KTR : తాతా మధు అరెస్ట్‌పై కేటీఆర్ సంచలన కామెంట్స్.. మేము సిద్ధం.. మీరు సిద్ధమా? కాంగ్రెస్‌కు సవాల్..
KTR Reacts To Tata Madhu Arrest : బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిలను పోలీసులు అరెస్టు చేయడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆయన సవాల్ చేశారు.
- Harish Thanniru
- Published on- September 8, 2026 / 09:13 AM IST
KTR reacts to Tata Madhu arrest
KTR Reacts To Tata Madhu Arrest : సోమవారం అసెంబ్లీ వద్ద జరిగిన పరిణామాల నేపథ్యంలో మంగళవారం ఉదయం బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు. తాతా మధును న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లోని అతని నివాసంలో పోలీసులు అరెస్టు చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను కులం పేరుతో పాటు, అసభ్య పదజాలంతో దూషించారని స్పీకర్ ఓఎస్డీ పొలెపల్లి వెంకటేశం ఇచ్చిన ఫిర్యాదు మేరకు మధుపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆయన్ను ఉదయం అరెస్టు చేసి విచారణ నిమిత్తం నారాయణగూడ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అదేవిధంగా మరో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిని కోకాపేటలోని ఆయన నివాసంలో పోలీసులు అరెస్టు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీల అరెస్టుపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా కీలక కామెంట్స్ చేశారు.
Also Read : ThaTha Madhu Arrest : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అరెస్ట్.. హరీశ్ రావు ఇంటి వద్దకు భారీగా పోలీసులు
కేటీఆర్ ట్వీట్ ప్రకారం.. ‘‘ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయలేకపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం, 1000 రోజుల్లో ఏమి సాధించింది అంటే, అరెస్టులు, అక్రమ నిర్బంధాలు. హామీలు అమలు అవుతాయి అంటే.. బీఆర్ఎస్ పార్టీ ఎమ్యెల్సీ లు, ఎమ్మెల్యేలు అందరూ వచ్చి స్వచ్ఛందంగా అరెస్ట్ అవుతాము! మేము సిద్ధం, మీరు సిద్ధమా?’’ అంటూ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ చేశారు.
మీకు మహిళల పట్ల ఏ మాత్రం గౌరవం ఉన్నా.. సోమవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సబితక్క, సునీతలను చీరలు లాగి, మెడపట్టి గెంటి, కొట్టిన వారిపై ఏమి చర్యలు తీసుకున్నారో చెప్పండి! అంటూ ప్రశ్నించారు. సోమవారం హై కోర్ట్ అంత స్పష్టంగా చెప్పాక కూడా ఈరోజు కావాలని ఫేక్ కేసులు పెట్టి తాతా మధును, నవీన్ రెడ్డిని అరెస్టులు చేశారంటే మీకు కోర్టులు, చట్టాలు పట్ల ఉన్న గౌరవం అర్థం అవుతుంది. ప్రజలు మీ డైవర్షన్ పాలిటిక్స్ ను గమనిస్తున్నారు! అంటూ కేటీఆర్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయలేకపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం, 1000 రోజుల్లో ఏమి సాధించింది అంటే, అరెస్టులు, అక్రమ నిర్బంధాలు.
హామీలు అమలు అవుతాయి అంటే – బీఆర్ఎస్ పార్టీ ఎమ్యెల్సీ లు, ఎమ్మెల్యేలు అందరూ వచ్చి స్వచ్ఛందంగా అరెస్ట్ అవుతాము! మేము సిద్ధం, మీరు సిద్ధమా?
అలానే…
— KTR (@KTRBRS) September 8, 2026
