Chicken Prices Today : చికెన్ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన ధరలు.. కిలో ఎంతంటే?

Chicken Prices Today : కార్తీకమాసం ప్రభావంతో తెలంగాణలో చికెన్ ధరలు భారీగా తగ్గాయి. గత వారంతో పోలిస్తే.. కిలోపై రూ.50 నుంచి రూ.80 వరకు తగ్గింది. హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్‌లో చికెన్ ధరలు ఎలా ఉన్నాయంటే?

Chicken Prices Drop Sharply in Telangana

  • కార్తీకమాసం దెబ్బకు చికెన్ ధరలు డౌన్‌..
  • కిలోపై రూ.80 వరకు తగ్గింపు
  • తెలంగాణలో తగ్గిన చికెన్ ధరలు

Chicken Prices Today : కార్తీకమాసం ఎఫెక్ట్‌ చికెన్ మార్కెట్‌పై గట్టిగానే పడింది. గత వారం వరకు కొండెక్కిన చికెన్ ధరలు ఇప్పుడు ఒక్కసారిగా దిగొచ్చాయి. దీంతో చికెన్ ప్రియులకు కాస్త ఊరట లభిస్తోంది. ముఖ్యంగా ఆదివారం వచ్చిందంటే చికెన్ షాపుల దగ్గర సందడి కనిపించేది. కానీ, ఈసారి కార్తీకమాసం ప్రభావంతో మార్కెట్‌లో పరిస్థితి కొంత భిన్నంగా మారింది..

కార్తీకమాసం ప్రారంభం కావడంతో చాలామంది నాన్‌వెజ్‌కు దూరంగా ఉంటున్నారు. అయ్యప్ప మాలలు ధరించిన భక్తులు, శివ భక్తులు, కార్తీక వ్రతాలు ఆచరించే వారు ఈ నెలంతా మాంసాహారానికి దూరంగా ఉంటున్నారు. దీంతో చికెన్‌కు డిమాండ్ తగ్గిపోయింది. కొనేవాళ్లు తగ్గడంతో వ్యాపారులు కూడా ధరలను తగ్గించక తప్పని పరిస్థితి కనిపిస్తోంది..

ఏయే ప్రాంతాల్లో ఎంతంటే? :
గత వారం కిలో చికెన్ ధర రూ.300 దాటగా.. ఇప్పుడు పలు ప్రాంతాల్లో రూ.260 లోపునకు చేరింది. హైదరాబాద్‌లో కిలో స్కిన్‌లెస్ చికెన్ రూ.260 నుంచి రూ.270 వరకు పలుకుతోంది. వరంగల్‌లో రూ.250 నుంచి రూ.260 మధ్య ధరకు విక్రయిస్తున్నారు. కామారెడ్డిలో కిలో చికెన్ ధర సుమారు రూ.260గా ఉంది. నిజామాబాద్‌లో అయితే ప్రాంతాన్ని బట్టి రూ.200 నుంచి రూ.260 వరకు ధరలు కనిపిస్తున్నాయి.

Read Also : Jio Google AI Pro : జియో యూజర్లకు బిగ్ షాక్.. ప్రీపెయిడ్ ప్లాన్స్‌లో గూగుల్ ఏఐ ప్రో బంద్.. వారికి మాత్రమే..!

రూ. 80 వరకు తగ్గుదల :
అంటే.. గత వారంతో పోలిస్తే.. కిలో చికెన్‌పై దాదాపు రూ.50 నుంచి రూ.80 వరకు తగ్గుదల కనిపిస్తోంది. దీంతో ఇన్నాళ్లూ ధరలు చూసి వెనక్కి తగ్గిన చికెన్ ప్రియులు ఇప్పుడు కొనుగోళ్లకు ఆసక్తి చూపిస్తున్నారు..

అయితే, ఈ ధరల తగ్గుదల చికెన్ ప్రియులకు ఊరటనిస్తుంటే.. పౌల్ట్రీ రైతులు, వ్యాపారులకు మాత్రం ఇబ్బందిగా మారింది. కోళ్ల పెంపకం, దాణా, రవాణా ఖర్చులు తగ్గకపోయినా మార్కెట్‌లో ధరలు పడిపోవడంతో నష్టాలు వస్తున్నాయని ఆందోళన చెందుతున్నారు..

మరోవైపు మటన్, చేపల ధరల్లో మాత్రం పెద్దగా మార్పు లేదు. కార్తీకమాసం ప్రభావం చికెన్ మార్కెట్‌పైనే ఎక్కువగా కనిపిస్తోంది. మరి ఈ నెలంతా చికెన్ ధరలు ఇలాగే తగ్గుతాయా? లేదా మళ్లీ పెరుగుతాయా? అనేది చూడాలి..