Hyderabad Water Supply: పండుగ వేళ హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఈ ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిపివేత.. కారణమిదే!

పండుగ వేళ హైదరాబాద్ మహానగర వాసులకు జలమండలి (Hyderabad Water Supply)ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది.

Hyderabad water supply disrupted in several areas krishna phase 2 pipeline damage nagole

Hyderabad Water Supply: పండుగ వేళ హైదరాబాద్ మహానగర వాసులకు జలమండలి ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది. నగరానికి తాగునీటిని(Hyderabad Water Supply) అందించే కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ ఫేజ్‌-2 పైప్‌లైన్ నాగోల్ మెట్రో స్టేషన్ పిల్లర్ నంబర్ 813 వద్ద ప్రమాదవశాత్తు దెబ్బతింది. ఓ కారు వేగంగా వచ్చి పైప్‌లైన్‌కు చెందిన ఎయిర్ వాల్వ్ వ్యవస్థను ఢీకొట్టడంతో తీవ్రస్థాయిలో నీటి లీకేజీ ఏర్పడింది. ఈ అకస్మాత్తు ప్రమాదం వల్ల ఎయిర్ వాల్వ్‌లకు అత్యవసర మరమ్మతులు చేపట్టాల్సి రావడంతో, నగరం పరిధిలోని పలు ప్రధాన ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడుతుందని అధికారులు వెల్లడించారు.

AB Venkateswara Rao: ఇది రాజకీయ సమరమే.. మా మధ్య చిచ్చుపెట్టేందుకు కుట్ర.. వంగవీటి రాధాపై ఏబీవీ హాట్ కామెంట్స్!

ప్రభావిత ప్రాంతాలివే.. ఉప్పల్ నుంచి సికింద్రాబాద్ వరకు అంతరాయం:

ఈ అత్యవసర మరమ్మతు పనుల కారణంగా బిఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, ఆటోనగర్, రామంతాపూర్, ఉప్పల్, బేగంపేట, ప్రకాశ్ నగర్, పద్మారావునగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, లాలాగూడ, మెట్టుగూడ, మీర్‌పేట, బడంగ్‌పేట మరియు బాలాపూర్ తదితర ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోనుంది. ఉమ్మడి సమన్వయంతో పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసి నీటి సరఫరాను పునరుద్ధరించాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా.. వినియోగదారులకు జలమండలి విజ్ఞప్తి:

తాగునీటి కొరత తలెత్తిన ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయంగా ఉచిత వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని ఎండీ ఆదేశాలు ఇచ్చారు. మరమ్మతు ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రభావిత ప్రాంతాల ప్రజలు అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవాలని, జలమండలి సిబ్బందికి సహకరించాలని బోర్డు అధికారులు కోరారు.