Hydraa Demolition: అమీన్‌పూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్.. 6 అంతస్తుల భవనం కూల్చివేత

ఐలాపురం తండాతో పాటు గ్రామంలోని పేదల ఇళ్ల జోలికి వెళ్లకుండా ఖాళీ స్థలాలను హైడ్రా స్వాధీనం చేసుకుంది.

  • Updated on- April 12, 2026 / 12:38 PM IST

Ameenpur Hydraa Demolition Operation

Ameenpur Hydraa: సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. భారీగా పోలీస్ బందోబస్తు మధ్య ఆక్రమణలను నేలమట్టం చేసింది. వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా కోరల నుంచి కాపాడింది. ప్రభుత్వ స్థలాల్లో అక్రమ భవనాలు నిర్మించినట్లుగా గుర్తించిన హైడ్రా వాటిని తొలగించింది. రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి ఈ భారీ ఆపరేషన్ చేపట్టింది హైడ్రా. కోర్టు స్టే ఆర్డర్ ఉన్నా నిర్మాణాలు జరిపిన ఓ గెస్ట్ హౌస్ తో పాటు 6 అంతస్తుల భవనాన్ని హైడ్రా కూల్చి వేసింది. ఐలాపురం తండాతో పాటు గ్రామంలోని పేదల ఇళ్ల జోలికి వెళ్లకుండా ఖాళీ స్థలాలను హైడ్రా స్వాధీనం చేసుకుంది. హైడ్రా చర్యల పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండలం ఐలాపురం గ్రామంలో మొత్తం 1263 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో ఇప్పటికే చాలా నివాసాలు వెలిశాయి. ఆ నివాసాల జోలికి వెళ్లకుండా మిగిలి ఉన్న 860 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడేందుకు చర్యలు చేపట్టింది హైడ్రా. 863 ఎకరాల భూమి విలువ 15వేల కోట్లకుపైగా ఉంటుందని అంచనా. ఇక్కడ యధాతధ స్థితిని కొనసాగించాలని 1998 నుంచి కోర్టు ఆర్డర్లు ఉన్నా పట్టించుకోకుండా నిర్మించిన గెస్ట్ హౌస్ ను హైడ్రా తొలగించింది. అలాగే ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన 6 అంతస్తుల భవనాన్ని కూడా తొలగించింది.

Also Read: ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. వాట్సాప్‌లోనూ ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి..