KTR: ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే బీఆర్ఎస్ కి 78 సీట్లు: కేటీఆర్

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని, ఆ పార్టీ పతనం దాదాపు ఖాయమైపోయిందని కేటీఆర్ (KTR)తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

KTR claimed that if elections were held in the state now, the BRS party would win 78 seats.

  • కాంగ్రెస్ పతనం దాదాపు ఖాయం
  • బీఆర్ఎస్‌కు 78 సీట్లు ఖాయం
  • కేసీఆర్ సీఎం కావాలని ఆకాంక్ష

KTR: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పని ఇక అయిపోయిందని, ఆ పార్టీ పతనం దాదాపు ఖాయమైపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌కు చెందిన బీఆర్ఎస్ ముఖ్య నేతలతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సగం పదవీ కాలం పూర్తి చేసుకున్న నేపథ్యంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చేయించుకున్న అంతర్గత సర్వేలోనే ఈ ప్రజా వ్యతిరేకత స్పష్టంగా తేలిందని కేటీఆర్ వెల్లడించారు. పరిపాలన, నాయకత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ఆయన పేర్కొన్నారు.

Anganwadi Posts: ఇంటర్ పాసైతే చాలు.. అంగన్‌వాడీ ఉద్యోగం.. తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

సర్వేల్లో బీఆర్ఎస్ హవా.. కేసీఆర్ వైపే మొగ్గు:

ప్రస్తుతం రాష్ట్రంలో క్షేత్రస్థాయి పరిస్థితులు పూర్తిగా మారాయని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే భారత రాష్ట్ర సమితి సుమారు 78 సీట్లతో ఘనవిజయం సాధించి, తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని రేవంత్ రెడ్డి సొంత సర్వేలోనే తేలిందని ఆయన వివరించారు. కేవలం ఈ సర్వేనే కాకుండా, రెండు ప్రముఖ మీడియా సంస్థలు, అటు కేంద్ర, ఇటు రాష్ట్ర ప్రభుత్వాల ఇంటెలిజెన్స్ విభాగాలు జరిపిన ప్రజాభిప్రాయ సేకరణలోనూ ఇదే నిజం వెల్లడైందన్నారు. తెలంగాణ ప్రజలు మరోసారి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని బలంగా కోరుకుంటున్నారని సర్వేలు తేల్చిచెప్పాయని పేర్కొన్నారు.

ఫ్రస్ట్రేషన్‌లో ముఖ్యమంత్రి అడ్డగోలు మాటలు:

ఈ వరుస సర్వేల్లో వ్యక్తమైన తీవ్ర ప్రజా వ్యతిరేకతను చూసి తట్టుకోలేకనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత వారం రోజులుగా తీవ్ర నిరాశతో, అడ్డగోలుగా మాట్లాడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ వైఫల్యాలను, ప్రజల్లో వస్తున్న తిరుగుబాటును డైవర్ట్ చేయడానికే సీఎం ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ నేతలంతా ప్రజల్లోనే ఉంటూ, కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలని, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని కేటీఆర్ ఈ సమావేశంలో కేడర్‌కు దిశా నిర్దేశం చేశారు.