Huzurabad: హుజూరాబాద్ రాజకీయాల్లో హీట్
- Subhan Ali Shaik
- Published On : June 16, 2021 / 02:47 PM IST
Huzurabad
Huzurabad: ఈటల రాజీనామా తర్వాత హుజూరాబాద్ లో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. రీసెంట్‌గా ఈటల బీజేపీలోకి చేరడంతో నియోజకవర్గమంతా.. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా పోటీ మొదలైంది. సత్తా చాటుకోవాలనే తపనలో ఈటల దంపతులు నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటించనున్నారు. ఈ మేరకు గురువారం ఉదయం 8 గంటలకే హుజూరాబాద్ కు చేరుకోనున్నారు ఈటల రాజేందర్.
పర్యటనలో భాగంగా కమలాపూర్ మండలంలోని శనిగరం, గోపాలాపూర్ గ్రామాలలో ప్రజలను ఈటల రాజేందర్ సతీమణి జమున కలుసుకుంటారు. ఈటల రాజేందర్ జమ్మికుంట మండల వాసులను కలుసుకుంటారు.
Read:ED Summons-MP Nama : ఎంపీ నామాకు ఈడీ సమన్లు.. 25న విచారణకు హాజరుకావాలి..
మరోవైపు హుజూరాబాద్‌లోని మంత్రులు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్‌లు బిజీగా మారిపోయారు. ఇప్పటికే కొద్దీ రోజుల నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నాయకులు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈటల దంపతుల పర్యటన మొదలుకానున్న గురువారమే మంత్రి హరీష్ రావు కూడా పర్యటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
