Hyderabad : హీరో షోరూమ్ యజమాని కిడ్నాప్ యత్నం .. కారులోంచి దూకేసి తప్పించుకున్న సాయి కిరణ్
- nagamani
- Published on- December 30, 2022 / 11:32 AM IST
Hero Showroom owner Sai Kiran kidnap failed rajendranagar
Hyderabad : రాజేంద్రనగర్ లో ఓ వ్యాపారిని కిడ్నాప్ చేశారు కొంతమంది దుండగులు. మత్తుమందు ఇచ్చి కారులో తరలిస్తుండగా సదరు వ్యాపారి అప్రమత్తమై కారులోంచి దూకేసి కిడ్నాపర్లనుంచి తప్పించుకున్న ఘటన రాజేంద్రనగర్ ప్రాంతంలో కలకలం రేపింది.
హీరో షోరూమ్ యజమాని సాయి కిరణ్ కిస్మత్ పూర్ కు కారులో వెళుతుండగా ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ కు యత్నించారు. సాయి కిరణ్ కారు కిస్మత్ పూర్ బ్రిడ్జ్ దాటాక కారు డ్రైవర్ వాష్ రూమ్ కోసం కారు ఆపాడు. అదే సమయంలో ఒక్కసారిగా ముగ్గురు దుండగులు కారులోకి చొరబడ్డారు. వెంటనే సాయి కిరణ్ కు మత్తుమందు ఇచ్చి మాస్క్ పెట్టి కిడ్నాప్ చేయటానికి యత్నించారు. కానీ సాయి కిరణ్ వెంటనే అప్రమత్తమయ్యారు. ఏదో ప్రమాదం జరుగుతోంది తనను ఎవరో కిడ్నాప్ చేయటానికి యత్నిస్తున్నారని గుర్తించారు. అంతే కారులోంచి దూకేశారు.
కారులోంచి దూకేసి 100కు కాల్ చేసి విషయం చెప్పారు.దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై కిడ్నాపర్లు ఎటు వెళ్లారు? అని ఆరా తీయగా శంషాబాద్ వైపు వెళ్లారని సాయి కిరణ్ చెప్పటంతో శంషాబాద్ SOT పోలీసులు కిడ్నాపర్లను పట్టుకున్నారు. అలా కిడ్నాపర్ల నుంచి వ్యాపారవేత్త సాయి కిరణ్ తప్పించుకున్నారు. కిడ్నాపర్లను విచారణ చేసి గతంలో పాత కక్షలేమన్నా ఉన్నాయా? లేదా డబ్బుల కోసం కిడ్నాప్ యత్నం చేశారా? అనే పలు కోణాల్లో పోలీసులు విచారించనున్నారు.
