Mla Sanjay Kumar: కవిత పార్టీ నిలబడుతుందా? ఆమె పార్టీ నుంచి ఆహ్వానం అందిందా? వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు?

రాజకీయాల్లోకి ఒకసారి వచ్చాక తప్పుకోవడం అనేది ఉండదు. పోటీ చేస్తామా చేయకపోవడమా అనేది పార్టీ డెసిషన్ ఉంటుంది.

  • Published on- April 26, 2026 / 10:02 PM IST

 

Mla Sanjay Kumar: 10టీవీ వీకెండ్ పాడ్ కాస్ట్ లో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొన్నారు. జీవన్ రెడ్డి వ్యవహారం సహా పలు కీలక అంశాలపై స్పందించారు. కవిత కొత్త పార్టీ టీఆర్ఎస్ పైనా ఆయన రియాక్ట్ అయ్యారు. కవిత పార్టీ నిలబడుతుందా? మీ అభిప్రాయం ఏంటి? మిమ్మల్ని రాజకీయాల్లోకి తెచ్చిందే కవితే. ఆమె పార్టీ నుంచి మీకు ఏమైనా ఆహ్వానం అందిందా? మీరు అటువైపు చూసే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

”నన్ను రాజకీయాల్లోకి తెచ్చిందే కవిత. కవిత అంటే గౌరవమే. ఎక్కడా నేను ఎవరి గురించి కూడా తప్పుగా మాట్లాడింది లేదు. కేటీఆర్ నన్ను చిన్నగా చేసి నా గురించి పదే పదే మాట్లాడారు. దాంతో ఒక్కసారి మాత్రమే నేను రియాక్ట్ అయ్యా. కవిత రాజకీయ పార్టీ పెట్టుకోవడం ఆమె కుటుంబ సమస్యనా? రాజకీయ సమస్యనా? అనేది ఆమె పరిధిలోనిది. ఆ స్థాయిలో నేను ఎప్పుడూ కూడా మాట్లాడలేదు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాను అనేదానిపై మీకు క్లారిటీ ఇస్తాను. నేనిప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీతో మొదటి నుంచి నాకు అనుబంధం ఉంది. మా ఇంట్లో ఎన్నో ఎన్నికలు జరిగాయి. వచ్చే ఎలక్షన్ లో మా ఇంటి నంచే రాజకీయం నడుస్తుంది. అది కాంగ్రెస్ పార్టీ జెండా కిందనే నడుస్తుంది.

రాజకీయాల్లోకి ఒకసారి వచ్చాక తప్పుకోవడం అనేది ఉండదు. పోటీ చేస్తామా చేయకపోవడమా అనేది పార్టీ డెసిషన్ ఉంటుంది. చేస్తే కాంగ్రెస్ నుంచే పోటీ చేస్తా. టీఆర్ఎస్, బీఆర్ఎస్ అనే ఆలోచనే లేదు” అని ఎమ్మెల్యే సంజయ్ తేల్చి చెప్పారు.

Also Read: జీవన్ రెడ్డిని కాదని సంజయ్‌ని సీఎం రేవంత్ ఎందుకు నెట్టిన పెట్టుకున్నారు?