Hyd Techie Sitharam Suicide : సీతారాం కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్.. భర్త ఆత్మహత్య చేసుకున్న నెల రోజుల్లోపే ప్రియుడితో

Hyd Techie Sitharam Suicide : టెకీ సీతారాం ఆత్మహత్య కేసులో మైండ్ బ్లాంక్ అయ్యే ట్విస్ట్ రివీల్ అయ్యింది. అతడు చనిపోయిన నెలకే భార్య రేణుక..

hyderabad techi sitharam suicide case his wife married her lover within a month

  • సీతారాం కేసులో షాకింగ్ ట్విస్ట్
  • భర్త చనిపోయిన నెలలోపే
  • ప్రియుడిని పెళ్లాడిన సీతారాం భార్య

Hyd Techie Sitharam Suicide : సీతారాం ఆత్మహత్య కేసు సంచలనంగా మారింది. భార్య వివాహేతర సంబంధాల గురించి పచ్చి నిజాలు తెలుసుకున్న సీతారాం.. అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. అతడు రాసిన 19 పేజీల సూసైడ్ లెటర్‌లో తన భార్య బూతు పురాణం గురించి సంచలన విషయాలు వెల్లడించాడు. తన భార్య రేణుకకు పెళ్లికి ముందే 6 ప్రేమ కథలు ఉన్నాయని.. తనతో వివాహం జరిగాక.. ముగ్గురితో వివాహేతర సంబంధాలు పెట్టుకుందని తెలిపాడు.

పైగా అఫైర్ పెట్టుకున్న వ్యక్తులతో సన్నిహితంగా ఉన్నప్పుడు వీడియోలు తీసి.. వాటిని తన ప్రియుడికి పంపేదని.. వాటిని అతడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని సీతారాం తెలిపాడు. ఈ క్రమంలో ఈ కేసులో తాజాగా దిమ్మతిరిగే ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. భార్య బాగోతం భరించలేని సీతారాం ఆత్మహత్య చేసుకుని చనిపోగా.. అతడి భార్య రేణుక మాత్రం నెల తిరగకముందే తన ప్రియుడిని వివాహం చేసుకుంది.

సీతారాం ఆత్మహత్య చేసుకున్న నెల రోజుల్లోపే రేణుక తన ప్రియుడు రమణారెడ్డిని వివాహం చేసుకోవడం గమనార్హం. ప్రస్తుతం పోలీసులు వీరిద్దరినీ అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే సీతారాం, రేణుక దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అటు తండ్రి ఆత్మహత్య చేసుకోవడం.. ఇటు తల్లి జైలు పాలు కావడంతో పాపం ఆ పసివాళ్లు అనాథలయ్యారు. ఇదిలా ఉంటే తన కొడుకు కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సీతారాం తండ్రి ఆరోపిస్తున్నాడు.