Kavitha TRS Party : కవిత కొత్త పార్టీ టీఆర్ఎస్.. టీఆర్ఎస్ అంటే మీనింగ్ ఇదే.. జెండా గుర్తులు ఇవే.. దేనికి సూచిక అంటే..
Kavitha New Party : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పేరును ప్రకటించారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్ లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న కవిత..
- Harishth Thanniru
- Updated on- April 25, 2026 / 11:03 AM IST
kalvakuntla kavitha new party name TRS Telangana Rashtra Sena
Kavitha New Party : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పేరును ప్రకటించారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్ లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న కవిత.. భారీ జనసంద్రోహం మధ్య కొత్త పార్టీ పేరును టీఆర్ఎస్ గా ప్రకటించారు. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సేనగా కవిత ప్రకటించారు.
Also Read : Telangana politics : బీఆర్ఎస్ అధిష్టానానికి కవిత మాస్టర్ స్ట్రోక్.. ఇక వారి ప్రయత్నాలు విఫలమైనట్లేనా..?
పార్టీ పేరును ప్రకటించిన ఆమె ఆ వెంటనే జెండాను ఆవిష్కరించారు. ఆ సమయంలో కవిత అనుచరులు నినాదాలు చేశారు. సీఎం సీఎం అంటూ పెద్దెత్తున నినాదాలు చేశారు. కవిత కొత్త పార్టీ జెండాలో పసుపు, నీలం, ఆకుపచ్చ రంగులు ఉన్నాయి. జెండా మధ్యలో నీలి రంగులో తెలంగాణ మ్యాప్.. దాని మధ్యలో ఇంగ్లీష్ అక్షరాల్లో TRS పేరు ఉంది. జెండా కింది భాగంలో ఆకుపచ్చ రంగు ఉంది. దాని మధ్యలో తెలుగులో తెలంగాణ రాష్ట్ర సేన పేరు వైట్ కలర్‌లో ఉంది. మిగిలిన జెండా మొత్తం పసుపు రంగులో ఉంది. మొత్తానికి అనుకున్న విధంగా కవిత టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సేన) పేరును ప్రకటించడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.
