Rangam Bhavishyavani: ఉజ్జయిని మహంకాళి ‘రంగం’ భవిష్యవాణి.. భారీ వర్షాలు, ప్రాణనష్టం.. భక్తులకు మాతంగి హెచ్చరిక
సికింద్రాబాద్ లష్కర్ బోనాల ఉత్సవాల్లో స్వర్ణలత అమ్మవారి ఆవేశంతో రాబోయే రోజుల్లో జరగబోయే పరిణామాల (Rangam Bhavishyavani)గురించి హెచ్చరికలు జారీ చేశారు.
Secunderabad bonalu rangam bhavishyavani matangi swarnalatha warnings
- కుంభవృష్టితో తీవ్ర ప్రాణ నష్టం
- అగ్నిప్రమాదాలు నేరాలు పెరిగే అవకాశం
- అమ్మవారి పూజలు సరిగా చేయాలి
అగ్ని ప్రమాదాలు & వరద ముప్పుపై హెచ్చరికలు:
భవిష్యవాణిలో స్వర్ణలత పలు తీవ్రమైన అంశాలను ప్రస్తావించారు. దేశంలో, రాష్ట్రంలో భారీగా అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటాయని హెచ్చరించారు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో కుంభవృష్టి కురుస్తుందని, ఆ భారీ వర్షాల ధాటికి జనం కొట్టుకుపోయే పరిస్థితులు ఏర్పడి, తీవ్రమైన ప్రాణనష్టం జరుగుతుందని స్పష్టం చేశారు. అలాగే మానవ సంబంధాలు క్షీణించి, వావివరుసలు లేకుండా జనాలు తలకెక్కి నేరాలు, ఘోరాలకు పాల్పడతారని, పిల్లలకు అహంకారం ఎక్కువైపోతుంది
తల్లిదండ్రులు ఊరిమీదకు వదిలేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అమ్మవారి ఆగ్రహం & భక్తులకు సందేశం:
తనకు చేయాల్సిన పూజా కార్యక్రమాలు, నైవేద్యాలు సరిగా నిర్వహించాలని స్వర్ణలత చెప్పారు. “నాకు చేయాల్సినవి చేయాలి, చేయనన్న వాడిని తీసుకెళ్తాను” అని హెచ్చరించారు. భక్తులు సమర్పించే సమర్పణలతో తాను సంతృప్తిగా లేనప్పటికీ, వారు ఏం చేసినా ఓర్పుతో సరిపెట్టుకుంటున్నానని, అయితే నా ఆగ్రహానికి గురికాకుండా పద్ధతిగా పూజలు నిర్వహించాలని హెచ్చరిస్తూ భవిష్యవాణిని ముగించారు.
