YouTuber Anvesh: యూట్యూబర్‌ అన్వేష్‌పై లుకౌట్‌ నోటీసులు జారీ

అన్వేష్‌ విశాఖకు చెందిన వ్యక్తి. అతడు విదేశాల్లో ఉంటూ యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వహిస్తున్నాడు.

YouTuber Anvesh

  • సోషల్‌ మీడియాలో అన్వేష్ వివాదాస్పద వ్యాఖ్యలు
  • హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా కామెంట్స్‌
  • సినీనటి కరాటే కల్యాణి ఫిర్యాదుతో చర్యలు

YouTuber Anvesh: యూట్యూబర్‌ అన్వేష్‌పై హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులు లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు. కొన్ని నెలల క్రితం సోషల్‌ మీడియాలో అతడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని సినీనటి కరాటే కల్యాణి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు.

Also Read: దుర్మార్గుడు కాలితో తంతే ఆ పాప చనిపోయింది.. అలాంటి దుర్మార్గులను..: కేటీఆర్ ఫైర్

కాగా, తనకు 2 ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్లు, 2 యూట్యూబ్‌ ఛానల్స్‌ ఉన్నాయంటూ ఇటీవల అన్వేష్ వీడియో విడుదల చేశాడు. ఇన్‌స్ట్రాగ్రామ్‌, యూట్యూబ్‌కు పోలీసులు లేఖ రాయనున్నారు.

అన్వేష్‌ విశాఖకు చెందిన వ్యక్తి. అతడు విదేశాల్లో ఉంటూ యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వహిస్తున్నాడు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా అన్వేష్ వ్యాఖ్యలు చేస్తున్నాడని అతడి సోషల్ మీడియా అకౌంట్లకు నెటిజన్లు రిపోర్టులు కొడుతున్నారు. ఇటీవల ఫాలోవర్ల సంఖ్య భారీగా తగ్గిపోయింది.