Hyderabad Water Supply : హైదరాబాద్‌ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో 36గంటలు తాగునీటి సరఫరాకు బంద్..

Hyderabad Water Supply : హైదరాబాద్ నగరవాసులకు అలర్ట్. నగరంలోని పలు ప్రాంతాల్లో 36గంటల పాటు తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది.

Hyderabad Water Supply

Hyderabad Water Supply : హైదరాబాద్ నగరవాసులకు అలర్ట్. నగరంలోని పలు ప్రాంతాల్లో 36గంటల పాటు తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లయ్ ప్రాజెక్టు (KDWS P) ఫేజ్-2లో చేపట్టనున్న మరమ్మతు పనుల కారణంగా నీటి సరఫరాపై ప్రభావం పడనుంది.

Also Read : TGPSC Jobs Notification : తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం.. నిరుద్యోగులకు శుభవార్త.. ఆ శాఖలో 886 పోస్టుల భర్తీకి చర్యలు..

నాసర్లపల్లి నుంచి గోడకొండ్ల వరకు ఉన్న 2375 ఎంఎం డయా ఎంఎస్ పంపింగ్ మెయిన్ పై హైదరాబాద్ వాటర్ బోర్డు మరమ్మతు పనులు చేపట్టనుంది. దెబ్బతిన్న ఎంఎస్ ఎయిర్ వాల్వులు, ఇతర వాల్వులను మార్చడంతో పాటు స్కవర్ పైప్‌లైన్‌లో ఏర్పడిన లీకేజీని సరిచేయనున్నారు.

ఈ పనులు అక్టోబర్ 5 ఉదయం 6 గంటల నుంచి అక్టోబర్ 6 సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్నాయి. ఈ సమయంలో కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా నీటి సరఫరా నిలిచిపోవడంతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో లో ప్రెషర్‌తో నీరు వచ్చే అవకాశం ఉందని వాటర్ బోర్డు అధికారులు తెలిపారు.

ఈ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం..
ఆదిభట్ల, కమ్మగూడ, గుర్రంగూడ, బీఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, ఆటోనగర్, అల్కాపురి, బీరప్పగడ్డ, హబ్సిగూడ, రామంతాపూర్, వెంకట్ రెడ్డి నగర్, ఉప్పల్, నాచారం, హెచ్ఎంటీ నగర్, తార్నాక, బౌద్ధనగర్, లాలాపేట్, హస్మత్‌పేట్, ప్రకాశ్‌నగర్, మేకలమండి, భోలక్‌పూర్, పద్మారావునగర్, బేగంపేట్ ప్రాంతాల్లో నీటి సరఫరాపై ప్రభావం పడనుంది. అలాగే సౌత్ సెంట్రల్ రైల్వే, ఎంఈఎస్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, లాలాగూడ, అడ్డగుట్ట, పట్టిగడ్డ, నల్లగుట్ట, గౌతమ్‌నగర్, ఫిరోజ్‌గూడ, బన్సీలాల్‌పేట్, రాంగోపాల్‌పేట్, సీతాఫల్‌మండి, మెట్టుగూడ, వైశాలీనగర్ ప్రాంతాల్లోనూ నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. ఇక మీర్‌పేట్, బడంగ్‌పేట్, ఏఆర్‌సీఐ, బాలాపూర్, మైసారం, బార్కాస్, ఎన్‌పీఏ, శంషాబాద్, మధుబన్, ప్రశాసన్ నగర్ తదితర ప్రాంతాలపైనా ఈ మరమ్మతు పనుల ప్రభావం ఉండనుంది.

మరమ్మతు పనులు పూర్తయిన తర్వాత నీటి సరఫరాను సాధారణ స్థితికి తీసుకురావడానికి చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు. నగరవాసులు ముందుగానే అవసరమైన తాగునీటిని నిల్వ చేసుకోవాలని, సహకరించాలని కోరారు.