Mla Sanjay Kumar: జీవన్ రెడ్డిని కాదని సంజయ్‌ని సీఎం రేవంత్ ఎందుకు నెట్టిన పెట్టుకున్నారు?
ముఖ్యమంత్రి, మంత్రులతో కలిసి పని చేస్తే నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోగలను అనే భావన నాది. ప్రజలకు సేవ చేయాలనే భావన, కార్యకర్తలను కాపాడుకోవాలనే ఆకాంక్ష..
- Naveen
- Updated on- April 26, 2026 / 09:29 PM IST
Mla Sanjay Kumar: 10టీవీ వీకెండ్ పాడ్ కాస్ట్ లో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొన్నారు. జీవన్ రెడ్డి వ్యవహారం సహా పలు కీలక అంశాలపై స్పందించారు. జీవన్ రెడ్డి కాంగ్రెస్ ను ఎందుకు వీడారు? కారణం ఏమై ఉండొచ్చు? అన్న ప్రశ్నకు ఆయన బదులిచ్చారు.
తనకు తెలిసినంత వరకు జీవన్ రెడ్డిని ఎక్కడా అగౌరవ పరచలేదని సంజయ్ అన్నారు. జీవన్ రెడ్డి గెలుపు కోసం మనస్ఫూర్తిగా పని చేశానని తెలిపారు. తన నియోజకవర్గంలో అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తాను కలిసింది వాస్తవమే అన్నారు. అయితే, సీఎంను కలిసిన తెల్లారే జీవన్ రెడ్డి పెద్ద గొడవ చేశారని వాపోయారు.
”జీవన్ రెడ్డిని అన్ని విధాలుగా గౌరవిస్తానని ముఖ్యమంత్రి రేవంత్ కూడా చెప్పారు. ఆ తర్వాత రకరకాల పరిణామాలు జరిగాయి. మా కుటంబానికి కాంగ్రెస్ తో అనుబంధం ఉంది. జీవన్ రెడ్డి కుటుంబంలో ఐదు పదవులు ఉన్నాయి. అయినా ఇంకా ఏదో తక్కువ జరిగిందని ఆయన అంటున్నారు. సంజయ్ ని రేవంత్ రెడ్డి నెత్తిన పెట్టుకోలేదు. కలిసి పని చేద్దామని అనుకున్నా. కానీ ఆయన అర్థం చేసుకోలేదు. 40 సంవత్సరాలు జీవన్ రెడ్డి వెంట ఉన్న వ్యక్తికే మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి వచ్చింది.
సంజయ్ వెంట ఉన్న వ్యక్తికి పదవి రాలేదు కదా. ఏదో ఒక నెపంతో ఎవరూ రావొద్దు, ఇక్కడ నేనే ఉండాలి అనుకోవడం కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి, మంత్రులతో కలిసి పని చేస్తే నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోగలను అనే భావన నాది. ప్రజలకు సేవ చేయాలనే భావన, కార్యకర్తలను కాపాడుకోవాలనే ఆకాంక్ష.. ముఖ్యమంత్రి రేవంత్ తో కలిసి పని చేయడానికి ఇవే ప్రధాన కారణాలు” అని ఎమ్మెల్యే సంజయ్ అన్నారు.
Also Read: రేవంత్ సర్కార్ శుభవార్త.. మహిళల కోసం మరో పథకం.. ఉచితంగా పంపిణీ
