KCR Phone to Megastar: మెగాస్టార్ చిరంజీవికి సీఎం కేసీఆర్ ఫోన్

కరోనా మహమ్మారి సినిమా పరిశ్రమను మరోసారి చుట్టేస్తుండగా.. పలువురు సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు.

Chirajeevi

KCR Phone to Megastar Chiranjeevi: కరోనా మహమ్మారి సినిమా పరిశ్రమను మరోసారి చుట్టేస్తుండగా.. పలువురు సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు.

సెకండ్ వేవ్ సమయంలో రామ్‌చరణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలు కరోనా బారిన పడి కోలుకోగా.. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవికి కరోనా సోకగా ప్రస్తుతం ఆయన ఐసోలేషన్‌లో ఉన్నారు.

ఇప్పటికే తనకు కరోనా సోకిన విషయాన్ని వెల్లడించిన చిరంజీవి.. అన్ని జాగ్రత్తలు పాటిస్తూ హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నట్లుగా చెప్పారు. లేటెస్ట్‌గా మెగాస్టార్ చిరంజీవికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ చేసి పరామర్శించారు.

ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. చిరంజీవి త్వరగా కోలుకోవాలని ఈ సంధర్భంగా కేసీఆర్ విష్ చేశారు.