Koushik Reddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు తన భార్య, కూతురిని అడ్డం పెట్టుకుని, వారితో కలిసి వీడియో తీసుకుని హుజూరాబాద్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డి గెలిచారని విమర్శలు వచ్చాయి. దీనిపై కౌశిక్ రెడ్డి 10టీవీ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడారు.
“ఒకటే చెబుతాను. ప్రజల్లో తిరిగి ఓట్లు అడిగే హక్కు నాకు ఉంది. నా వైఫ్‌కు, మా డాటర్‌కు ఉంటది. ఈటల రాజేందర్ చేస్తేనేమో సంసారం, మేము చేస్తే వ్యభిచారమా.. అలా అనడం చాలా తప్పు. సాదుకుంటావా.. చంపుకుంటావా అని ఈటల్ రాజేందర్ అనలేదా?
ఈటల రాజేందర్ సతీమణి మంగళసూత్రం చూయించి, మంగళసూత్రం ఉంచుతారా తెంపుతారా అని అన్నది వాస్తవం కాదా? వాళ్ల కొడుకు, కోడలు, అల్లుడు, వాళ్ల బిడ్డ తిరిగి ఈటలను గెలిపించకపోతే అందరం చనిపోతామని చెప్పింది వాస్తవం కాదా?
హుజూరాబాద్ నియోజక వర్గ ప్రజలు నన్ను ప్రేమించారు కాబట్టి నాకు ఓట్లు వేసి, నన్ను గెలిపించి ఈటల రాజేందర్‌ను ఓడించారు. మొన్న సర్పంచ్ ఎన్నికలలో కూడా ఈటల రాజేందర్ 107 గ్రామ పంచాయతీల్లో ఊరూరు గజ్జ కట్టుకొని తిరిగినా.. ప్రజలు బీఆర్ఎస్ పార్టీని గెలిపించారు. మా నియోజక వర్గ ప్రజల కోసం నిత్యం నేను కొట్లాడుతూనే ఉంటా” అని తెలిపారు.