Ktr – Cm Revanth: బండి భగీరథ్ కేసు.. సీఎం రేవంత్ పై కేటీఆర్ సంచలన ఆరోపణలు
తొమ్మిది రోజులు ఒక పోక్సో కేసు నిందితుడిని ఈ దేశంలో ఎక్కడన్నా వదిలిపెట్టారా? మీకు అంత భయం దేనికి?
- Naveen
- Published on- May 22, 2026 / 05:14 PM IST
Ktr – Cm Revanth: బండి భగీరథ్ కేసులో సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి కేటీఆర్. బండి భగీరథ్ ను ఎందుకు కాపాడారని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరూ కలిసి డ్రామాలు చేశారని విరుచుకుపడ్డారు. బాలికపై కౌంటర్ కేసు పెట్టించారని ఆరోపించారు. నిందితుడికి 9 రోజుల పాటు రాచ మర్యాదలు చేశారని సీఎం రేవంత్ పై ధ్వజమెత్తారు. రేవంత్, బండి సంజయ్ మధ్య ఉన్న అనుబంధం ఏంటని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రధాని బందోబస్తులో ఉంటే నేరస్తులకు సెలవులు ఇస్తారా? అంటూ డీజీపీపై ఫైర్ అయ్యారు కేటీఆర్. సెన్సిటివ్ ఇష్యూ కాబట్టే తాము మౌనంగా ఉన్నామన్నారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో నోరు తెరవక తప్పలేదన్నారు.
నిందితుడికి 9 రోజులు రాచమర్యాదలు చేసింది ఎవరు?
”తొమ్మిది రోజులు ఒక పోక్సో కేసు నిందితుడిని ఈ దేశంలో ఎక్కడన్నా వదిలిపెట్టారా? మీ ఇద్దరికి అంత అండర్ స్టాడింగ్ ఏంటి? మీకు అంత భయం దేనికి? ఒక నిందితుడిని నిందితుడిగా చూడాలి. అతడు ఎవరైతే ఏంది? నిందితుడిని సీఎం రేవంత్ ఎందుకు కాపాడారు? కేసు రిజిస్ట్రర్ చేయడానికి భయం. మీడియాలో రాయడానికి భయం. ఈ మేనేజ్ మెంట్ అంతా ఎవరు చేస్తున్నారు? మీరు, మీ ఫ్రెండ్ కాదా? 9 రోజులు ఒక నిందితుడిని దాచి పెడతారా? అదే సామాన్యుడు అయితే పోలీసులు ఊరుకుంటారా? వాళ్ల తల్లిదండ్రులను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో కూర్చోపెట్టరా? ఇక్కడ కేంద్ర మంత్రి కాబట్టి ప్రత్యేక మినహాయింపా? రేప్ చెయ్యి, మర్డర్ చెయ్యి, ఏదైనా చెయ్యి.. కేంద్ర మంత్రి కొడుకు అయితే ముట్టుకోరా? మా దోస్త్ రేవంత్ రెడ్డి ఉన్నాడు కాపాడుకుంటామనా?
బెయిల్ కోసం మీరు ప్రయత్నం చేశారు. అది రాకపోయే సరికి సచ్చినట్లు ఆయన అరెస్ట్ అంటాడు, ఈయన లొంగుబాటు అంటాడు. ఇద్దరూ డ్రామాలు ఆడుతున్నారు. తోడు దొంగలు. సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడుతున్నారు. రాష్ట్రంలోని అమ్మాయిలు అంతా తిడుతున్నారు. ఈ ప్రభుత్వానికి సిగ్గు లేదని. ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే ఇంత దారుణమా?” అంటూ నిప్పులు చెరిగారు కేటీఆర్.
