Ranga reddy Tragedy: తెలంగాణను వణికించిన దారుణం.. ఫోక్సో కేసు కక్షతో.. ఆరుగురిని నరికేశాడు!
రంగారెడ్డి జిల్లా(Ranga reddy Tragedy) షాబాద్ మండలంలో నరరూప రాక్షసుడిలా మారిన ఒక వ్యక్తి సృష్టించిన నరమేధం తెలుగు రాష్ట్రాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
- V Santhosh Kumar
- Updated on- July 11, 2026 / 08:22 AM IST
hyderabad POCSo case six people brutally murdered in ranga reddy district
- ఒకే కుటుంబంలో ఆరుగురి హత్య
- మైనర్ బాలికపై ఘోర హత్యాచారం
- నిందితుడి కోసం పోలీసుల గాలింపు
Ranga reddy Tragedy: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో నరరూప రాక్షసుడిలా మారిన ఒక వ్యక్తి సృష్టించిన నరమేధం తెలుగు రాష్ట్రాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. దైవాలగూడ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని రాజ్ కుమార్ అనే వ్యక్తి అత్యంత కిరాతకంగా కత్తితో పొడిచి హత్య చేశాడు. నిందితుడు అర్ధరాత్రి వేళ ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. చంపబడిన వారిలో నిందితుడి భార్య, ఇద్దరు చిన్నారులతో పాటు మరో ముగ్గురు ఉన్నారు. ఈ ఘోరకలిని చూసి స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.
Harish Rao: ఒట్టేసి రుణమాఫీ అన్నవ్.. చేసినవా?.. సీఎంపై హరీష్ షాకింగ్ కామెంట్స్
పగతో రగిలిపోయి హత్యలు:
గతంలో నిందితుడు రాజ్ కుమార్ పై ఫోక్సో (POCSO) కేసు నమోదైంది. ఆ కక్షను మనసులో ఉంచుకుని, ఫోక్సో కేసు బాధితురాలైన 17 ఏళ్ల మైనర్ బాలికను ఇంట్లోంచి బలవంతంగా పొలం వద్దకు తీసుకెళ్లి, అక్కడ హత్యాచారం చేసి దారుణంగా చంపేశాడు. అంతటితో ఆగకుండా బాలిక తల్లి చిట్యాల లక్ష్మి (45), నానమ్మ చిట్యాల రుక్కమ్మ (65)లను సైతం మట్టుబెట్టాడు. అనంతరం తన సొంత భార్య పార్వతి సరిత (30), తన ఇద్దరు చిన్న పిల్లలైన పరీక్షిత్ (3), దైవిక్షిత్ (2)లను కూడా కత్తితో పొడిచి ప్రాణాలు తీశాడు.
పోలీసులకు ఫోన్ చేసి పరార్:
ఆరుగురిని కిరాతకంగా చంపిన తర్వాత, తాను కూడా చనిపోతున్నానంటూ నిందితుడు రాజ్ కుమార్ స్వయంగా పోలీసులకు సమాచారం ఇచ్చి అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న సైబరాబాద్ సిపి రమేష్ రెడ్డి, ఫ్యూచర్ సిటీ కమిషనర్ తరుణ్ జోషి ఘటనా(Ranga reddy Tragedy) స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.
