Kavitha : కేసీఆర్ టార్గెట్‌గా కవిత ఘాటు విమర్శలు.. నా తండ్రి కావొచ్చు.. కానీ.. అంటూ ఓ రేంజ్‌లో ఫైర్..

Kavitha :కేసీఆర్ టార్గెట్ గా ఘాటు విమర్శలు చేసిన కవిత.. కేసీఆర్ బయటకు రాకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. నాకు తండ్రి కావొచ్చు.. కానీ, అంటూ.. ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.

Kavitha

Kavitha : తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తన పార్టీ పేరును ప్రకటించారు. మేడ్చల్ జిల్లాలోని మునీరాబాద్ వేదికగా జరిగిన బహిరంగ సభలో భారీగా పాల్గొన్న జనసంద్రోహం మధ్య కొత్త పార్టీ పేరును ప్రకటించిన కవిత.. వెంటనే పార్టీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ పేరును టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సేన)గా ప్రకటించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సంచలన కామెంట్స్ చేశారు.

Also Read : Telangana politics : బీఆర్ఎస్ అధిష్టానానికి కవిత మాస్టర్ స్ట్రోక్.. ఇక వారి ప్రయత్నాలు విఫలమైనట్లేనా..?

కేసీఆర్ టార్గెట్ గా ఘాటు విమర్శలు చేసిన కవిత.. కేసీఆర్ బయటకు రాకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. నాకు తండ్రి కావొచ్చు.. కానీ, కేసీఆర్ రాజకీయ పరిణితి కోల్పోయారు అంటూ కవిత ఘాటుగా విమర్శలు చేశారు. కేటీఆర్ మాట్లాడితే అనుకోవచ్చు.. ఆయనకు ఏమీ తెలియదు. కానీ, కేసీఆర్ కూడా గెలిపించలేదని.. ప్రజలను తప్పుపడ్తున్నారు అంటూ కవిత అన్నారు. తెలంగాణలో ప్రస్తుతం కార్కోటకుడి పాలన సాగుతోంది అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ కవిత తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇలాంటి సమయంలో ప్రజలకోసం కొట్లాడాల్సిన ప్రతిపక్ష నేత కేసీఆర్ ఎక్కడ అంటూ కవిత ప్రశ్నించారు.

ఆనాటి కేసీఆర్ వేరు.. ఇప్పటి కేసీఆర్ వేరు.. మన మనిషి కాదు.. మర మనిషి కేసీఆర్.. ఏ కష్టమొచ్చినా కేసీఆర్ రారు.. ఎందుకంటే ఆయన మారిన మనిషి. కేసీఆర్ రాజకీయ పరిమితి కోల్పాయారు అంటూ కవిత ఘాటుగా విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తరువాత కాళేశ్వరంలో అవినీతి చేసిన పంది కొక్కులను కేసీఆర్ పక్కన పెట్టుకున్నారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పినందుకు నన్ను బయటకు గెంటేశారు. చిన్నసారును సీఎం చేయడమే బీఆర్ఎస్ అజెండా.

రెండేళ్ల తరువాత అధికారంలోకి వస్తాం.. మనం అధికారంలోకి వచ్చిన తరువాత అందరికీ ఉచిత విద్య, వైద్యం అందిస్తామని కవిత పేర్కొన్నారు. రైతే రాజు అనే నినాదాన్ని ముందుకు తీసుకెళ్తామని, మన ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాదిలో నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని కవిత చెప్పుకొచ్చారు. యువతకు ఉపాధి కల్పిస్తామని, అన్ని వర్గాలకు సామాజిక న్యాయం లక్ష్యంగా పనిచేస్తామని, తద్వారా సామాజిక న్యాయ తెలంగాణ సాధిస్తామని చెప్పారు. మన ప్రభుత్వంలో రైతే రాజు అని కవిత స్పష్టం చేశారు.