Kavitha : ఉగాది వేడుకల్లో.. సోనియా, రాజీవ్ గాంధీ పేర్లను ప్రస్తావిస్తూ కవిత కీలక కామెంట్స్.. గత బీఆర్ఎస్ పాలనపైనా..

Kavitha participated in Ugadi celebrations : తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఉగాది వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పాల్గొన్నారు.

Kavitha participated in Ugadi celebrations

  • తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు
  • పాల్గొన్న జాగృతి అధ్యక్షురాలు కవిత
  • కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై కీలక కామెంట్స్

Kavitha participated in Ugadi celebrations : తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు ఉగాది వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలోనూ ఉగాది వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై.. బీఆర్ఎస్ పార్టీపై కీలక కామెంట్స్ చేశారు.

Also Read : CM Revanth Reddy : ఉగాది వేడుకల్లో ‘రైతు భరోసా’పై కీలక విషయాన్ని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. మా లక్ష్యం అదే..

ఈ ఉగాది అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని కవిత ఆకాంక్షించారు. తెలంగాణ జాగృతిగా మనం కంకణం కట్టుకొని బయలుదేరాము. ఇలా బయలుదేరిన సమయంలో మనం బాగుండాలి మనకు నైతికత ఉండాలి. మనమే ఆచరించకపోతే, సమాజం పట్ల నిబద్ధత మనకి ఎలా ఉంటుంది. మనం అబద్ధాలు ఆడుకుంటుపోతే అర్థం పర్థం ఉండదు. మన క్యారెక్టర్‌ను సరిచేసుకుంటూ తెలంగాణ సమాజాన్ని ముందుకు తీసుకొని వెళ్లాలని సూచించారు. ఈరోజు కాంగ్రెస్ అధికారంలో ఉంది , రేపు జాగృతి అధికారంలోకి రావొచ్చు.. ప్రతి ఉగాది నాడు ప్రజా బడ్జెట్‌ను తెలంగాణ జాగృతి ప్రవేశ పెడుతుందని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం 3లక్షల 23వేల కోట్ల బడ్జెట్ ప్రవేశ పెడతారని తెలుస్తుంది. లక్ష కోట్ల బడ్జెట్‌కు సోనియమ్మ పేరు పెట్టుకొనివ్వండి , రాజీవ్ గాంధీ పేరు పెట్టుకొనివ్వండి. 2లక్షల 23వేల కోట్లు ప్రజలకోసం ఖర్చు చేయాలని జాగృతి డిమాండ్ చేస్తుందని కవిత అన్నారు. విద్యా, వైద్యానికి ఎక్కువ నిధులు కేటాయించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు. సోనియాగాంధీ పుట్టిన రోజు లోపు పింఛన్లు పెంచండని కవిత అన్నారు.

పేదలకు ఇల్లు కట్టించడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయిందని కవిత అన్నారు. తెలంగాణ రావడానికి కారణమైన ఉద్యమ కారులకు 5వేల కోట్లు బడ్జెట్ పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కవిత కోరారు. కౌలు రైతులకు 35వేల కోట్లు బడ్జెట్ లో పెట్టాలి. బీసీలకు 20 వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించాలని అన్నారు. దళితులకు కేటాయించిన బడ్జెట్ ను పక్కదారి పట్టిస్తున్నారంటూ కవిత విమర్శించారు.

పరాభవ నామ సంవత్సరం అంటే ఏమిటో కవిత తెలిపారు. ప అంటే పలుకుబడి, రా అంటే రాబడి, భ అంటే భవిష్యత్, వ అంటే వర్ధిల్లాలి.. అని కవిత అన్నారు. తెలంగాణ ప్రజలు అన్ని విధాలుగా వర్ధిల్లాలని ఆమె ఆకాంక్షించారు. కాలానికి అనుగుణంగా నడిచిన వాడే బాగుంటారని పేర్కొన్నారు.