Traffic Diversion In Uppal : నేడు భారత్ – వెస్టిండీస్ మ్యాచ్.. ఉప్పల్‌ ప్రాంతంలో ట్రాఫిక్‌ ఆంక్షలు ఇలా..

Traffic Diversion In Uppal : ఇండియా వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య నాల్గో టీ20 మ్యాచ్ ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ సందర్భంగా ఉప్పల్ ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

India vs West Indies Traffic restrictions

Traffic Diversion In Uppal : ఇండియా వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య ఐదు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా నాలుగో టీ20 మ్యాచ్ బుధవారం రాత్రి 7గంటల నుంచి ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ కోసం సుమారు 2200 మంది సిబ్బందితో పోలీస్ శాఖ భద్రత ఏర్పాట్లు చేసింది. అదేవిధంగా ఉప్పల్ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. భారీ వాహనాలుసైతం దారి మళ్లించనున్నారు.

Also Read : Post Metric Scholarship: విద్యార్థులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. రూ.204.40 కోట్ల స్కాలర్‌షిప్‌ నిధులు విడుదల.. డైరెక్ట్ అకౌంట్స్ లోకి!

ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..
♦ మ్యాచ్ ను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు తరలివచ్చే అవకాశం ఉండడంతో ఉప్పల్ ట్రాఫిక్ పీఎస్ పరిధిలో ప్రజలకు అసౌకర్యం కలగకుండా వాహనాల మళ్లింపు చేపట్టారు.
♦ మ్యాచ్ నేపథ్యంలో నాగోల్‌ యూటర్న్‌, మెహఫిల్‌ జంక్షన్‌, హబ్సిగూడ జంక్షన్‌, రామంతాపూర్‌ స్ట్రీట్‌ నంబర్‌ 8 ప్రాంతాల్లో భారీ వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించనున్నారు.
♦ మూసారాంబాగ్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్‌ వైపు వెళ్లే వాహనదారులు ట్రాఫిక్ పోలీసుల సూచనలను పాటించాలని అధికారులు కోరారు.
♦ అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్సులు, అగ్నిమాపక వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా కీలక కూడళ్ల వద్ద ట్రాఫిక్‌ను తాత్కాలికంగా నిలిపివేసే అవకాశం ఉంది
♦ భారీ వాహనాలకు మధ్యాహ్నం 12గంటల నుంచి రాత్రి 11.50 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపు ఉంటుంది.
♦ ఘట్‌కేసర్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే భారీ వాహనాలు, మెహ్‌ఫిల్ హోటల్ సమీపంలోని హెచ్ఎండీఎ ఉప్పల్ భగాయత్ ప్రవేశ ద్వారం నుంచి నాగోల్ బ్రిడ్జి మీదుగా ఎల్బీనగర్ వైపు వెళ్లాలి.
♦ ఎల్బీనగర్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే వాహనాలు నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద యూటర్న్ నుంచి నాగోల్ యూటర్న్ హెచ్ఎండీఏ భగాయత్, టయోటా యూటర్న్, బోడుప్పల్, చెంగిచెర్ల మీదుగా ఐవోసీ చర్లపల్లి లేదంటే ఘట్ కేసర్ వైపు మళ్లించారు.
♦ తార్నాక నుంచి ఉప్పల్ వైపు వచ్చే భారీ వాహనాలు హబ్సిగూడ ఎక్స్ రోడ్డు నుంచి నాచారం, ఎన్ఎఫ్‌సీ రోటరీ ఐవోసీ చర్లపల్లి ఘట్ కేసర్ మార్గంలో వెళ్లాలి.
♦ రామంతాపూర్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే భారీ వాహనాలు హబ్సిగూడ స్ట్రీట్ నెం. 8 నుంచి హబ్సిగూడ ఎక్స్ రోడ్స్ నాచారం ఎన్ఎఫ్‌సీ రోటరీ ఐవోసీ చర్లపల్లి ఘట్ కేసర్ మార్గంలో మళ్లించారు.
♦ వరంగల్ నుంచి ఉప్పల్ మీదుగా హైదరాబాద్ వైపు వచ్చే వారు ఘట్ కేసర్ వద్ద ఔటర్ రింగ్ రోడ్ ఎక్కి, అబ్దుల్లాపూర్‌మెట్ ఎల్బీనగర్, దిలుసుఖ్ నగర్ మార్గంలో హైదరాబాద్ వెళ్లాల్సి ఉంటుంది.
♦ హైదరాబాద్ నుంచి ఉప్పల్ మీదుగా వరంగల్ వైపు వెళ్లే వాహనాలు ఎల్బీనగర్, హయత్ నగర్ మీదుగా అబ్దుల్లాపూర్మెట్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డు ఎక్కి వరంగల్ వైపు పోవాలి.

వాహనాల పార్కింగ్‌ ఇలా..
♦ మ్యాచ్‌ను చూసేందుకు వచ్చే ప్రేక్షకుల వాహనాల కోసం సుమారు 8 వేల వాహనాలు నిలిపేలా పార్కింగ్ స్థలాలను గుర్తించారు. ఇందులో 4,600 కార్లు, 3,400 ద్విచక్ర వాహనాలకు స్థలం కేటాయించారు. స్టేడియం లోపల పార్కింగ్‌కు వీవీఐపీలు, వీఐపీలు, అధికారిక అనుమతి పాసులు ఉన్నవారికి మాత్రమే అవకాశం ఉంటుంది. మిగతా ప్రేక్షకులు పోలీసులు సూచించిన పార్కింగ్ ప్రాంతాల్లోనే వాహనాలను నిలపాలి
♦ డీఎస్ఎల్ మాల్ పక్కన జైన్‌ ప్రాపర్టీస్ ఖాళీ స్థలం, మోడరన్‌ బేకరీ, అగర్వాల్‌ ప్రాపర్టీస్‌ (ఉప్పల్‌-రామంతాపూర్‌ మార్గం), టీజీ ఐలా (ఉప్పల్‌-హబ్సిగూడ మార్గం)లో పాక్కింగ్ చేయాల్సి ఉంటుంది.
♦ ఎన్‌జీఆర్‌ఐ, స్టేడియం మెట్రో రైలు స్టేషన్ల సమీపంలోని నిర్దేశిత ప్రాంతాలు పార్కింగ్ చేయాల్సి ఉంటుంది.
♦ జెన్‌పాక్ట్‌ టీ జంక్షన్, హిందూ కార్యాలయం సమీపంలో.. అదేవిధంగా ఉప్పల్‌ ఐడీఏ లేన్‌లో ఎల్జీ గోదాం, కెమ్వేద జంక్షన్‌ మధ్య.. డీఎస్‌ఎల్‌ మాల్, హబ్సిగూడ వీధి నం.8, రామంతాపూర్‌ పరిసరాల్లో పార్కింగ్ చేయాల్సి ఉంటుంది.
♦ ప్రతి పార్కింగ్ కు సంబంధిత సూచికలను పోలీసులు ఏర్పాట్లు చేశారు.