Gold Man Surya Bhai: నకిలీ కాదు ఒరిజినలే..! అంతా ప్లాన్ ప్రకారమే..! రోల్డ్ గోల్డ్ వివాదంపై స్పందించిన సూర్యాభాయ్

కోట్లలో బ్లాక్ మనీ, అవినీతి చేసే వ్యక్తులను కాకుండా నన్ను టార్గెట్ చేయడం ప్లాన్ లో భాగమే అని ఆరోపించారు.

  • Published On : March 30, 2026 / 04:57 PM IST

Gold Man Surya Bhai: హైదరాబాద్ ఓల్డ్ సిటీ నివాసి, గోల్డ్ మ్యాన్ గా గుర్తింపు పొందిన సూర్యాభాయ్ 10టీవీతో మాట్లాడారు. తన ఒంటి మీదున్న బంగారు ఆభరణాలు నకిలీ అని వస్తున్న వార్తలపై సూర్యాభాయ్ తీవ్రంగా స్పందించారు. తన ఒంటి మీద ఉన్నవన్నీ అసలైన బంగారు ఆభరణాలే అని తేల్చి చెప్పారు. నకిలీ ఆభరణాలు అనడం దుష్ప్రచారం మాత్రమే అని వ్యాఖ్యానించారు. తాను కష్టపడి పైకి వచ్చిన వ్యక్తిని అని, అందుకే తనను అణగదొక్కాలని చూస్తున్నారని వాపోయారు. తనకు సంబంధం లేని విషయాలు యాడ్ చేసి సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు కావాలనే సోషల్ మీడియాలో డబ్బులిచ్చి అసత్య ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు.

ఐటీ అధికారుల విచారణ జరుగుతోంది.. ఐటీ అధికారులు నిజం నిగ్గు తేల్చుకుండానే కొందరు నాపై దుష్ప్రచారం చేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఐటీ అధికారులు ఇంటికి వచ్చారు, నా మొబైల్ డేటా తీసుకున్నారు, ఐటీ అధికారులు విచారణకు రమ్మని పిలిస్తే సహకరిస్తాను అని సూర్యాభాయ్ చెప్పారు. కోట్లలో బ్లాక్ మనీ, అవినీతి చేసే వ్యక్తులను కాకుండా నన్ను టార్గెట్ చేయడం ప్లాన్ లో భాగమే అని ఆరోపించారు. నేను సినిమాలు, సీరియల్స్ చేస్తూ రియల్ ఎస్టేట్ చేస్తున్నా.. అలా వచ్చే ఆదాయంతో సేవా కార్యక్రమాలు చేస్తున్నా అని తెలిపారు. తనపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చట్టప్రకారం ముందుకు వెళ్తానని సూర్యాభాయ్ హెచ్చరించారు.

సూర్యా భాయ్ అసలు పేరు పల్లపు సురేశ్ కుమార్. గోల్డ్‌ మ్యాన్‌గా సోషల్ మీడియాలో పాపులర్ అయ్యారు. ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సమయంలో ఆయన ఒంటిపై కేజీల కొద్దీ బంగారం ఉండటంతో భక్తులు ఆయనతో ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు.

కాగా, ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఇటీవల పట్టుబడిన మరో గోల్డ్‌ మ్యాన్ కొండా విజయ్ కుమార్ ఇచ్చిన సమాచారంతో సూర్యాభాయ్‌ గురించి ఐటీ అధికారులకు తెలిసింది. విజయ్‌కుమార్ ఫోన్‌లోని డేటా ఆధారంగా సూర్యా భాయ్‌ను విచారించిన ఐటీ అధికారులు.. ఆయన ధరించిన బంగారు ఆభరణాలను పరీక్షించారు. అవి ఒరిజినల్ కాదు రోల్డ్ గోల్డ్ అని తేల్చారని, కేవలం రాగిపై బంగారు పూత పూసినవని, వాటి మొత్తం విలువ 3 లక్షల రూపాయల లోపే ఉంటుందని కూడా ఐటీ అధికారులు నిర్ధారించారని వార్తలు వస్తున్నాయి.

Also Read: శకుని లేకపోతే కృష్ణుడు లేడు! కేసీఆర్‌ లేకపోతే నేను లేను..! సీఎం రేవంత్‌ కీలక వ్యాఖ్యలు