Harish Rao : BRS ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీ రద్దు .. ఫార్మా సిటీని రీస్టోర్ చేస్తాం.. హరీశ్ రావు కీలక కామెంట్స్
Harish Rao : అమెరికా పర్యటనలో ఉన్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తామని ప్రకటించారు.
Harish Rao
Harish Rao : అమెరికా పర్యటనలో ఉన్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తామని ప్రకటించారు. ఫ్యూచర్ సిటీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందంటూ విమర్శించారు. ఫార్మా సిటీకి కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి ఇచ్చింది. డీవియేషన్ ఉంటే రైతుల భూములు వెనక్కి ఇవ్వాలని పార్లమెంట్ చట్టం ఉంది. కానీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం డ్రామా చేస్తోందని హరీష్ రావు విమర్శించారు.
Also Read : Anganwadi Jobs : నిరుద్యోగ మహిళలకు భారీ శుభవార్త.. 15,982 పోస్టుల భర్తీకి తెలంగాణ సర్కార్ చర్యలు
హైకోర్టులో ఈ మధ్య ఒక కేసు వచ్చింది. మేము ఫార్మా సిటీ కంటిన్యూ చేస్తున్నామని రేవంత్ ప్రభుత్వం కోర్టుకు చెప్పింది. అసలు విషయం ఇదే.. రేవంత్ సర్కార్ కేవలం జిమ్మిక్కు చేస్తోంది. ఫార్మా సిటీ వస్తే దానికి అనుబంధంగా కనీస సౌకర్యాలు ఎడ్యుకేషన్, హౌసింగ్ రావాలని ప్రయత్నం చేశాం. 75శాతం ఫార్మా సిటీ ఉండి.. మిగతా 25 పర్సెంట్ మిగతావి ఉండాలని చూశాం. కానీ, 75శాతం మిగతా వ్యాపారం కేవలం 25శాతమే ఫార్మాసిటీ వచ్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని హరీశ్ రావు విమర్శించారు. మేము అధికారంలోకి వచ్చిన తరువాత ఫార్మాసిటీని రీస్టోర్ చేస్తామని అన్నారు.
ఫార్మాసిటీ వస్తే లక్షలాది మందికి ఉద్యోగాలు వస్తాయని మేము ప్రారంభించాం. మన దగ్గర నుంచి ఒక్క ఫార్మా కంపెనీ బయటకు వెళ్లొద్దని చేశాం. ఇప్పటికే రెండున్నరేళ్లు గడిచిపోయింది. లాస్ట్ సంవత్సరం ఎలక్షన్ ఉంటుంది. భూములు పంచిపెడితే బ్యాక్ ఎండ్ ఎదో లభ్దిపొందాలని ప్లాన్ చేశారు. ఫార్మా సిటీ అభివృద్ధి చెందితే బీఆర్ఎస్ కు పేరు వస్తుందని ఇలా చేశారు. ఈ ప్రభుత్వం ఏం చేసినా నడువదు. కోర్టులో నిలబడదు అని హరీశ్ రావు అన్నారు. ఉన్నదిఉన్నట్లుగా అక్కడ ఫార్మా సిటీనే వస్తుంది అని హరీశ్ రావు చెప్పుకొచ్చారు.
