K Kavitha TRS Party : కవిత కాకుండా దేశంలో మహిళలు పెట్టిన పార్టీలు ఇవే.. వాటిలో సక్సెస్ అయినవి..
Kavitha TRS Party : మహిళల సారథ్యంలో ఓ వెలుగు వెలిగిన పార్టీల్లో జయలలిత సారథ్యంలోని అన్నాడీఎంకే, మాయవతి సారథ్యంలోని బీఎస్సీలు ఉన్నాయి.
- Harish Thanniru
- Updated on- April 25, 2026 / 03:54 PM IST
Kavitha New Party TRS Parties Founded By Women In Inida
Kavitha TRS party : తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీని ప్రకటించారు. మేడ్చల్ జిల్లా మున్సిరాబాద్ వేదికగా కవిత కొత్త పార్టీని టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సేన)గా ప్రకటించారు. ఆ వెంటనే పార్టీ జెండానూ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రెండేళ్లలో అధికారంలోకి వచ్చేది మనమే అంటూ దీమా వ్యక్తం చేశారు. అయితే, దేశంలో పార్టీలు పెట్టిన మహిళల్లో కవితతో పాటు మరికొందరు ఉన్నారు.
Also Read : కవిత టీఆర్ఎస్‌పై బీఆర్ఎస్ ట్రోలింగ్.. కోల్‌గేట్, బిస్లరీ వాటర్ బాటిల్ ఫొటోలు పెట్టి..
మహిళలు స్థాపించిన పార్టీలు ఇవే..
- 1969 కాంగ్రెస్ ఐ (ఇందిరాగాంధీ),
- 1983 రాష్ట్రీయ సంజయ్ మంచ్ (మేనకా గాంధీ)
- 1998 ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (మమతా బెనర్జీ)
- 2003 ఉమెనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
- 2005 తల్లి తెలంగాణ పార్టీ (విజయశాంతి)
- 2007 యునైటెడ్ ఉమెన్ ఫ్రంట్ (సుమన్ కృష్ణకాంత్)
- 2017 ఆల్ ఇండియా మహిళా ఎంపవర్ పార్టీ (నౌహీరా షేక్)
- 2019 నేషనల్ ఉమెన్స్ పార్టీ (శ్వేతా శెట్టి)
- 2021 వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (వైఎస్ షర్మిల)
- 2025 తెలంగాణ రాష్ట్ర సేన (కల్వకుంట్ల కవిత).
వీటీలో ప్రస్తుతం కొన్ని పార్టీలు మాత్రమే మనుగడలో ఉన్నాయి. మమతా బెనర్జీ సారథ్యంలోని ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అధికారంలో ఉంది. మమతా బెనర్జీ సీఎంగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. మిగతా ప్రాంతాల్లో మహిళలు పెట్టిన పార్టీలు కొద్దికాలం మాత్రమే మనుగుడలో కొనసాగాయి. తెలుగు రాష్ట్రాల్లో దివంగత మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని తెలంగాణలో స్థాపించారు. అయితే, కొద్దికాలంకు ఆ పార్టీని షర్మిల కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ప్రస్తుతం ఆమె ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. సినీ నటి విజయశాంతి కూడా తెలంగాణలో తల్లి తెలంగాణ పార్టీని స్థాపించారు. ఆ తరువాత కాలంలో పార్టీని అప్పటి టీఆర్ఎస్ పార్టీ (ఇప్పుడు బీఆర్ఎస్)లో విలీనం చేశారు. ప్రస్తుతం ఆమె కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. తెలంగాణలో ప్రస్తుతం కవిత ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) పార్టీని తెలంగాణ ప్రజలు ఏ మేరకు ఆదరిస్తారో వేచి చూడాల్సిందే.
Also Read : బీఆర్ఎస్ అధిష్టానానికి కవిత మాస్టర్ స్ట్రోక్.. ఇక వారి ప్రయత్నాలు విఫలమైనట్లేనా..?
మహిళల సారథ్యంలో ఓ వెలుగు వెలిగిన పార్టీల్లో జయలలిత సారథ్యంలోని అన్నాడీఎంకే, మాయవతి సారథ్యంలోని బీఎస్సీలు ఉన్నాయి. ఈ రెండు పార్టీలు జయలలిత, మాయవతి సారథ్యంలో ఆయా రాష్ట్రాలతోపాటు దేశ రాజకీయాల్లో కీలక భూమిక పోషించాయి. జయలలిత గత కొన్నేళ్ల క్రితం మరణించగా.. మాయావతి ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల్లో యాక్టివ్‌గా లేరు. అయితే, కవిత పార్టీ ఆవిర్భావం సందర్భంగా తన ప్రసంగంలో కీలక కామెంట్స్ చేశారు. నేను కూడా ఒక ‘అమ్మ’గా పరిణతి చెందాలనుకుంటున్నా అని చెప్పారు. అంటే తమిళనాడులో జయలలిత తరహాలో తెలంగాణ రాజకీయాల్లో నా పాత్ర ఉంటుందని కవిత చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారని ఆమె ప్రసంగంను బట్టి అర్ధమవుతుందని పలువురు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరి కవిత తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీతో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారనేది వేచి చూడాల్సిందే.
