hyderabad: బంజారాహిల్స్ భూ కబ్జా కేసు.. నిందితుల కోసం గాలింపు
ఇటీవల సంచలనం సృష్టించిన హైదరాబాద్, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10 ల్యాండ్ కబ్జా కేసులో పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
- Narender Thiru
- Published On : April 22, 2022 / 08:21 PM IST
Hyderabad2
hyderabad: ఇటీవల సంచలనం సృష్టించిన హైదరాబాద్, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10 ల్యాండ్ కబ్జా కేసులో పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కేసులో ఏ1గా ఉన్న విశ్వప్రసాద్‌తో పాటు మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. అమెరికాలో ఉన్న విశ్వప్రసాద్‌ను హైదరాబాద్ తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం అమెరికా దౌత్య కార్యాలయంలో లేఖ ఇవ్వాలని పోలీసులు భావిస్తున్నారు.
Banjarahills Police : బంజారాహిల్స్ పీఎస్‌కు కొత్త సీఐ.. ఈయన ఎవరు ?
కేసులో ఏ5గా ఉన్న రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్‌ను అరెస్ట్ చేసే అంశంపై పోలీసులు న్యాయ సలహా కొరనున్నారు. ముందుగా రాజ్యసభ వైస్ చైర్మన్‌కు సమాచారం ఇవ్వాలా? లేక అదుపులోకి తీసుకున్న తర్వాత సమాచారం ఇవ్వాలా? అనే అంశంపై మల్లగుల్లాలు పడుతున్నారు. కేసులో ప్రధాన నిందితుల వాంగ్మూలం ఆధారంగానే టీజీ వెంకటేష్ పేరు ఏ5గా చేర్చినట్లు పోలీసులు చేశారు. సినిమా షూటింగ్ అని చెప్పి, కబ్జా కోసం యత్నించినట్లు స్పష్టమైన ఆధారాలు సేకరించామని చెప్పారు పోలీసులు.
