Telangana elections 2023: ఒంటరిగానే 119 స్థానాల్లో పోటీ.. అభ్యర్థుల జాబితా ప్రకటనపై వివరాలు తెలిపిన కిషన్ రెడ్డి
త్వరలో ఎలక్షన్ కమిటీ వేస్తామని అన్నారు. బీజేపీ తెలంగాణ అభ్యర్థుల ప్రకటన త్వరలోనే..
- T Venkateshwarlu
- Published On : August 29, 2023 / 06:13 PM IST
Kishan Reddy
Telangana elections 2023 – Kishan Reddy: తెలంగాణలో బీజేపీ (BJP) ఒంటరిగానే 119 స్థానాల్లో పోటీ చేస్తుందని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) సస్పెన్షన్ విషయంలో పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.
త్వరలో ఎలక్షన్ కమిటీ వేస్తామని అన్నారు. బీజేపీ తెలంగాణ అభ్యర్థుల ప్రకటన త్వరలోనే ఉంటుందని చెప్పారు. రాఖీ పండుగ వేళ సిలిండర్ పై రూ.200 తగ్గింపు సంతోషకరమని పేర్కొన్నారు. తెలంగాణ విమోచన దినం అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ యాత్ర చేపడుతుందని అన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ప్రజలను కలుస్తామని చెప్పారు.
తమ క్యాడర్ తో మాట్లాడిన అనంతరమే అభ్యర్థుల ప్రకటన ఉంటుందని తెలిపారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు పెట్రోల్ పై అన్ని రాష్ట్రాలు పన్నులను తగ్గించాయని చెప్పారు. తెలంగాణలోని బీఆర్ఎస్ సర్కారు మాత్రం పన్నులను తగ్గించకుండా ప్రజలపై భారం వేసిందని విమర్శించారు.
Chandrababu : ఒంటరిగానే పోటీ, బీజేపీతో పొత్తుకు టైమ్ దాటి పోయింది : చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
