంటిని కనీసం 3 సార్లు వచ్చి వివరాలను సేకరిస్తారు.