Adulterated Paneer: హైదరాబాద్‌లో కల్తీ పన్నీర్ కలకలం.. ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరుపు దాడులు.. 825 కిలోల నకిలీ పన్నీర్ స్వాధీనం

హైదరాబాద్‌లో కల్తీ పన్నీర్ విక్రయాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు జరిపిన ఆకస్మిక తనిఖీల్లో సుమారు 825 కిలోల అనుమానాస్పద పన్నీర్(Adulterated Paneer)ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

hyderabad food safety raids on adulterated paneer units (1)

  • హైదరాబాద్‌లో కల్తీ పన్నీర్ దాడులు.
  • ఎనిమిది వందల కిలోల స్వాధీనం.
  • నకిలీ తయారీ కేంద్రాలు గుర్తింపు.

Adulterated Paneer: హైదరాబాద్‌లో కల్తీ పన్నీర్ విక్రయాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉక్కుపాదం మోపారు. నగరవ్యాప్తంగా 45 ఫుడ్ అవుట్‌లెట్లు, 8 తయారీ యూనిట్లలో జరిపిన ఆకస్మిక తనిఖీల్లో సుమారు 825 కిలోల అనుమానాస్పద పన్నీర్(Adulterated Paneer)ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చీజ్ అనలాగ్‌ను అసలైన పనీర్‌గా మారుస్తూ, ఎలాంటి సరైన వివరాలు లేకుండా మార్కెట్లో విక్రయిస్తున్న ముఠాల బండారాన్ని అధికారులు బట్టబయలు చేశారు.

School Buses: తెలంగాణలో స్కూల్ బస్సుల స్పెషల్ డ్రైవ్.. 40 బస్సులు సీజ్.. 165 వాహనాలపై కేసులు

వినియోగదారులను ఆకర్షించడానికి “లో ఫ్యాట్”, “ఫ్రెష్ పన్నీర్” వంటి నకిలీ పేర్లతో ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (FSSAI) లైసెన్స్ లేకుండా నడుస్తున్న ఈ యూనిట్లలో స్టార్చ్, నాన్-మిల్క్ ఫ్యాట్స్, సింథటిక్ పాలు మరియు నాసిరకం పదార్థాలు కలిపి కృత్రిమంగా పన్నీర్ తయారు చేస్తున్నట్లు తేలింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.