Husband Bites Wife Nose : వీడెక్కడి మొగుడండీ బాబు..! భార్య ముక్కును కొరికి పక్కన పడేశాడు.. పుట్టింటికి వెళ్లడంతో..

Husband Bites Wife Nose : మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్య పట్ల భర్త కర్కశంగా ప్రవర్తించాడు.

Husband Bites Wife Nose

Husband Bites Wife Nose : మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్య పట్ల భర్త కర్కశంగా ప్రవర్తించాడు. భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో ఆగ్రహానికి గురైన భర్త.. కాపురానికి రావడం లేదంటూ అత్తింటికి వెళ్లి భార్యతో గొడవపడి ఆమె ముక్కును బలంగా కొరికాడు. దీంతో ముక్కు సగభాగం కట్ అయింది. వెంటనే కుటుంబ సభ్యులు తీవ్ర రక్తస్రావంతో గాయపడిన బాధితురాలిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్సకోసం వరంగల్‌ ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు.

Also Read : Helicopter Crash : అయ్యో.. బస్సు ప్రమాదాన్ని కవర్ చేసేందుకు వెళ్లి.. కుప్పకూలిన హెలికాప్టర్.. పలువురు మృతి

కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కోటపల్లి మండలం మల్లంపేట గ్రామానికి చెందిన ఎనగందుల మణిచందర్ కు కోటపల్లికి చెందిన మమతతో తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, కొద్దికాలంగా దంపతుల మధ్య తరచూ గొడవులు జరుగుతున్నాయి. రెండ్రోజుల క్రితం అదనపు కట్నం కోసం భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో మమత కోటపల్లిలోని పుట్టింటికి వెళ్లింది.

పుట్టింటికి వెళ్లిన మమత రెండ్రోజులయినా తిరిగిరాకపోవడంతో మణిచందర్ అత్తగారింటికి వెళ్లి మమతపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. మమతపై దాడి చేసేందుకు మణిచందర్ యత్నించడంతో అక్కడే ఉన్న మమత తండ్రి నారాయణ అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. అడ్డొచ్చిన మామను తీవ్రంగా గాయపర్చిన మణిచందర్.. ఆ తరువాత భార్య మమతపై పడి బలంగా ముక్కును కొరికాడు. ముక్కు సగభాగం ఊడి పడిపోయింది.

తీవ్ర రక్తస్రావం అవుతుండటంతో కుటుంబ సభ్యులు, స్థానికులు మమతను చికిత్స నిమిత్తం అంబులెన్సులో చెన్నూర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మంచిర్యాలలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంఎంజీ ఆస్పత్రికి తరలించారు. మమత కుటుంబీకులు కోటపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.