Tata Madhu Arrest : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అరెస్ట్.. హరీశ్ రావు ఇంటి వద్దకు భారీగా పోలీసులు
Tata Madhu Arrest : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధును పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం ఉదయం న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.
BRS MLCs Tata Madhu and Naveen Reddy Arrested
Tata Madhu Arrest : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధును పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం ఉదయం న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా తాతా మధుపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆయన్ను నారాయణగూడ పోలీస్ స్టేషన్ కు తరలించారు. నారాయణగూడ ఏసీపీ ముత్తయ్య తాతా మధుని విచారించి స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నారు. తాతా మధుతోపాటు మరో ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. కోకాపేటలోని తన నివాసంలో నవీన్ రెడ్డి అరెస్టు చేశారు.
ఇదిలాఉంటే.. అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ప్రారంభం రోజే ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేటీఆర్, హరీశ్ రావుతో పాటు తాతా మధు తదితరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ తాతా మధుతోపాటు మరో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. మాజీ మంత్రి హరీశ్ రావు నివాసం వద్దకు భారీ సంఖ్యలో పోలీసులు చేరుకున్నారు.
సోమవారం అసెంబ్లీ సమావేశాల సమయంలో తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై తాతా మధు అనుచిత వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ పై వ్యాఖ్యలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలకు దిగారు. తాతా మధును అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. తాజాగా.. పోలీసులు తాతా మధును అరెస్టు చేశారు.

