Land Litigation : మీరు కొనాలనుకునే ఫ్లాట్, పొలం.. లిటిగేషన్‌లో ఉన్నాయా? సింపుల్‌గా చెక్ చేసుకోండిలా..
Land Litigation : మీరు కొనాలనుకునే ప్లాట్ లేదంటే పొలం లిటిగేషన్లో ఉందోలేదో తెలుసుకోవచ్చు. తెలంగాణ రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ డిపార్ట్ మెంట్ వెబ్ సైట్ లోకి వెళ్లి చెక్ చేసుకుంటే సరిపోతుంది.
- Harish Thanniru
- Published on- June 5, 2026 / 01:54 PM IST
Land Registration
Land Litigation : రాష్ట్రంలో ఎక్కడైనా మీరు పొలం లేదంటే ప్లాట్ కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా.? అయితే, కాస్త అప్రమత్తంగా ఉంటే మంచిది. చాలా మంది పొలం లేదా ప్లాట్ కొనుగోలు చేసే సమయంలో సరియైన విధానాలు పాటించకపోవటంతో మోసపోతున్నారు. కొనుగోలు చేసిన పొలం లేదంటే ప్లాట్ లిటికేషన్లో ఉండటంతో భారీగా నష్టం పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి ఇబ్బందులు లేకుండా.. రిజిస్ట్రేషన్ చేయడానికి వీలులేని వ్యవసాయ భూములు, రిజిస్ట్రేషన్ చేయడానికి వీలులేని వ్యవసాయేతర భూములను గుర్తించి కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంది. ఇందుకోసం మీరు తెలంగాణ రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ డిపార్ట్ మెంట్ వెబ్ సైట్ లోకి వెళ్లి చెక్ చేసుకుంటే సదరు భూమి లేదంటే ప్లాట్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తున్నాయి.
Also Read : Land Value increased : భూముల రేట్లు డబుల్.. నేటి నుంచే అమల్లోకి.. ఎక్కడ ఎంత పెరిగిందంటే..?
ఇలా చెక్ చేసుకోండి..
♦ తెలంగాణ రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ డిపార్ట్ మెంట్ వెబ్ సైట్ https://registration.telangana.gov.in/ లోకి వెళ్లండి.
♦ అందులో Browse విభాగంలో Prohibited Property అనే దానిపై క్లిక్ చేయండి.
♦ మీరు చెక్ చేయాలనుకున్న ప్రాపర్టీ ఏ జిల్లాలో ఉందో దాన్ని సెలక్ట్ చేయండి
♦ ఏ మండలం పరిధిలోకి వస్తుందో ఆ మండలం పేరు ఎంపిక చేయండి
♦ ఏ గ్రామం/ పట్టణం పరిధిలోకి వస్తుందో ఎంచుకోండి
♦ ఆ తర్వాత Fetch అనేదానిపై క్లిక్ చేయండి
♦ ఆ తర్వాత మీకు రెండు రకాలైన వివరాలు కనిపిస్తాయి. రిజిస్ట్రేషన్ చేయడానికి వీలులేని వ్యవసాయ భూములు, రిజిస్ట్రేషన్ చేయడానికి వీలులేని వ్యవసాయేతర భూములు.
♦ కోర్టు కేసులు, దేవాదాయ భూములు, వక్ఫ్ భూములు సహా అందులో ఏడు రకాలైన ఫైల్స్ అందుబాటులో ఉంటాయి. వాటిలో మీరు చెక్ చేయాలనుకున్న ఫ్లాట్, ప్లాట్, వ్యవసాయ, వ్యవసాయేతర భూమి వివరాలు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి.
